ఇప్పటికాలంలో జీవనశైలి మార్పులవలన చాలామంది ఆర్శమొలలు(ఫైల్స్) తో బాధపడుతున్నారు. దీనికి కారణం మలబద్దకం. మలవిసర్జన చేస్తున్నప్పుడు మలద్వారం వద్ద రక్తనాళాలు ఉబ్బిపోయి చిట్లిపోతాయి. దీనివలన మలంతోపాటు రక్తం కూడా బయటపడుతుంది. ఈ సమస్యను మొలలు అని అంటారు. ఒక్కసారి ఈ సమస్య ఉంటే చాలు మలవిసర్జన సాఫీగా జరగదు. ఆ ప్రదేశంలో నొప్పి, రక్తస్రావం వంటి సమస్యలు కలుగుతాయి.
దీనికి ముఖ్యకారణం మారుతున్న జీవనశైలి, మనం తినే ఆహారం, జంక్ ఫుడ్ ఎక్కువగా తినడం, నీళ్ళు తక్కువగా తీసుకోవడం, ఒకేచోట ఎక్కువగా కదలకుండా కుర్చోవడం, అధికబరువు, ఇలాంటి కారణాల వలన ఫైల్స్ అనేవి వస్తాయి. ఇంట్లోనే దొరికే కొన్ని పదార్థాలతో ఈ సమస్యను సులభంగా తగ్గించుకోవచ్చు. ఈ టిప్ బాబా రాం దేవ్ గారు చెప్పిన సూచన. ఒక అరచెక్క నిమ్మకాయ తీసుకుని గ్లాసు వేడినీటిలో కలపండి మొలలు సమస్యకు నిమ్మకాయ అద్బుతంగా పనిచేస్తుంది.
నిమ్మకాయలో ఉండే సిట్రస్ అనేది మలాన్ని మెత్తగా చేసి మలద్వారానికి సంబంధించిన అన్ని సమస్యలు తగ్గిస్తుంది. మలవిసర్జన ప్రక్రియను వేగవంతం చేస్తుంది. నొప్పి లేకుండా చేస్తుందో. పసుపు తీసుకోవాలి. అది ఆర్గానిక్ పసుపు తీసుకోవాలి. ఈ పసుపు వలన మంచి ఫలితాలు ఉంటాయి. దీనిని కొంచెం గోరువెచ్చని నీటిలో కలిపి తీసుకోవడం వలన ఫైల్స్ ని తగ్గించే గుణాలు మంచి ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా నొప్పి వాపును కూడా తగ్గిస్తుంది.
చివరగా కావలసింది. అదేంటంటే జీలకర్ర పొడి. జీలకర్ర కొంచెం తీసుకుని బాండీలో వేసి డ్రైగా వేయించాలి. ఒక నిమిషం వేయించి తర్వాత చల్లారిన వెంటనే పొడి చేసుకోవాలి. ఆయుర్వేదంలో జీలకర్ర ని అజీర్ణానికి మందుగా వాడతారు. జీలకర్ర శరీరంలో మంటలను, తీపికారం మొలలుబంక విరోచనాలు, ఇలాంటి ఎన్నో జీర్ణసంబంధ సమస్యలు తొలగిస్తాయి. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఇదితిన్న ఆహారం జీర్ణం అయ్యేలా చేసి మలబద్దకం తగ్గేలా చేస్తుంది.
ఈ జీలకర్ర పొడిని కూడా ఒక స్పూన్ ఈ వేడినీటిలో వేసి బాగా కలపాలి. ఇవన్ని బాగా కలపాలి. ఈ డ్రింక్ ఉదయాన్నే పరగడుపున మూడు నుండి ఏడురోజులు పాటు తాగాలి. ఇలా రక్తంతో లేదా రక్తం లేకుండా వచ్చే మొలలు తగ్గిపోతాయి. జీర్ణసమస్యలకు చెక్ పెట్టి గ్యాస్ మలబద్దకం తగ్గించడంలో సహాయపడుతుంది.
మరింత సమాచారం కోసం క్రింద లింక్ చూడండి