Simple Ayurvedic Home Remedies to Control Blood Sugar Levels

డైలీ కళ్ళ ముందే కనిపించే షుగర్ ని తిప్పి కొట్టె వజ్రం ఇదే…

 పెద్దలకు షుగర్ వ్యాధి అనేది ఇన్సులిన్ రెసిస్టెన్సి వల్ల వస్తుంది. ఇది టైప్ టు డయాబెటిస్. ఇది అందరూ చెప్పేది. ఇన్సులిన్ నిరోధకత వచ్చి అంటే మన శరీరం కణాలు ఇన్సులిన్ చెప్పిన మాట వినకపోవడం వలన రక్తంలో ఉన్న గ్లూకోజ్ కణం లోపలికి వెళ్లడం లేదు. ఇన్సులిన్ వెళ్ళమని చెప్తుంది కానీ ఇన్సులిన్ వెళ్ళమని చెప్పినట్టు గ్లూకోస్ కణం లోపలికి వెళ్లడం లేదు. దీనిని ఇన్సులిన్ రెసిస్టేన్స్ అంటారు. ఇలా వచ్చే టైపు టు డయాబెటిస్ తగ్గించుకోవడానికి, ఇన్సులిన్ రెసిస్టేన్స్ తగ్గించుకోవడానికి, ఇన్సులిన్ సెన్సిటివిటీని అంటే ఇన్సులిన్ చెప్పిన మాట వినేట్టు చేయడానికి అల్లం ఉపయోగపడుతుంది.

                           ఇది సైంటిఫిక్ గా నిరూపించబడింది. దీనిని ఎవరు నిరూపించారు అంటే 2015 సంవత్సరంలో తెహ్లాన్ యూనివర్సిటీ మెడికల్ ఆఫ్ సైన్సెస్ ఇరాన్ వారు. అల్లం లో ఉండే జింజారాల్స్ అనే కెమికల్ కాంపౌండ్ ముఖ్యంగా ఇన్సులిన్ రెసిస్టేన్స్ తగ్గించి ఇన్సులిన్ సెన్సిటివిటిని పెంచి ఇన్సులిన్ చెప్పినట్టు కణాలు బాగా మాట వినేటట్లు చక్కెర రక్తం లోంచి కణం లోకి చక చక వెళ్ళేటట్లు అల్లం లో ఉండే జింజారాల్స్ బాగా ఉపయోగపడుతున్నాయి అని నిరూపించారు. అల్లంను రోజుకు రెండు నుంచి ఐదు గ్రాములు వరకు తీసుకోవాలి.

                        ఇలా తీసుకున్నప్పుడు ఈ ఫలితం 12 రోజుల్లో ఎంత వస్తుంది అని డయాబెటిక్ కంట్రోల్ చేసే విషయంలో అని సైంటిఫిక్ గా తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలు 12 శాతం 12 రోజుల్లోనే తగ్గుతున్నాయి. హెచ్.బీ. ఎ.వన్,సి మూడు నెలల డయాబెటిస్ యావరేజ్ చూసుకుంటే ఇది 12 రోజుల్లోనే 10% తగ్గింది. కాబట్టి ఇటువంటి అల్లంను వంటల్లో వాడుకోవడం అనేది డయాబెటిస్ పేషెంట్స్ కు ఈ రూపంలో చాలా మంచిది. మీరు తాలింపులో నూనె బాగా మరిగినప్పుడు అల్లం ముక్కలు వేస్తే అందులో ఉండే వేడికి ఇందులో ఉండే జింజారాల్ అనే కెమికల్ కాంపౌండ్స్ తగ్గిపోతాయి.

                       కనుక నూనె వేడి తగ్గిన తర్వాత అల్లం లేదా అల్లం పేస్ట్ వేయడం ద్వారా అందులో ఉండే కెమికల్ కాంపౌండ్స్ తగ్గిపోవు. ఇలా చేయడం ద్వారా మంచి ఫలితాలు పొందవచ్చు. కనుక ఈ రకంగా వాడుకుంటే డయాబెటిస్ వచ్చిన వారికి లేదా డయాబెటిక్ లేనివారికి రాకుండా అల్లం బాగా ఉపయోగపడుతుంది…

Leave a Comment

error: Content is protected !!