జుట్టు రాలడం సమస్య ప్రతి ఒక్కరికీ చాలా ఎక్కువగా ఉంది. దానికి కారణం వాతావరణ కాలుష్యం, అధిక ఒత్తిడి, విటమిన్ డెఫిషియెన్సీ. మనం రోజు నిద్ర పోవాల్సిన అంతా నిద్ర లేక పోయిన పని ఒత్తిడి ఎక్కువైనా సరే చుట్టడం సమస్య ఎక్కువగా ఉంటుంది అలాగే శరీరంలో కావాల్సిన పోషకాలు లోపించినప్పుడు కూడా జుట్టు రాలడం సమస్య ఎక్కువగా ఉంటుంది. జుట్టు రాలడం తగ్గించుకోవడం కోసం పై నుండి ఎన్ని అప్లై చేసిన కూడా తీసుకోవాల్సిన ఆహారం తీసుకున్నట్లైతే జుట్టు రాలడం సమస్య తగ్గుతుంది. విటమిన్ డెఫిషియెన్సీ, హార్మోన్ ఇన్ బ్యాలెన్స్ సమస్యలు తగ్గించుకుంటూ జుట్టుకు ఈ హెయిర్ ప్యాక్ ను ఉపయోగించినట్లయితే జుట్టు రాలడం తగ్గి జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరుగుతుంది.
దీనికోసం ముందుగా మనం కలబంద మట్టలను తీసుకుని శుభ్రంగా కడిగి అంచులను కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లో వేసుకోవాలి. అలోవెరా జుట్టు రాలడాన్ని తగ్గించి జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరగడంలో సహాయపడుతుంది. చుండ్రు, ఇన్ఫెక్షన్స్ వంటి సమస్యలను కూడా తగ్గిస్తుంది. జుట్టు సిల్కీగా మెరిసేలా చేస్తుంది. తర్వాత ఒక ఉల్లిపాయ తీసుకుని పొట్టు తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్ లో వేసుకోవాలి. ఉల్లిపాయలో ఫాస్పరస్ అధికంగా ఉండటం వల్ల ఇది జుట్టు రాలడం తగ్గించి జుట్టు ఒత్తుగా , పొడవుగా పెరగడంలో సహాయపడుతుంది.
తర్వాత నాలుగు లేదా ఐదు రెబ్బలు కరివేపాకుని తీసుకుని శుభ్రంగా కడిగి వేసుకోవాలి. కర్వేపాకు జుట్టు కుదుళ్లు బలంగా చేసి జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. జుట్టు బీటా కెరోటిన్ అందించడంలో సహాయపడుతుంది. తెల్ల వెంట్రుకలు తగ్గించి జుట్టు నల్లగా, పొడవుగా పెరగడంలో సహాయపడుతుంది. కరివేపాకు ఆహారంకూడా లో తీసుకోవడం వల్ల తెల్ల వెంట్రుకలు రావడం తగ్గుతుంది. దీనిలో రెండు చెంచాల నీళ్ళు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు అప్లై చేసుకున్న తర్వాత ఒక అరగంట పాటు ఆరనివ్వాలి. తర్వాత ఏదైనా మైల్డ్ షాంపూతో తలస్నానం చేయాలి.
ఇలా వారానికి రెండు సార్లు చేయడం వల్ల జుట్టు రాలడం తగ్గి జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరుగుతుంది. ఈ ప్యాక్ అప్లై చేసుకుంటూ జుట్టుకు కావలసిన పోషకాలను ఆహారం ద్వారా అందిస్తూ ఉండాలి. రోజుకి 9 గంటల పాటు నిద్ర పోవాలి. పని ఒత్తిడిని ఎక్కువగా తీసుకోకూడదు. ఇలా చేసినట్లయితే జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరుగుతుంది. ఒక వారం రోజులలోనే తేడా గమనిస్తారు.