simple homemade oil for long hair

నన్ను నమ్మండి. మీ జుట్టు చూసి మీరే నమ్మలేరు అంత పొడవుగా పెరుగుతుంది

జుట్టు మృదువుగా చిక్కులు లేకుండా ఉండాలని అందరికీ ఉంటుంది. కానీ కొంతమంది జుట్టు మరీ గడ్డిలా ఉంటూ చిక్కులతో చాలా ఇబ్బంది పెడుతుంది. ఇలాంటి వారు ఇప్పుడు చెప్పబోయే రెండు చిట్కాలలో ఏదో ఒకటి పాటించి జుట్టును మృదువుగా, ఆరోగ్యంగా పెరగడంతోపాటు జుట్టు పెరుగుదలను రెండు రెట్లు ఎక్కువ చేసుకోవచ్చు. పొడవైన చిక్కులు లేని జుట్టు కోసం చిట్కాలు ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. 

మనం ఇంట్లో తయారు చేసిన లేదా మార్కెట్లో దొరికే వెన్నను తీసుకోవాలి. సాల్ట్ లేని బటర్ అయితే మంచిది. సాల్ట్ వలన జుట్టుకి నష్టం వాటిల్లే అవకాశం ఉంటుంది. తర్వాత పదార్థం అలోవెరా జెల్ జుట్టు మృదువుగా మెరిసేలా చేయడంలో సహాయపడుతుంది. చుండ్రు సమస్యను నివారించడంలో ఇన్ఫెక్షన్స్ రాకుండా అడ్డుకోవడంలో చాలా బాగా పనిచేస్తుంది. తర్వాత పదార్థం కొబ్బరినూనె. కొబ్బరి నూనె జుట్టును తేమగా ఉంచి ఆరోగ్యంగా పెరగడంలో సహాయపడుతుంది. జుట్టు కుదుళ్లకు పోషకాలను అందించడానికి ఉపయోగపడుతుంది.

ఇప్పుడు ఒక గిన్నెలో ఒక స్పూను బటర్ తీసుకోవాలి. దానిలో ఒక స్పూన్ అలోవెరా జెల్, ఒక స్పూన్ కొబ్బరి నూనె వేయాలి. వీటన్నింటినీ బాగా కలిపి జుట్టుకు అప్లై చేయాలి. ఇవి జుట్టును స్మూత్ అండ్ సిల్కీ గా చేయడంలో  చాలా బాగా పనిచేస్తాయి. జుట్టు పొడిబారి చిక్కులతో ఉంటే చివర్లు చిట్లిన జుట్టు పెరుగుదల ఆగిపోతుంది. జుట్టుకు కావలసిన తేమ, పోషకాలు అందడంతో ఇప్పుడు జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది. ఈ ప్యాక్ అప్లై చేసిన ఒక గంట తర్వాత తల స్నానం చేయవచ్చు. వీలైనంత మైల్డ్ షాంపూతో తలస్నానం చేయడం మంచిది. హెర్బల్ షాంపూ కూడా ఉపయోగించవచ్చు.

ఆ తర్వాత చిట్కా కోసం మనకు కావాల్సిన పదార్థాలు గ్రీన్ టీ. దీని వలన మీ తలకు ఈ పోషకాల సరఫరా పెరుగుతుంది మరియు జుట్టు పెరుగుదల మెరుగుపడుతుంది.  గ్రీన్ టీలోని ఎపిగాల్లోకాటెచిన్ గాలెట్ (EGCG) జుట్టు రాలడాన్ని ప్రేరేపించే హార్మోన్ల కార్యకలాపాలను నిరోధించడం ద్వారా జుట్టు రాలడాన్ని నిరోధించవచ్చు మరియు వెంట్రుకల కుదుళ్లను ప్రేరేపించడం ద్వారా జుట్టు తిరిగి పెరగడాన్ని ప్రోత్సహిస్తుంది. తర్వాత పదార్ధం పెరుగు పెరుగు జుట్టు పెరుగుదలకు చుండ్రు నివారణకు జుట్టు మెత్తగా మృదువుగా ఉండేందుకు చాలా బాగా సహాయపడుతుంది.

 దీనితో పాటు ఒక ఉల్లిపాయ తీసుకొని మెత్తని పేస్ట్ లా చేసి దాని నుండి రసం తీసుకోవాలి. ఈ రసాన్ని ఒక గిన్నెలో తీసుకోవాలి. దానిలో రెండు స్పూన్ల పెరుగు, ఒక స్పూన్ గ్రీన్ టీ పౌడర్ వేసుకోవాలి. ఇప్పుడు మూడింటిని బాగా కలిపి జుట్టుకు అప్లై చేసి ఒక గంట తర్వాత తలస్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల జుట్టు చిక్కులు లేకుండా కండిషన్ అవుతుంది. జుట్టు పెరగడానికి కూడా  సహాయపడతాయి. ఉల్లిపాయ రసంలో యాంటీ ఆక్సిడెంట్లు ఉండటం వల్ల జుట్టు అకాల నెరసిపోవడాన్ని నివారించవచ్చు.  

ఉల్లిపాయ రసంతో మంచి మసాజ్ రక్త ప్రసరణను పెంచుతుంది, జుట్టు పెరుగుదలకు మరింత సహాయపడుతుంది.  ఇందులోని యాంటీ బాక్టీరియల్ లక్షణాలు మీ స్కాల్ప్‌ను ఇన్‌ఫెక్షన్‌ల నుండి దూరంగా ఉంచడంలో సహాయపడవచ్చు. ఆరోగ్యకరమైన జుట్టు పెరుగుదలను మరింత ప్రోత్సహిస్తుంది. ఈ ప్యాక్ ను కూడా తలకు అప్లై చేసి ఒక గంట తర్వాత తల స్నానం చేయవచ్చు ఈ రెండింటిలో మీకు అందుబాటులో ఉన్న పదార్థాలతో తయారు చేసి వాడవచ్చు ఇది జుట్టును మృదువుగా అందంగా తయారు చేయడంతోపాటు మీరు ఊహించనంత జుట్టు పెరిగేలా చేస్తుంది

Leave a Comment

error: Content is protected !!