simple home remedy for cough cold throat pain relief

దగ్గు,జలుబు, జ్వరంని ఒక్క నిమిషంలో పోగొట్టి ఇమ్యునిటిని పెంచే టీ..

ఇప్పుడు అందరూ గొంతు ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్నారు.వైరస్ వలన, లేదా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వల్ల గొంతునొప్పి వస్తుంది. అలాగే అందరికీ తెలిసు చిన్న పిల్లలలో టాన్సిల్స్ ఇన్పెక్షన్ వలన గొంతు నొప్పి వస్తుంటే, పెద్ద వారిలో ఈ సమస్య వైరస్ ఇన్పెక్షన్ వలన మొదలవుతుంది. దీంతో మాట్లాడుతుంటే నొప్పిగా ఉండటం,మింగటం కూడా కష్టంగా ఉండటం, ఆహారం తినేటప్పుడు కూడా ఇలాంటివి కనిపిస్తుంటాయి. నొప్పి వచ్చినపుడు మీ ఆహారంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే గొంతు నొప్పి నుండి ఉపశమనం లభిస్తుంది. 

దానికి కావలసిన పదార్థాలు అతిమధురం. లికోరైస్ అని కూడా పిలుస్తారు.కఫ,పిత్త దోషాలను సంపూర్ణంగా హరిస్తుంది. అయితే ఈ మొక్కలలో ఈ మొక్క వేరులే మనం ప్రధానంగా ఉపయోగించే అవసరం కలిగి అత్యంత శక్తివంతమైన ఔషధాలు. ఈ రెమిడీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి. అతిమధురం ఇప్పుడు చాలా సులభంగా దొరుకుతుంది. మీరు ఏం చేయాలి అంటే ఈ అతిమధురం పొడిని ఉపయోగించి హెర్బల్ టీ ప్రిపేర్ చేసుకోవాలి.

ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. 

దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఒక గ్లాసునీళ్ళు తీసుకోండి. ఇప్పుడు మనం ఈ అతిమధురం పొడిని ఒక అర స్పూన్ మోతాదులో కలపాలి. ఇప్పుడు మనకు కావాల్సింది అల్లం. మీరు ఒక చిన్న అల్లం ముక్కను తీసుకొని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వీటిని కూడా ఈ యాడ్ చేయండి. అల్లం గొంతులో ని వైరస్, బాక్టీరియాను నశింపచేస్తుంది. ఇప్పుడు మీరు ఈ నీటిని కనీసం ఒక మూడు లేదా నాలుగు నిమిషాలపాటు బాగా మరిగించాలి. డయాబెటిస్ ఉన్నవారు మాత్రం ఈ అతి మధురం వాడే విషయంలో మీరు  డాక్టర్ సలహా తీసుకోండి.ఇది తీపి రుచిని కలిగి ఉంటుంది కాబట్టి. 

ఇప్పుడు  ఇందులో వేయవలసింది సైంధవలవణం లేదా రాళ్ల ఉప్పు. మీరు ఇందులో ఒక చిటికెడు మోతాదులో కలపండి. మామూలు కిచెన్ సాల్ట్ ఉపయోగించకూడదు. అతి మధురం తో తయారు చేస్తున్న హెర్బల్ టీ అనేది రెడీ అయిపోయినట్లే. మీరు ఏ సమయంలో తీసుకోవాలి అంటే మీరు ప్రతి రోజూ మూడుసార్లు తీసుకోండి. ప్రతిరోజు మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనానికి అరగంట గ్యాప్ ఇచ్చి ఈ టీ తాగండి. దీనివల్ల దగ్గు, కఫం గొంతులో చిక్కుకున్న శ్లేష్మాన్ని కూడా కలిగిస్తుంది. మీ స్వరపేటికలోని కండరాలను ఉత్తేజపరిచి గొంతులో నయం చేస్తుంది. గొంతులోని వాపు, గొంతు బొంగురుపోవడం వంటి సమస్యలను కూడా అతి మధురం చాలా మంచి ఉపశమనాన్ని ఇస్తుంది. 

మీరు ప్రతి రోజూ నీటిని తాగడంతో పాటు ఈ నీటితో గొంతు పుక్కిలించడం వల్ల కూడా మీకు త్వరగా ఉపశమనం లభిస్తుంది. గొంతు నొప్పి ఉన్నంతకాలం పాలకు సంబంధించిన పదార్థాలు, కేక్, జంక్ ఫుడ్ కి దూరంగా ఉండాలి. ముఖ్యంగా వేడి వేడి ఆహారం మాత్రమే తీసుకోవాలి. తీసుకోవడానికి ఈజీ గా ఉండే పులుసు, చారు, మజ్జిగ ఇటువంటి ఆహారం తీసుకోవాలి. రోజులో ఎక్కువ శాతం గోరు వెచ్చని నీటిని తాగుతూ ఉండాలి. వీటివలన గొంతు ఇన్ఫెక్షన్ తగ్గి మంచి ఉపశమనం లభిస్తుంది

Leave a Comment

error: Content is protected !!