best homeremedy for teeth cavities

2 నిముషాల్లో మీ పిప్పి పన్ను లో ఉన్న పురుగులు మాయం చేసే అద్భుతమైన చిట్క

హలో ఫ్రెండ్స్ ఈ రోజు మనం దంత సమస్యలకు చెక్ పెట్టే ఒక అద్భుతమైన ఆయుర్వేదిక్ హోమ్ రెమెడీ గురించి తెలుసుకుందాం. దంతక్షయం అంటే దంతాలు పుచ్చిపోవడం, పిప్పి పన్ను లేదా పన్ను నొప్పి అనేది దంత సమస్యలు వచ్చే సాధారణ సమస్యలు. ఈ రోజుల్లో పిల్లల నుండి పెద్దల వరకు అందరూ ఈ సమస్యలను ఎదుర్కొంటున్నారు. దీనికి ముఖ్య కారణం కావిటీస్ (Cavities). అంటే మనం ఏదైనా ఆహారం తిన్నప్పుడు పళ్లను సరిగా శుభ్రం చేసుకోకపోవడం వలన పళ్ళ మధ్య ఎంతో కొంత ఆహార పదార్థాలు ఇరుక్కొని ఉంటాయి. దీని వల్ల పళ్ల మధ్యలో బ్యాక్టీరియా ఉత్పన్నమవుతుంది. ఈ  బ్యాక్టీరియా దృఢమైన దంత నిర్మాణాన్ని దెబ్బతీస్తాయి తద్వారా కణజాలాలు నాశనం అయ్యి దంతాలకు రంధ్రం ఏర్పడుతుంది. దీనిని మనం పిప్పిపళ్లు లేదా దంతాలలో క్రిములు చేరాయి అని అంటూ ఉంటాం. దీని కారణం చేతనే దంతాలలో విపరీతమైన నొప్పి పుడుతుంది.

పూర్వ కాలంలో మన తాతముత్తాతలు 80 ఏళ్ల వయసులో కూడా చక్కటి పళ్ళ వరుసతో  ఆరోగ్యమైన దంతాలతో ఉండేవారు. దీనికి కారణం వారు కొన్ని చిట్కాలను పాటించేవారు.  వీటి సహాయంతో వారి దంతాలలో  బ్యాక్టీరియా చేరకుండా కాపాడుకొనే వారు. అలాగే వారి దంతాలు కూడా చాలా ఆరోగ్యంగా ఉండేటివి. ఈ పిప్పి పళ్ళు తీవ్రమైన నొప్పిని కలిగిస్తుంది ఇదొక పెద్ద సమస్య మారి వేధిస్తుంది. ఈ బాధ భరించలేక డాక్టర్ దగ్గరికి వెళ్లి దంతాలను తీయించుకుంటారు. ఇలాంటి సమస్య వచ్చినప్పుడు దంతాలను పీకించుకోకుండా ఇప్పుడు చెప్పబోయే రెమిడీలు పాటించండి. పూర్తి వివరాలకు ఈ క్రింది వీడియో చూడండి.

ఈరోజు మనం ప్రకృతిలో లభించే సీతాఫలం చెట్టు యొక్క ఆకులను ఉపయోగించి పిప్పి పన్ను నొప్పి ని ఎలా తగ్గించుకోవచ్చు తెలుసుకుందాం.

ముందుగా కొన్ని సీతాఫలం ఆకులు తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ముద్దగా నూరండి. ఒక పేస్టు లాగా తయారు అయ్యే అంతవరకు బాగా నూరండి. తర్వాత ఇందులో పావు స్పూన్ కంటే తక్కువ ఇంగువను కలపండి. ఈ రెండింటినీ బాగా కలిపి నూరండి. ఇలా తయారైన మిశ్రమాన్ని టూత్ పికర్ సహాయంతో మీకు ఎక్కడైతే పిప్పి పన్ను సమస్య ఉందో అక్కడ దీనిని రెండు నిమిషాల వరకు ఉంచండి. ఇలా పెట్టడం వలన మీ పంటి లోపల ఉన్న పురుగు దీని ఘాటు వాసనకు బయటకు రావడం జరుగుతుంది లేదా చనిపోవడం జరుగుతుంది. లేదా మిశ్రమాన్ని ముద్దగా చేసి ఎక్కడైతే మీకు పిప్పిపన్ను ఉందో దానిపై ఉంచండి. ఇలా చేయండం వల్ల మీ పిప్పి పన్ను వల్ల వచ్చే నొప్పి కూడా ఇలా చేయడం వల్ల తగ్గుతుంది. 2 నిముషాలు తరువాత ఈ మిశ్రమాన్ని బయటకు ఉమ్మి వేయాలి. ముఖ్య గమనిక మీరు గర్భవతిగా ఉంటే ఈ రెండిటిని ఉపయోగించకూడదు

ఒక కలబంద ఆకును తీసుకుని దాని లోపల గుజ్జును తీసి మీ పిప్పి పన్ను మీద పెట్టండి. ఈ విధంగా రెండు మూడు నిమిషాలు ఉంచిన తరువాత అలోవేరా గుజ్జును ఉమ్మివేయండి. అలోవెరా లో ఉన్న ఔషధ గుణాల వల్ల పిప్పి పన్ను సమస్య దూరమై దాని వల్ల వచ్చే నొప్పి కూడా తగ్గిపోతుంది. ముఖ్యమైన విషయం ఏమిటంటే అలోవెరా కోసిన వెంటనే పసుపు రంగులో లిక్విడ్ వస్తుంది అది మన శరీరానికి అంత మంచిది కాదు కావున అది పూర్తిగా కాలిపోయిన తర్వాత ఆకులను శుభ్రం చేసుకుని కలబంద ఉపయోగించాలి.

Leave a Comment

error: Content is protected !!