simple home remedy for piles

భయంకరమైన ఫొల్స్ను తగ్గించే ఔషధం.మూడురోజులు తీసుకుంటే చాలు. శరీరంలో వేడి తగ్గుతుంది..

గోంధ్. ఇది  గ్వార్ మొక్క యొక్క కాండం నుంచి వచ్చే జిగురు.  దీనిలో అధికంగా లభించేది ఫైబర్. మలబద్ధకం, విరేచనాలు, ప్రకోప ప్రేగు సిండ్రోమ్ (ఐబిఎస్), అధిక కొలెస్ట్రాల్ మరియు అధిక రక్తపోటు కోసం గ్వార్ గమ్ ఉపయోగించబడుతుంది.  ఇతర పరిస్థితులకు గ్వార్ గమ్ వాడకానికి సహాయం ఇవ్వడానికి పరిమిత శాస్త్రీయ పరిశోధనల ఫలితాలు ఉన్నాయి. దీనిని తెలుగులో గోధుమ బంక, కటోరా అని పిలుస్తుంటారు. వీటిని నానబెట్టి జ్యూస్లు, అనేక రకాల లడ్డు వంటి వంటకాల్లో ఉపయోగిస్తారు.

 ఇది ఎలా పని చేస్తుంది ?

 గోంధ్ గమ్ అనేది ఫైబర్తో నిండి ఉంటుంది. ఇది మలం యొక్క తేమను సాధారణీకరిస్తుంది. అతిసారం(డయేరియా)లో అదనపు ద్రవాన్ని గ్రహిస్తుంది మరియు మలబద్దకంలో మలాన్ని మృదువుగా చేసి మలంలో రక్తం పడకుండా ఆపుతుంది.  ఇది కడుపు మరియు ప్రేగులలో గ్రహించిన కొలెస్ట్రాల్ మరియు గ్లూకోజ్ పరిమాణాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. ఫైల్స్ ఫిజర్స్ని సహజంగా తగ్గించడంలో సహాయపడుతుంది.

 బరువు తగ్గడానికి గోంధ్ గమ్ వాడటానికి ఇష్టపడుతున్నారు. ఎందుకంటే ఇది పేగులలో చేరి కడుపులో  నిండిన భావన కలుగుతుంది.  ఇది ఆకలిని తగ్గిస్తుంది. జంక్ఫుడ్ కు దూరంగా ఉఃడేలా చేస్తుంది.

ఎలా తీసుకోవాలి.?

ఒకగ్లాసు కాచి చల్లారిన పాలలో గోంథ్ను ఒక రెండు టీస్పూన్లు వేసి నానబెట్టాలి. ఇవి ఇలాగే మూతపెట్టి రాత్రంతా వదిలేయాలి. ఇలా వదిలేసిన గోంధ్ ఉదయానికి పాలను పీల్చుకుని మెత్తటి చూర్ణంలా తయారవుతుంది. దీనిలో ఒక అరచెక్క నిమ్మరసం పిండి, అందులో ఒక స్పూన్ పటికబెల్లం వేసుకోవాలి. ఇది మలంలో రక్తాన్ని అరికట్టడమే కాకుండా , మలబద్దకం, గ్యాస్ తగ్గిస్తుంది. గోంధ్కి ఎటువంటి వాసన, రుచి ఉండదు కనుక పటికబెల్లం, నిమ్మరసం రుచితో బాగుంటుంది. దీనిని రోజూ తీసుకోవచ్చు. ఒకవేళ నీటితో నానబెట్టాలి అనుకుంటే రాత్రే నిమ్మరసం పటికబెల్లం వేసి కలుపుకోవచ్చు. పాలతో నానబెట్టినపుడు పాలు విరిగిపోతాయి కనుక ఉదయం కలుపుకోవడం మంచిది. ఇలా రోజూ తీసుకుంటూ ఉంటే మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. 

Leave a Comment

error: Content is protected !!