టిప్ 1: తల స్నానం చేసినపుడు జుట్టు ఆరబెట్టుకోవడం కోసం హెయిర్ డ్రైయర్ వంటి హీట్ వచ్చే ఎలక్ట్రికల్స్ ఉపయోగించడం వలన జుట్టు రాలడం, పాడవడం వంటి ఇబ్బందులు వస్తాయి. జుట్టు ఆరబెట్టుకోవడం కోసం కొద్దిసేపు ఎండలో నిలబడటం లేదా ఫ్యాన్ గాలికి ఆరబెట్టుకోవడం మంచిది.
టిప్ 2: తల స్నానం చేసిన వెంటనే జుట్టు దువ్వకూడదు. తడిగా ఉన్నపుడు దువ్వడం వలన జుట్టు కుదుళ్ళు బలహీనం అయ్యి జుట్టు ఊడటం ఎక్కువ అవుతుంది. అలాగే తడి జుట్టు ఉన్నపుడు జడ వేసేసుకోవడం రబ్బర్ బ్యాండ్ పెట్టుకోవడం వంటివి చేయడం వలన ఫంగల్ చేరి ఇన్ఫెక్షన్, చుండ్రు వంటి సమస్యలు వస్తాయి. జుట్టు ఆరిన తర్వాత మాత్రమే దువ్వడం, జడ వేసుకోవడం చేయాలి. దీని వలన జుట్టు రాలడం తగ్గి జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరుగుతుంది.
టిప్ 3: జుట్టు తడిగా ఉన్నప్పుడు ఆయిల్ అప్లై చేయకూడదు. అంటే తలస్నానం చేసిన వెంటనే నూనె అప్లై చేస్తారని కాదు చెమట ఎక్కువగా ఉన్నప్పుడు లేదా బయటికి వెళ్లి రాగానే చమటలు పట్టి ఉంటాయి. ఆ టైములో ఆయిల్ అప్లై చేస్తారు. ఇలా చేయడం వల్ల కూడా జుట్టు రాలటం ఎక్కువ అవుతుంది.
టిప్ 4: ఆయిల్స్, షాంపూలు ఎప్పుడూ ఒకటే ఉపయోగించడం వల్ల జుట్టు పెరగడం ఆగిపోతుంది. వాటిని రెండు వారాలకొకసారి మారుస్తుండాలి. ఇలా చేయడం వల్ల జుట్టు రాలడం తగ్గి జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరుగుతుంది.కుదిరితే హోమ్ మేడ్ షాంపూ ఉపయోగించడం మంచిది.
టిప్ 5: మనం తీసుకునే ఆహారంలో పోషకాహార లోపం వలన జుట్టు రాలిపోతుంది. ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్, కాల్షియమ్, ఐరన్ మన శరీరానికి కావాల్సిన మోతాదులో లేకపోవడం వలన జుట్టు ఎక్కువగా రాలిపోతుంది. మన శరీరానికి అవసరమైన పోషకాలు అందే విధంగా ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి.
టిప్ 6 : శరీరంలో నీటి శాతం తగ్గడం వలన కూడా జుట్టు రాలిపోతుంది. నీటి శాతం తగ్గిపోవడం వల్ల శరీరం తో పాటు జుట్టు కూడా డీహైడ్రేట్ అవుతుంది. కాబట్టి మన శరీరానికి ఎంత నీరు అవసరమో రోజులు అంత మీరు తీసుకున్నట్లయితే తగ్గుతుంది. సీజన్‌తో సంబంధం లేకుండా ప్రతి సీజన్లో మన శరీరానికి అవసరమైన నీటిని అందించాలి.
టిప్ 7 : జుట్టు కోసం రకరకాల మార్కెట్లో దొరికే ప్రొడక్ట్స్ ని ఉపయోగిస్తారు. వీటివలన సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. మీకు కావాలంటే హెయిర్ ప్యాక్స్, హెయిర్ ఆయిల్, హెయిర్ సీరం వంటివి ఇంట్లో తయారు చేసి ఉపయోగించినట్లయితే జుట్టు రాలడం తగ్గి జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరుగుతుంది. అలాగే రాండమ్ ప్రొడక్ట్స్ ఉపయోగించకూడదు. ఒకసారి తెచ్చుకున్న పోయిన తర్వాత మళ్ళీ మనకి కావాలంటే అవి దొరకవు. కాబట్టి అలాంటివి ఉపయోగించకపోవడం మంచిది.
టిప్ 8 : రబ్బర్ బ్యాండ్ పెట్టుకోవడం లేదు జడ వేసుకోవడం బాగా టైట్ గా పెట్టుకోకూడదు. కొంచెం లూస్ గా ఉండాలి. టైట్ గా పెట్టుకోవడం వల్ల జుట్టు రాలడం సమస్య ఎక్కువ అవుతుంది. లూస్ గా పెట్టుకున్నట్లయితే జుట్టు రాలడం తగ్గి జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరుగుతుంది.
ఈ 8 టిప్స్ ఫాలో అయినట్లైతే జుట్టు రాలడం తగ్గి జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరుగుతుంది.