అందమైన కళ్ళు పుట్టుకతోనే రావాలి.. వాటిని కాపాడుకోవాలంటే.. ఆరోగ్యంగా జీవించాలి. కంటికి మేలు చేసే ఆహారాన్ని తీసుకుంటూ, సమయానికి నిద్ర పోతూ, కంటికి కావాల్సిన వ్యాయామాలు కూడా చేస్తుంటే.. అందమైన కళ్ళు మీ సొంతమే. అయితే కాలుష్యం.. జీవన విధానము, శ్రమ జీవనం,వాడుతున్న సాకేంతిక పరికరాలు, మన కంటి పైన ప్రభావం చూపిస్తూనే ఉంటాయి. ఇంట్లో వస్తువులతోనే కళ్ళని ఆరోగ్యం ఉంచుకునే విధానాలు మనం తెలుసుకుందాము.
Read This Article : జిడ్డు చర్మంతో బాధపడుతున్నారా? simple home remedies for oily face
- కంటిని రెండు సార్లు కంటే ఎక్కువ మంచి నీటితో కడగండి.
- వారానికి రెండు సార్లైనా విటమిన్ ‘ఈ’ ఆయిల్తో కళ్ళకింద, మీదా మసాజ్ చేయండి.
- రోజు,నిద్రపోయే ముందు శుభ్రంగా ముఖం కడుగుకొని, రోజ్ వాటర్ తో రబ్ చేసుకోవాలి.
- అప్పుడప్పుడు అలిసిన కళ్ళకు కీరా ముక్కలను కనురెప్పలపై ఉంచితే.. కళ్ళకు విశ్రాంతి కలుగుజేస్తుంది.
- ఒక చెంచా పసుపు తీసుకొని, దాంట్లో ఆలివ్ ఆయిల్ వేసి ముద్దగా కలుపుకోవాలి. దీన్ని కళ్ళ క్రింద చారలపైన పూతల రాసుకొని,కాసేపు ఆగాక కడిగేసుకోవాలి. క్రమేణా నల్లని చారలు తొలిగిపోతాయి.
- మంచి నీళ్ళు అధికంగా తాగాలి. కనీసం ఎనిమిది నుంచి పది గ్లాసుల నీళ్ళు రోజూ తాగితే కళ్ళు కాంతివంతంగా ఉంటాయి.
- విటమిన్ ఎ,ఈ ఉన్న ఆహార పదార్ధాలు, కూరగాయలు, పండ్లు, ధాన్యాలు తింటే కంటి చూపు బాగుంటుంది.. అందంగా కూడా ఉంటారు.
చివరి మాట…
ఆరోగ్యమైన కళ్ళు అవ్వాలి మీ అందానికి చిరునామా!