తెల్ల జుట్టు సమస్యకు ఎన్ని రకాల డైలు వాడినా అవి తాత్కాలిక పరిష్కారమే తప్ప శాశ్వత పరిష్కారం కాదు. అలాంటి సమయంలో ఈ చిట్కాలతో శాశ్వతంగా తెల్ల జుట్టును నల్లగా మార్చుకోవచ్చు. చిన్న వయసు నుండే తెల్లజుట్టు సమస్య ఉన్నవారు వీటిని వాడడం వలన తెల్లజుట్టు సమస్య నుండి ఉపశమనం పొందవచ్చు.
ఏ చిట్కాలు పాటించినా వాటి యొక్క పూర్తి ఫలితాలు కనిపించడానికి కొంత సమయం పడుతుంది. ఇంట్లో ఉండే కొన్ని పదార్థాలు మూలాల నుండి సమస్యను తగ్గించి తెల్లజుట్టు నల్లగా మార్చడంలో మనకు సహకరిస్తాయి.
దాని కోసం మనం తీసుకోవాల్సిన పదార్థాలు ఏంటో తెలుసుకుందాం. స్టౌ పై ఒక గిన్నె పెట్టి దానిలో గ్లాసు నీటిని వేసుకోవాలి. అందులో రెండు స్పూన్ల టీ పౌడర్ వేసుకోవాలి. టీ పొడి జుట్టును నల్లగా మార్చేందుకు జుట్టు పెరుగుదలకు సహకరించేందుకు ఉపయోగపడుతుంది. టీ పౌడర్ లో అనేక రకాల యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఫ్రీరాడికల్స్ తో పోరాడి జుట్టు కణాలు దెబ్బతినకుండా రక్షిస్తాయి. తరువాత ఇందులో కట్ చేసి తీసుకున్న అలోవెరా జెల్ అరకప్పు వేసుకోవాలి. తాజా కలబంద అందుబాటులో ఉంటే అదే ఉపయోగించుకోవచ్చు లేనివారు మార్కెట్లో దొరికేది వాడవచ్చు.
అలోవెరా జెల్ జుట్టు సమస్యలను తగ్గించి జుట్టు దృఢంగా, బలంగా పెరగడానికి మృదువుగా షైనీగా ఉండడానికి సహకరిస్తుంది. తరువాత పదార్థం కాఫీ పొడి. ఒకటిన్నర స్పూన్ ల కాఫీ పొడి కూడా వేసి కలుపుకోవాలి. కాఫీ పొడి కూడా జుట్టు నల్లగా మార్చడంలో చాలా బాగా సహాయపడుతుంది. జుట్టు సమస్యలను తొలగించడంలో సహకరిస్తుంది. కలోంజీ విత్తనాలను పొడిగా చేసుకుని రెండు స్పూన్ల పొడి ఇందులో వేసుకోవాలి.
జుట్టును నల్లగా, దృఢంగా చేయడంలో కలోంజి చాలా బాగా సహాయపడుతుంది. తరువాత వీటన్నింటినీ బాగా కలిపి జుట్టు చిక్కు తీసి ఒక కాటన్ బాల్ తో ఈ మిశ్రమాన్ని తలకు అప్లై చేయాలి. తర్వాత దీనిలో ఉన్న మిశ్రమాన్ని తలకు అప్లై చేయాలి. 30 నిమిషాల తర్వాత మైల్డ్ షాంపూతో తలస్నానం చేస్తే మొదటి ప్రయత్నంలోనే జుట్టు సమస్యలు తగ్గి జుట్టు కండిషన్లో ఉండడాన్ని మీరు గమనిస్తారు. క్రమం తప్పకుండా వాడటం వలన తెల్ల జుట్టు నల్లగా మారడం జరుగుతుంది.