మెడ వెనుక నల్లగా ఉండి చూడడానికి అంత బాగుండదు. మిగతా శరీరమంతా మంచి రంగులో ఉన్నా మెడ నల్లబడి ఇబ్బంది పడుతూ ఉంటారు. దీనికి కారణం అధిక బరువు పెరగడం లేదా తగ్గడం, పిచ్చి నగలు వాడటం, గరుకుగా ఉండే ఆభరణాలు ధరించడం, సరైన శ్రద్ధ చూపకపోవడం మరియు ఆందోళన వంటివి మెడ వెనుక భాగంలో నల్లగా ఉండటానికి కారణం అవుతుంటాయి. వీటిని తగ్గించడానికి సరైన ప్రొడక్ట్స్ కూడా అందుబాటులో ఉండవు.
ఈ మెడ వెనుక నల్లగా ఉన్న ప్రాంతాన్ని తెల్లగా చేయడానికి మనం ఇప్పుడు రెండు చిట్కాలను తెలుసుకోబోతున్నాం. పెసలు చర్మ రంగును పెంచుతాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇవి చిన్న పిల్లలకి నలుగుపిండిలో కూడా ఎక్కువగా వాడుతూ ఉంటారు. అందుకే పెసలను తీసుకొని మెత్తని పొడిలా చేసుకొని పక్కన పెట్టుకోవాలి.
ఇది స్క్రబ్లా ఉపయోగపడుతుంది. దీనిని మెడ ప్రాంతానికే కాకుండా బాడీ స్క్రబ్ గా, ఫేస్ స్క్రబ్ గా కూడా ఉపయోగించవచ్చు. దీనిని రెండు స్పూన్లు ఒక గిన్నెలోకి తీసుకోవాలి. దీనిలో సరిపడినంత తేనె వేసి బాగా కలిపి మెడ వెనుక ప్రాంతాన్ని బాగా స్క్రబ్ చేయాలి. తరువాత రెండు నిమిషాలు అలాగే ఉంచి తర్వాత నీటితో శుభ్రం చేసుకోవాలి.
ఇలా చేయడం వలన మెడ వెనుక పేరుకున్న నల్లటి టైం జిగురు, మురికి వదిలి తెల్లగా తయారవుతుంది. కనీసం వారానికి రెండు 3 సార్లు ప్రయత్నించవచ్చు. మెడ తెల్లబడడం మొదలుపెట్టాక వారానికి ఒకసారి వాడితే సరిపోతుంది. మరొక చిట్కా కోసం ఒక బౌల్లో ఒక విటమిన్ ఈ క్యాప్సిల్స్ వేసుకోవాలి. అందులో ఒక స్పూన్ గ్లిజరిన్, ఒక స్పూన్ ఆలివ్ ఆయిల్ వేసుకోవాలి. ఈ మూడింటిని బాగా కలిపి ఒక గ్లాస్ జార్లో నిలవ చేసుకోవచ్చు.
ఈ మిశ్రమాన్ని రాత్రి అప్లై చేసి ఉదయం వరకు వదిలేయవచ్చు. ఇందులో వాడిన గ్లిజరిన్ మురికి, జిడ్డును వదిలేస్తే విటమిన్ ఈ క్యాప్సిల్స్ చర్మాన్ని తెల్లగా చేస్తుంది. ఆలివ్ ఆయిల్ చర్మాన్ని తేమగా చేసి చర్మంలోని మెరుపును తిరిగి అందిస్తుంది. దీనిని చర్మం రంగు మెరుగుపడే వరకు రోజూ ఉపయోగించాలి. ఈ రెండు టిప్స్ మెడ వెనుక ప్రాంతాన్ని తెల్లగా చేయడంలో మనకు చాలా బాగా దోహదపడతాయి.