తెల్ల జుట్టు అనేది చిన్న వయసులో వస్తే వారి వయసుకు మించి పెద్దవారిగా కనిపిస్తూ ఉంటారు. ఉద్యోగాలు చేసేవారు, చదువుకునేవారు ఇలాంటి పరిస్థితుల్లో ఇబ్బందిగా భావిస్తారు. అలాంటి వారు బయట దొరికే కెమికల్స్ ఉపయోగించినా పెద్దగా ప్రయోజనం ఉండదు. కొన్ని రోజులు నల్లగా ఉన్నా తర్వాత తెల్ల జుట్టు బయటపడుతోంది. శాశ్వతంగా జుట్టు నల్లగా కావడానికి కొన్ని సహజమైన పదార్ధాలు మంచి ఫలితాలను అందిస్తాయి.
దాని కోసం మన ఒక శుభ్రమైన గిన్నె తీసుకోవాలి. దానిలో ఒక స్పూన్ అలోవెరా జెల్ తీసుకోవాలి. అలోవెరా జెల్ తాజాగా చెట్టు నుండి సేకరించినది ఉపయోగించడం మంచిది అందుబాటులో లేనప్పుడు మాత్రమే మార్కెట్లో దొరికేది ఉపయోగించాలి. తర్వాత ఒక స్పూన్ కాఫీ పొడి వేసుకోవాలి. కాఫీ పొడి తలలో చర్మాన్ని కాపాడి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఏర్పడకుండా చేస్తుంది. తర్వాత ఒక స్పూన్ కొబ్బరి నూనె వేసుకోవాలి. కొబ్బరి నూనె జుట్టుకు పోషణను అందించి దృఢంగా, బలంగా అయ్యేలా చేస్తుంది.
ఒక స్పూన్ ఇండిగో పౌడర్ కూడా కలుపుకోవాలి. జుట్టును నల్లగా చేయడంలో ఇండిగో పౌడర్ సహాయపడుతుంది. ఈ మధ్యకాలంలో ఇండిగో పౌడర్ లాభాల వలన దీని వినియోగం ఎక్కువగా ఉంది. ఇది అన్ని ఆన్లైన్, ఆయుర్వేద షాపుల్లో అందుబాటులో ఉంటుంది. తర్వాత దీనిలో మీరు ఉపయోగించే ఏదైనా షాంపూను ఒక స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని బాగా కలిపి జుట్టుకు అప్లై చేయాలి.
ఇందులో వాడిన ప్రతి పదార్థం జుట్టులో పేరుకున్న దుమ్ము, ధూళి కాలుష్యాన్ని శుభ్రం చేయడంతోపాటు జుట్టు సమస్యలను నివారిస్తుంది. జుట్టు మూలాల నుంచి తెల్ల జుట్టు సమస్యను నివారించేందుకు సహాయపడుతుంది. అప్లై చేసిన ఒక గంట తర్వాత ఇందులో షాంపు ముందుగానే వేసాం కనక మామూలు నీటితో తల స్నానం చేయవచ్చు. ఇలా కనీసం వారానికి ఒకసారి నెలకు రెండు సార్లైనా ఈ ప్యాక్ జుట్టుకు అప్లై చేయడం వల్ల జుట్టు సమస్యలను తగ్గించుకోవచ్చు. ఈ ప్యాక్ క్రమం తప్పకుండా వాడటం వలన జుట్టు నల్లగా మారుతుంది.