ఎవరికైతే నడవడానికి కూడా ఇబ్బంది అవుతుందో అలాంటి వారు నడుము నొప్పి, కీళ్ళ నొప్పులు, జాయింట్ పెయిన్స్ ఇలా అన్నిరకాల కీళ్ళనొప్పులకతో బాధపడేవారు ఇంట్లో తయారు చేసిన ఈ కషాయం ఒక కప్పు తాగితే చాలు. మన శరీరంలో మెడనొప్పి నుండి నడుము, పాదాల నొప్పులకు, మలబద్దకం, గ్యాస్ ఎసిడిటీ వీటన్నింటికీపరిష్కారం లభిస్తుంది. కారణం మన శరీరంలోని వాతం . వాతము అంటే వాయువు.
వాయువు అంటే గ్యాస్. ఈ గ్యాస్‌ను బయటకు పంపకపోతే గ్యాస్ శరీరంలోని ప్రతిభాగానికి చేరుకుంటుంది. కీళ్ళలోని మధ్యభాగాన్ని చేరి లూబ్రికెంట్స్ చుట్టూ పాడుచేస్తాయి. దీనివలన కీళ్ళనొప్పులు, ఎముకలు మధ్య నొప్పి, టకాటకా శబ్దం రావడం, నడుము నొప్పులు, వెన్ను నొప్పి, అన్నిరకాల నొప్పులకు ఈ వాతపునొప్పులే కారణమవుతాయి.
అంతటితో ఆగక మలబద్దకం, కడుపులో గ్యాస్, ఎసిడిటీ, ఆకలి సరిగా వేయకపోవడం, చర్మంపై మొటిమలు మచ్చలు, చర్మసంబంధ అనారోగ్య సమస్యలు, జుట్టు రాలడం, తెగడం వంటి సమస్యలు వస్తాయి. శరీరంలోని ఎనభైకి పైగా వ్యాధులు రావడానికి ఈ వాతమే కారణం. ఒంట్లో ఏర్పడే తలనొప్పి నుండి పాదాల వరకూ నొప్పి అన్ని నొప్పులను తగ్గించుకోవడానికి గ్యాస్‌ను అదుపు చేసుకోవడమే మార్గం.
మరి ఎలా అదుపు చేయాలంటే జీర్ణాశయాన్ని సక్రమంగా పనిచేసేలా చేయాలి. అందుకే జీర్ణవ్యవస్థ మెరుగ్గా పనిచేయడానికి దోహదపడే ఈ కషాయాన్ని తయారు చేసుకోవడం తెలుసుకోండి. మీ జీర్ణవ్యవస్థ సులువుగా శుభ్రంచేసి శరీరంలోని వ్యర్థాలను, విషపదార్థాలు అన్నీ బయటకు పంపడానికి ఈ కషాయం చక్కగా పనిచేస్తుంది. మలబద్దకం తగ్గించి మళ్ళీ జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉండేలా,శరీరానికి పోషకాలను అందించేలా చేస్తుంది.
ఈ నీటిని రక్తపోటు ఉన్నవారు, గర్బవతులు, పిల్లలకు పాలిచ్చే వారు తాగకూడదు. ఈ ద్రవం శరీరంలో వాతాన్ని తగ్గించి కీళ్ళనొప్పులు తగ్గడానికి సహాయపడుతుంది. అలాగే ఒక గిన్నెలో రెండు గ్లాసుల నీటిని తీసుకుని పావుస్పూన్ శొంఠి తీసుకుని ఒక స్పూన్ వాము మరియు ఒక బిర్యానీ ఆకు వెసి మరిగించాలి. ఇవన్నీ పేగులను శుభ్రంచేసి జీర్ణవ్యవస్థ మెరుగైన పనితీరుకు సహాయం చేసి మలబద్దకం, గ్యాస్ దూరంచేస్తాయి.
అలాగే ఒకగిన్నెలో ఒక స్పూన్ వాము వేయాలి.అందులో అరస్పూన్ శొంఠిపొడిని కలపాలి. శొంఠి శరీరంలో వాత ,పిత్త దోషాలను సరిచేసి జీర్ణవ్యవస్థను ఆరోగ్యవంతంగా చేస్తే , బిర్యానీ ఆకు రక్తవృద్ధి చేస్తుంది. రక్తనాళాల్లో పేరుకున్న మలినాలు శుభ్రంచేసి రక్తప్రసరణ సరిగ్గా జరిగేలా చేస్తుంది. ఇప్పుడు నీళ్ళు బాగా మరిగాక వడకట్టి ఇందులో ఒక స్పూన్ బెల్లంపొడి కలపాలి. బెల్లంలో పుష్కలంగా ఉండే ఐరన్ వలన రక్తహీనత కూడా తగ్గుతుంది.
దీనిని రోజులో ఒకసారి తీసుకోవాలి. ఏ సమయంలో తీసుకున్నా గోరువెచ్చగా టీలా ఉన్నప్పుడే తీసుకోవాలి. వీటితో పాటు జీవనశైలిలో, ఆహారంలో మార్పులు చేసుకోవాలి. దుంపకూరలు తినడం, ఒకే భంగిమలో కూర్చోవడం తగ్గించాలి. అలాగే రోజూ గంటసేపు వ్యాయామం చేయడం లాంటివి మొదలుపెట్టండి.
EXCELLENT