simple and best home remedy for constipation

ఒకే ఒక్క ఆకు మలబద్ధకం వెంటనే పోతుంది రోజూ సమయానికి తన్నుకొని బయటకు వచ్చేస్తుంది

మలబద్ధకం సమస్య మన రోజువారీ జీవితాన్ని అస్తవ్యస్తం చేస్తుంది. మలబద్ధకం సమస్య ఉన్నవారు ఇబ్బందికి గురవుతుంటారు. అంతేకాకుండా రోజువారీ పనుల పై శ్రద్ధ, ఏకాగ్రత కుదరదు. కడుపు నొప్పి, గ్యాస్ , ఎసిడిటీ వంటి సమస్యలు మలబద్దకంతో పాటు వస్తుంటాయి. అంతేకాకుండా చాలా మందికి దీర్ఘకాలిక మలబద్ధకం ఉన్నవారిలో హేమోరాయిడ్స్ (పైల్స్) అభివృద్ధి, మల ఎండి, గట్టిగా మారి పురీషనాళంలో పేరుకుపోతాయి. ద్రవ మలము యొక్క లీకేజీ మల విసర్జన చేసేటప్పుడు రక్తం పోవడం చిట్లటం వంటి  సమస్యలు ఏర్పడతాయి. అయితే ఈ సమస్యను తగ్గించుకోవడానికి ఆయుర్వేద డాక్టర్లు మంచి ఔషధం సూచిస్తున్నారు.

 దీనిని ఇంట్లో తయారు చేసుకొని మనమే వాడుకోవచ్చు. దీని కోసం మనం కావలసిన పదార్థాలు ఎండు ద్రాక్ష 50 గ్రాములు, సునాముఖి 50 గ్రాములు, పటిక బెల్లం 50 గ్రాములు తీసుకోవాలి. సునాముఖి ఆకుల రూపంలో లేదా చూర్ణం రూపంలో మార్కెట్లో అందుబాటులో ఉంటుంది. ఇది మలబద్ధకం, గ్యాస్ సమస్యలను తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తుంది. ఎండు ద్రాక్ష కూడా మలబద్ధకాన్ని తొలగించి సుఖ విరోచనం జరిగేందుకు సహాయపడుతుంది. ఇప్పుడు  ఈ మూడింటిని మిక్సీ జార్ లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు 5 గ్రాములు ఈ మిశ్రమాన్ని చప్పరిస్తూ తీసుకోవడం వలన ఉదయం లేచే సరికి సుఖ విరోచనం అవుతుంది.

 అలాగే కొంత మందిలో సమస్య మరీ తీవ్రంగా ఉంటే ఉదయం, సాయంత్రం ఔషధాన్ని తీసుకోవచ్చు. దీనిని ఇప్పుడు చెప్పిన కొలతల్లో తయారుచేసుకుంటే ఒక నెలపాటు సరిపోతుంది. ఇంతకంటే ఎక్కువ మొత్తంలో తయారు చేసుకోకూడదు. ఎందుకంటే ఒక నెల తరువాత ఈ మిశ్రమం పాడైపోతుంది. అందుకే ఎప్పటికప్పుడు తాజాగా చేసుకొని వాడుకోవడం మంచిది. ఇంట్లో ఎక్కువ మందికి ఈ సమస్య ఉంటే ఒకసారి తయారు చేసుకొని అయిపోగానే మళ్లీ తయారు చేసుకుంటే ఔషధం యొక్క ఫలితాలను పొందవచ్చు. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని ఔషధం వాడడం వలన మన సమస్యను సహజంగా తగ్గించుకోవచ్చు.

Leave a Comment

error: Content is protected !!