ప్రతి ఒక్కరూ ముఖం పై ఉండే నల్లని మచ్చలు, మొటిమలు, పిగ్మెంటేషన్, సన్ టాన్, డార్క్ సర్కిల్స్ వంటి సమస్యతో ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉంటారు. వాటిని తగ్గించు కోవడం కోసం పార్లర్ చుట్టూ తిరగడం రకరకాల క్రీములను అప్లై చేయడం వంటివి చేస్తారు. కానీ వాటిని ఉపయోగించడం వల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. ఎటువంటి ఖర్చు లేకుండా కేవలం ఇంట్లో ఉన్న వాటితోనే ఈ సమస్యలను తగ్గించుకోవచ్చు. ముందుగా ఒక బీట్రూట్ తీసుకుని తొక్క చెక్కి మిక్సీలో వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి.
ఈ పేస్ట్ నుండి జ్యూస్ వడకట్టుకోవాలి. ఈ జ్యూస్ లో ఒక చెంచా బియ్యప్పిండి వేసుకొని బాగా కలుపుకోవాలి. బియ్యపిండి స్కిన్ వైటెనింగ్కు చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే చర్మంపై ఉండే డెడ్ స్కిన్ సెల్స్ రిమూవ్ చేయడంలో కూడా అద్భుతంగా పనిచేస్తుంది. తరువాత దీనిలో ఒక చెంచా ఇన్స్టంట్ కాఫీ పౌడర్ ను వేసుకోవాలి. కాఫీ పౌడర్ లో ఉండే కోఫ్ఫిన్ అనే పదార్థం స్కిన్ పై చాలా బాగా టాన్ పోగుడుతుంది. తర్వాత దీనిలో ఒక విటమిన్ ఈ క్యాప్సిల్స్ వేసుకోవాలి.
విటమిన్ ఈ చర్మం కాంతివంతంగా మెరవడంలో అద్భుతంగా పని చేస్తుంది. చర్మానికి విటమిన్ సి ఎంత అవసరమో విటమిన్ ఈ కూడా అంతే అవసరం. వీటన్నిటిని బాగా కలుపుకుని పక్కన పెట్టుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకోవడానికి ముందు ముఖం శుభ్రంగా కడిగి అప్లై చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి పదిహేను నిమిషాల పాటు ఆరనివ్వాలి. తర్వాత చల్లని నీటితో కడిగేసుకోవాలి. ముఖం కడిగిన తర్వాత అరగంట వరకు సబ్బు యూస్ చేయకూడదు. ఇలా చేసినట్లయితే మీ ముఖం అందంగా, కాంతివంతంగా తయారవుతుంది.
ఈ ప్యాక్ అప్లై చేయడం వలన ముఖంపై ఉండే నల్లని మచ్చలు, మొటిమలు, పిగ్మెంటేషన్, సన్ టాన్, డార్క్ నెస్ వంటి సమస్యలు తగ్గుతాయి. ముఖం తెల్లగా ఉపయోగించడం కాంతివంతంగా మెరిసిపోతుంది. ఈ ప్యాక్ ని ఆడవారు, మగవారు కూడా ఉపయోగించవచ్చు. దీని వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. కాబట్టి చిన్న పిల్లలు కూడా ఉపయోగించుకోవచ్చు. ఈ ప్యాక్ ముఖం పై ఉండే సమస్యలన్నీ తగ్గించుకోవచ్చు. ఈ ప్యాక్ వారానికి రెండు సార్లు ఉపయోగించినట్లయితే ఈ పండగల సమయంలో అందంగా కనిపిస్తారు.