ప్రియమైన మిత్రులారా.. ఉదయాన్నే నిద్ర లేచి ముందుగా మనం ఏ పని చేస్తామో ఆ పని యొక్క ప్రభావం ముందుగా మన ఫిజికల్ మెంటల్ హెల్త్ పైన ప్రభావం చూపుతుంది. ఉదాహరణకి మీరు ఉదయాన్నే లేచి జిమ్ చేస్తే మీ ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్ చాలా బాగా ఉంటుంది. ఉదయాన్నే లేచి పరగడుపున ఖాళీకడుపుతో టీ తాగడం చాలా చెడు అలవాటు. చాలా మంది ఉదయాన్నే లేచి పరగడుపున ముందుగా టీ తాగుతారు అలా తాగేవారి శరీరం ప్రమాదంలో పడినట్టే. ఉదయాన్నే ఖాళీ కడుపుతో టీ తాగితే ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి.
కొంతమంది ఉదయాన్నే ఖాళీ కడుపుతో గ్రీన్ టీ తాగితే మంచిదేనా అని అనుకుంటారు కానీ ఖాళీ కడుపుతో ఎలాంటి టీ తాగిన ప్రమాదకరమే. ఎందుకంటే వీటిలో ఉండే పదార్థాలు మన శరీరంలో ఉండే రసాయనాలతో కలవడం వల్ల మన కడుపులో ఎసిడిటి పెరుగుతుంది అలాగే కడుపులో గ్యాస్ ఇలా ఎన్నో రకాల సమస్యలు పెరుగుతాయి అందుకే ఖాళీ కడుపుతో ఎప్పుడూ తాగకండి. ముఖ్యంగా పాలతో చేసిన టీ తాగితే చాలా ప్రమాదకరం.
ఉదయాన్నే ఖాళీ కడుపుతో టీ తాగడం వల్ల కలుగు అనారోగ్య సమస్యలు
మీ కడుపులో ఎసిడిటీ పెరుగుతుంది
ఉదయాన్నే ఖాళీ కడుపుతో టీ తాగితే ఎసిడిటీ ఏర్పడి కడుపులో గ్యాస్ ను పెంచుతుంది. అలాగే మన రక్తంలోకి ప్రవేశించి కొద్ది రోజుల్లో మన శరీరానికి కొలెస్ట్రాల్ ప్రాబ్లం, హార్ట్ ఎటాక్ ప్రాబ్లం, లోబిపి, హై బీపీ వంటి సమస్యలు తలెత్తుతాయి.
అధిక బరువు సమస్య ఏర్పడుతుంది
చాలామంది కొవ్వు పదార్థాలు తినడం వల్ల మేము అవుతున్నాము అనుకుంటారు. కానీ అది నిజం కాదు కొన్ని రకాల ఆహార పదార్ధాలు తినడం వల్ల మన శరీరంలో ఉండే డైజెస్టివ్ సిస్టం చెడిపోతుంది అలాగే మెటబాలిజమ్ రేటు తగ్గుతుంది. అందువలన మీరు ఖాళీ కడుపుతో టీ తాగితే నేరుగా మీ జీర్ణక్రియ మీద ప్రభావం చూపుతుంది మెటబాలిజం రేటు తగ్గుతుంది దీనివల్ల మీ పొట్ట పెరుగుతుంది అలాగే లావు అవుతారు.
ఫైల్స్ ప్రాబ్లమ్ ఉంటే టీ తాగకూడదు
ఫైల్స్ మొలల వ్యాధితో బాధ పడేవారు ముఖ్యంగా ఖాళీ కడుపుతో టీ మాత్రం తాగకూడదు. అలాగే మీకు జీవితంలో ఎప్పుడూ మొలల సమస్య రాకూడదనుకుంటే ఖాళీ కడుపుతో టీ తాగడం వెంటనే మానేయండి.
నిద్రపట్టకపోవడం
ప్రస్తుత కాలంలో ఉండే టెన్షన్స్ తో చాలామందికి సరిగా నిద్ర పట్టడం లేదు దీనికితోడు మీరు ఖాళీ కడుపుతో టీ తాగితే ఈ సమస్య ఇంకా పెరుగుతుంది. మీకు మంచి నిద్ర కావాలనుకుంటే ఉదయాన్నే ఖాళీ కడుపుతో టీ తాగడం మానేయండి.
ఆకలి వేయకపోవడం
ఖాళీ కడుపుతో టీ తాగితే మీ జీర్ణ వ్యవస్థ దెబ్బతింటుంది దీనివల్ల రోజురోజుకీ ఆకలి వేయడం తగ్గిపోతుంది. ఖాళీ కడుపుతో టీ తాగడం వల్ల ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తే తెలుసుకున్నారుగా. మీకు అలవాటు ఉంటే వెంటనే మానేయండి . ఇలాంటి మరిన్ని ఆరోగ్యకరమైన విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే ఆ పేజీని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయడం మర్చిపోకండి