Simple Massage Techniques to Stop Hair Fall and Enhance Hair Growth

కేవలం రెండే రెండు టిప్స్ తో జుట్టు రాలడం ఆగి, పలుచగున్న జుట్టు ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది. 100% రిజల్ట్ పక్కా!!

అమ్మాయిలకు జుట్టంటే ప్రాణం. వెంట్రుక రాలితే విలవిల్లాడిపోతారు. అలాంటిది ఊహించని విధంగా జుట్టు రాలిపోతూ జుట్టు మొత్తం పలుచబడిపోతే వారి మనసు మాములుగా బాధపడదు. ముఖ్యంగా చాలామంది ఇలా జుట్టు రాలిపోతోందనే ఆలోచనతోనే డిప్రెషన్ కు గురవుతున్నారంటే ఆశ్చర్యమేస్తుంది. కానీ ఇది నిజం.  అలాంటి డిప్రెషన్ లో హెయిర్ ఫాల్ ను ఆపుతుంది అని మార్కెట్ లో ప్రచారమయ్యే ప్రతి వాణిజ్య ఉత్పత్తిని కొనడం, వాడటం అవి పని చేయకపోవడం ఇలా జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ప్రతి వాణిజ్య ఉత్పత్తిలోనూ ఎన్నో రసాయనాలు వాడుతుంటారు మరి. అవి జుట్టు కుదుళ్లను ఇంకా బలహీనం చేసి ఉన్న జుట్టు దగ్గర వంద వద్దు కానీ ఉన్నదీ పోయే పరిస్థితి ఎదురవుతోంది. మరి జుట్టు రాలడం ఆగిపోవలన్నా జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరగలన్నా అద్భుతమైన టిప్స్ మరియు వాడిన మొదటి సారె గొప్ప పలితాన్ని ఇచ్చే టిప్స్ ఇప్పుడు తెలుసుకోండి. 

తలకు మసాజ్:

మసాజ్ అందరికి తెలిసినదే. అయితే అందరూ గోరువెచ్చని నూనెతో మసాజ్ చేయించుకుని గంట తరువాత తలస్నానం చేస్తుంటారు. తలకు నూనె పెట్టడం సాధారణమే మళ్ళీ నూనెతోనే మసాజ్ చేయడం ఎందుకు??  జుట్టుకు గొప్ప పోషణ కావాలంటే కొబ్బరి పాలతో మసాజ్ చేసుకోవాలి. వారంలో రెండు సార్లు ఇలా కొబ్బరి పాలతో మసాజ్ చేసుకుని గంట తరువాత తలస్నానం చేయాలి. దీనివల్ల జుట్టు ఒత్తుగా, పట్టుకుచ్చులా మెరిసిపోతూ అందంగా కనబడుతుంది. ఎన్నెన్నో కృత్రిమ ఉత్పత్తులకు వందలు ఖర్చు పెట్టె బదులు వారానికి ఒకసారి ఒక కొబ్బరికాయను కేవలం ఇరవై లేదా ముప్పై రూపాయల్లో కొని వాడుకోవడం ఉత్తమం కదా.  

మరిప్పుడు మరొక టిప్. ఇది జుట్టు రాలడాన్ని అద్భుతంగా ఆపగల మిరాకిల్ అనుకోవచ్చు. కేవలం తలస్నానం చేసేటపుడు మీరు ఉపయోగించే షాంపూ లో మ్యాజిక్ లిక్విడ్ కలిపి తలంటు పోసుకోవడం వల్ల అద్భుతమైన ఫలితం ఉంటుంది. ఇంతకు మ్యాజిక్ లిక్విడ్ ఏమిటి అనుకుంటున్నారా?? చదివేయండి మరి.

కావలసిన పదార్థాలు: 

●స్పూన్ మెంతులు,

●స్పూన్ కలొంజి గింజలు.( నల్లజీలకర్ర)

ఈ రెండింటిని ఒక పెద్ద గ్లాసు నీళ్లలో వేసి సుమారు 10 నిమిషాలు ఉడికించాలి. నీళ్లు దాదాపు సగం అయిపోయాక స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. తరువాత ఆ నీటిని వడగట్టి వేరు చేసుకోవాలి. ఇదే మ్యాజిక్ లిక్విడ్.

దీన్ని మీరు ఉపయోగించే షాంపూ లో కలిపి తలస్నానం చేయడం వల్ల మొదటి సారె గొప్ప పలితాన్ని చూడగలరు. ఇందులో ఉపయోగించిన మెంతులు జుట్టు నల్లగా అవ్వడానికి ఉపయోగపడుతుంది, అలాగే జుట్టు స్మూత్ గా  మెరుపు సంతరించుకునేల చేయడంలో తోడ్పడుతుంది. ఇక నల్లజీలకర్ర జుట్టు నల్లబరిచి, దృఢంగా మార్చడంలో సహయపడుతుంది.

కేవలం పైన చెప్పుకున్న రెండే రెండు టిప్స్ తో జుట్టురాలడం ఆగిపోయి ఆరోగ్యంగా పెరగడం మొదలవుతుంది. తప్పక పాటించండి.

చివరగా….

జుట్టు రాలడం అనేది సాదారణంగా పోషకార లోపం, రక్త హీనత, డిప్రెషన్, అనారోగ్యం వల్ల వదిన మెడిసిన్ ఎఫెక్ట్ వంటివి కారణాలు కావచ్చు. అయితే ఆరోగ్యకరమైన సమతులాహారం తీసుకోవడం కూడా చాలా ముఖ్యం కాబట్టి మంచి ఆహారం తీసుకుంటూ పైన చెప్పిన రెండు పాటిస్తే మంత్రించినట్టు జుట్టు పెరగడం మొదలవుతుంది

Leave a Comment

error: Content is protected !!