side effects of face creams

అందమా…అంధకారమా…..

అందం అనగానే అమ్మాయిలు  గుర్తొస్తారు.  ఫాషన్ ప్రపంచం లో ముఖారవిందం కోసం వచ్చే ఫేస్ క్రీములు కూడా 90% అమ్మాయిలకు సంబంధించినవే.  తాము తక్కువ రంగున్నామని తెల్లని మేని చాయకు తమ చర్మాన్ని మార్చుకోవాలని తపించని అమ్మాయి లేదంటే అతిశయోక్తి కాదు కానీ, క్రీముల్లో ఏముంది?? ఒక్కసారి ఈ నిజాన్ని చూడండి మరి.

ఫేస్ క్రీమ్స్ కావివి పాయిజన్ పుట్టలు.

నిజం కావాలంటే చదవండి మరి.  అందానికి చిరునామా మా ఫేస్ క్రీమ్ అంటూ ప్రచారం చేసుకునే ఏ ఉత్పత్తి లోనూ వారు వాడిన పూర్తి పదార్థాల గురించి బయటకు చెప్పరు. కారణం ఫేస్ క్రీమ్స్ లో దాగిన విషపూరిత రసాయనాల ప్రభావం బయటకు తెలిస్తే వారి అమ్మకాలు ఆగిపోతాయ్. 

             స్కిన్ వైటనింగ్ క్రీముల్లో వాడే మూలపదార్థం అమైనో మెర్క్యురి క్లోరైడ్. దీనికి చర్మానికున్న సహజ మృధుత్వాన్ని నాశనం చేసే మూలకాలు పుష్కలం గా ఉంటాయి.  అంతేకాకుండా ఈ క్రీమ్స్ లో  హైడ్రోజన్ పెరాక్సైడ్, జింక్ ఆక్సైడ్ లేదా మెగ్నీషియం ఆక్సైడ్, ద్రవరూపంలో  ఉండే అమ్మోనియా వాడుతున్నారు. ఇన్ని రసాయనాల కలయిక అయిన క్రీములు మొహానికి పూసుకుని బయటకు వెళ్ళినపుడు సూర్యరశ్మికి రసాయన చర్య జరిగి మొహం మండటం, మొహానికి ఉన్న సహజమైన స్వభావం కోల్పోయి ఆ క్రీములు పూయని సందర్భాలలో మృదుత్వం కోల్పోవడం మాత్రమే కాకుండా, మొహం మీద మచ్చలు ఏర్పడటం  జరుగుతుంది.

అసలు ఈ ఫేస్ క్రీముల్లో ఏం వాడుతారో తెలుసా?

ఫేస్ క్రీముల్లో వాడే పోసినల్ గ్లైకాల్ అనే పెట్రో కెమికల్ వల్ల చర్మము ఎలర్జీ కి గురై, తీవ్రమైన చర్మవ్యాధులకు దారి తీస్తాయి. క్రీమ్స్ ను రెగులర్ గా వాడటం వల్ల చర్మం మీద ఉన్న సహజ రంధ్రాలు మూసుకుపోయి, చర్మం ద్వారా విసర్జింపబడాల్సిన చెమట బయటకు వెళ్లక అలాగే చర్మ రంద్రాల దగ్గర పేరుకుపోయి, మొటిమలు, మంగు, మచ్చలు లాంటి సమస్యలు మనల్ని వెంటాడుతాయి. 

చివరగా……

పై విషయం చదివారు కదా మరి మనం ఫేస్ క్రీములు వాడుతున్నామా లేక కెమిస్ట్రీ లాబ్ లో ఉన్న రసాయనాలన్నీ మొహానికి పూసుకుని భ్రమ పడుతున్నామా అనే సందేహం మీకు రాలేదా చెప్పండి. అందంగా కనబడాలని అనుకోవడంలో తప్పు లేదు కానీ ఇలాంటి క్రీములు పూసుకుని తాత్కాలిక  రంగుతో తృప్తి పడుతూ ఆ తరువాత మొహం మీద పేరుకుపోయిన మచ్చలు, మొటిమలు చూసుకుని బాధపడుతూ ఉండటం కంటే ఆరోగ్యకరమైన విధానం లో అందాన్ని పొందడం చాలా ఉత్తమం. అందాన్ని అందంగా పొందడం ఎలా అనే విషయం తో  మరొకసారి మీ ముందుకు వస్తాను కాసింత ఓపిక పట్టండి.

Leave a Comment

error: Content is protected !!