ఏమి తిన్నా గ్యాస్, ఎసిడిటీ వస్తుందా? తిన్న పదార్థం అరగక త్రేన్పులు, గుండెల్లో మంట వస్తుందా. వికారం, వాంతులు, ఏం తిన్నా వెంటనే విరోచనం కావటం ఇవన్నీ గ్యాస్ట్రిక్ వలన వచ్చే సమస్యలు.
ఇవి తగ్గడానికి ఎప్పటికప్పుడు మందులు నీళ్ళలో వేసుకునే సొల్యూషన్ వాడుతుంటారు. అవి తాత్కాలిక ఉపశమనం మాత్రమే ఇస్తాయి. అందుకే మనం సహజంగా దొరికే పదార్థాలతో ఒక చిట్కాని ప్రయత్నిద్దాం.
ఇది మన ఇంట్లో ఉండే పదార్థాలతోనే చేద్దాం కనుక ఎటువంటి దుష్ప్రభావాలు ఉండవు. దాని కోసం మనం తీసుకోవాల్సిన పదార్థాలు వాము, బెల్లం. వామును కొద్దిగా వేయించి పక్కన పెట్టుకోవాలి. తర్వాత వాముని మిక్సీలో మెత్తగా పొడిలా చేసుకోవాలి.
బెల్లం తురిమి ఒకటి, ఒకటిన్నర చెంచాలా బెల్లంతురుము వచ్చేలా చేసుకోవాలి. ఇందులో వాము పొడి ఒక స్పూన్ కలుపు కోవాలి. గ్యాస్ ట్రబుల్ ఎక్కువగా ఉంటే వాము పొడి ఎక్కువ వేసుకోవాలి. దీనిని బాగా కలిపి చిన్న ముద్దలుగా చేసుకుని రోజుకు ఒకటి తీసుకోవాలి.
తినగలిగితే ఈ ముద్దను నమిలి తినేయవచ్చు. లేదంటే ఒక గ్లాసు వేడి నీటిలో కలిపి తాగవచ్చు. గ్యాస్ ట్రబుల్ ఎక్కువగా ఉన్నప్పుడు అప్పటికప్పుడు కూడా చేసుకొని ఈ మిశ్రమాన్ని తినవచ్చు. ఈ మిశ్రమంలో ఉండే లక్షణాలు గ్యాస్‌ను బయటకు పంపి గ్యాస్ ట్రబుల్ వల్ల వచ్చే సమస్యలు తగ్గిస్తాయి.
వాము మలబద్ధకం కోసం ఒక మంచి ఇంటి నివారణ చిట్కా. దాని భేదిమందు లక్షణాలు కారణంగా, వాము బల్లలు మరియు ప్రేగు కదలికలను మెరుగుపరచడానికి సహాయపడుతుంది. అంతేకాక, వామూ వలన ఎటువంటి దుష్ప్రభావాలను ఉండవు.
డ్యూరెటిక్ గా పనిచేసే బెల్లం, ప్రేగు కదలికలను ప్రేరేపించటానికి సహాయపడుతుంది, తద్వారా మలబద్ధకం నుండి ఉపశమనం అందిస్తుంది. ఇందులో ఉండే ఐరన్ మలాన్ని మెత్తగా చేయడంలో దోహదపడుతుంది. పొట్టలోని గ్యాస్ బయటకు పంపడానికి సహాయపడుతుంది. దీనిని రోజు తీసుకోవడం వలన ఆహారం బాగా జీర్ణమవుతుంది. గ్యాస్ అధికంగా ఉన్నప్పుడు బెల్లం లేకపోయినా వాముపొడి నీటిలో కలిపి తాగవచ్చు.