Simple home remedies for cold and cough

ఊపిరితిత్తులలో శ్లేష్మం విసిగిస్తోందా?? ఈ చిట్కాలతో సులువుగా తరిమికొట్టండి!!

ఊపిరితిత్తుల వాపు మరియు ఛాతీలో శ్లేష్మం ఏర్పడటం వల్ల శ్వాసలోపం, నిద్ర ఇబ్బందులు మరియు గొంతు నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయి.  ఈ శ్లేష్మం దగ్గుతో కూడిన కఫాన్ని కలుగజేస్తుంది.

  ఈ క్రింది సమస్యలు ఛాతీలో శ్లేష్మం ఏర్పడటానికి కారణమవుతాయి:

  •  ఆమ్లాలు ఉత్పత్తి అవ్వడం
  •  అలెర్జీలు
  •  ఉబ్బసం
  •  బాక్టీరియల్ మరియు వైరల్ ఇన్ఫెక్షన్లు
  •  దీర్గకాలిక శ్వాసకోశ సంబంధిత వ్యాది
  •  దీర్ఘకాలిక అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ (COPD)
  •  సిస్టిక్ ఫైబ్రోసిస్

 ఇతర ఊపిరితిత్తుల సమస్యలు మొదలైనవి. అయితే కొన్ని చిట్కాలు పాటించడం వల్ల ఊపిరితిత్తులలో శ్లేష్మాన్ని తగ్గించుకోవచ్చు.

శ్లేష్మం తగ్గించడానికి ఇంటి చిట్కాలు:

 గోరువెచ్చని పానీయాలు

 వేడి పానీయాలు ఛాతీలో శ్లేష్మం ఏర్పడటం నుండి తక్షణ మరియు దీర్ఘకాలిక ఉపశమనాన్ని ఇస్తాయి.ఇవి తుమ్ము, దగ్గు, గొంతు నొప్పి మరియు చలి వంటి లక్షణాల నుండి తక్షణ మరియు దీర్ఘకాలిక ఉపశమనం అందిస్తాయి.

 ఆవిరి పట్టడం

 ఆవిరి పట్టడం శ్వాస నాళంలో అడ్డంకులు, ఊపిరితిత్తులలో దాగున్న నెమ్ము మొదలైన సమస్యలు తగ్గడానికి మంచి మార్గం.  నిద్రించడానికి ఇబ్బంది ఉన్నవారు రాత్రి సమయంలో ఆవిరి పట్టడం వల్ల అడ్డంకులు  తొలగి మంచి నిద్ర సొంతమవుతుంది. 

 ఉప్పునీరు

 ఉప్పు మరియు వెచ్చని నీటి మిశ్రమంతో గార్గ్లింగ్ (పుక్కిలించడం) చేయడం వల్ల గొంతు నుండి కఫం మరియు శ్లేష్మం తొలగించవచ్చు.

 ఒక కప్పు వెచ్చని నీటిలో అర టీస్పూన్ ఉప్పు కలపాలి.  ఉప్పు కరిగిపోయిన తరువాత ఆ నీటిని నోట్లో పోసుకుని గొంతులోపలి భాగానికి తగిలేలా పుక్కిలించాలి. దీనివల్ల చాలా గొప్ప ఉపశమనం ఉంటుంది.

 తేనె

 తేనె ఒక ప్రసిద్ధ గృహ నివారణ, ఇది యాంటీవైరల్ మరియు యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంటుంది. 

 పిల్లలలో  ప్రామాణిక మందులతో లేదా చికిత్సతో పోలిస్తే తేనె దగ్గు, శ్వాస ఇబ్బందులు, ఆయాసం మొదలైన లక్షణాల నుండి ఉత్తమ ఉపశమనం ఇస్తుంది..

 పై లక్షణాలు తగ్గే వరకు  ప్రతి 3 నుండి 4 గంటలకు 1 టేబుల్ స్పూన్ తేనెను తీసుకోవచ్చు. అయితే 12 నెలల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు తేనె ఇవ్వడం మంచిది కాదు.  

ఆహారాలు మరియు మూలికలు

 దగ్గు, జలుబు మరియు శ్లేష్మం నుండి ఉపశమనం కోసం సాధారణంగా ఉపయోగించే ఆహారాలు:

  •  వెల్లుల్లి
  •  అల్లం
  •  నిమ్మకాయ

 అదనపు శ్లేష్మానికి కారణమయ్యే శ్వాసకోశ వైరస్ల చికిత్సకు కిందివి సహాయపడతాయి.

  •  బెర్రీలు
  •  జామ
  •  దానిమ్మ
  •  జింక్

 ముఖ్యమైన నూనెలు

 కొన్ని ముఖ్యమైన నూనెలు శ్వాసను సులభతరం చేస్తాయి మరియు ఛాతీలో శ్లేష్మం తొలగిస్తాయి వాటిలో ముఖ్యమైనవి

  •   తులసి
  •  దాల్చిన చెక్క బెరడు
  •  యూకలిప్టస్
  •  నిమ్మకాయ
  •  పిప్పరమెంటు
  •  రోజ్మేరీ
  •  తేయాకు 
  •  థైమ్

 ఒరేగానో వీటితో తయారయ్యే నూనెలు సీసా నుండి నేరుగా పీల్చుకోవచ్చు, లేదా ఆవిరి పీల్చడంలో వేడి నీటిలో చేర్చవచ్చు.

చివరగా……

  పైన పేర్కొన్న ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ముఖ్యమైన నూనెలలో 12 చుక్కలను పావు కప్పు కొబ్బరి నూనెలో కలపాలి ఈ మిశ్రమాన్ని ఛాతీకి పూయాలి. దీనివల్ల చక్కని ఉపశమనం ఉంటుంది. 

Leave a Comment

error: Content is protected !!