simple home remedies for oily face

జిడ్డు చర్మంతో బాధపడుతున్నారా? simple home remedies for oily face

జిడ్డు చర్మం ఇబ్బందిని కలిగిస్తుందా? ముఖాన్ని ఎంత కడుకున్నా తాజాదనపు అనుభూతి కలగడం లేదా? మగా, ఆడా అని తేడా లేకుండా అందరూ ఈ జిడ్డు చర్మ బాధితులే. అయితే ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయమేంటంటే,  జిడ్డు చర్మం చాలా రకాల సమస్యలను తెస్తుంది. మొటిమలు, మచ్చలు వచ్చేలా చేస్తుంది. ఈ సమస్యను అధిగమించటం కష్టమే కానీ సరైన జీవన శైలీ, ఆహార విధానాలను పాటిస్తూ.. తగిన జాగ్రత్తలను తీసుకుంటే ఈ సమస్యలను తేలికగా ఎదురుకోవచ్చు.

జిడ్డు చర్మాన్ని నివారించటానికి కొన్ని ఉపాయాలు..

  • జిడ్డు చర్మం ఉన్నవారు.. రోజుకి రెండు సార్లు మంచి నీటితో ముఖాన్ని కడుక్కోవాలి.
  • ఆయిల్ స్కిన్ ఉన్నవారు, పేస్ వాష్ వాడాలి, హార్డ్ సోప్స్ వాడరాదు.
  • మీ చర్మం లోని గ్రంధుల్ని వేడి నీరు ప్రభావితం అయ్యేల చేస్తూ జిడ్డు రాకుండా చేస్తుంది.
  • వేడి నీటితో కడగటం వల్ల గ్రంధులు విచ్చుకునే ఉంటాయి. ఇక రోజ్ వాటర్ రాయటం వల్ల అది స్కిన్ టోనర్ గా పనిచేయటమే కాక గ్రంధుల్ని మూసుకుపోయేలా చేసి, చర్మాన్ని బిగుతుగా చేస్తుంది.
  • సహజసిధ్ధమైన తేయాకు నూనె రాస్తే చర్మం పై వచ్చిన మచ్చలను, మొటిమలను పోగొడుతుంది.
  • స్క్రబ్ చేయటం చాల మంచిది. దీని వల్ల ముఖంపై ఉన్న జిడ్డు పోయి ఎప్పుడూ తాజాగా కనిపిస్తారు. ఓట్మీల్, ఆల్మండ్, సముద్రపు ఉప్పు, లాంటివి వాడాలి.
  • ముఖం పై జుట్టు పడకుండా చూసుకోవాలి, ఆయిల్ శాతం ఎక్కువగా ఉండే షాంపూలు, మానేయాలి. అలానే పిల్లో కవర్లని తరుచూ మారుస్తుండాలి.

Leave a Comment

error: Content is protected !!