బాడీ బిల్డింగ్, ఫిట్ నెస్ కోసం ప్రయత్నించేవారు ఎక్కువగా తీసుకునే ఆహారం ప్రొటీన్ షేక్స్. వీరు శరీరీరానికి కావలసిన ప్రొటీన్లు తీసుకునే క్రమంలో ఈ షేక్లు చాలా బాగా ఉపయోగపడతాయి. కానీ చాలా వరకు కెమికల్స్ తో తయారయినవి కావడం మూలంగా దుష్ప్రభవాలు వచ్చే అవకాశం ఉంది. అలాగే నేటిరోజుల్లో పాలు అనేవి ఎంతవరకూ శ్రేయస్కరం అనేది తెలియడం లేదు . పాలలో కల్తీ మరియు కృత్రిమ పాలతయారీ వలన శరీరానికి జరిగ లాబాల కన్నా నష్టాలే ఎక్కువగా ఉంటున్నాయి.
ప్రొటీన్లు కోసం మరియు అదనపు లాభాల కోసం మనం ఇంట్లోనే పాలను తయారు చేసుకుంటే బాగుంటుంది కదా. కానీ పాలను ఎలా తయారు చేయాలా అనుకుంటున్నారా. ఆరోగ్యకరంగా మరియు రుచిగా ఉండే పాలకోసం సోయాబీన్స్ ను రాత్రంతా నానబెట్టాలి. ఉదయాన్నే శుభ్రంగా పిసికుతూ కడగాలి. పైన పొట్టు తీసివేసి మిక్సీలో నీటిని చేర్చుకుంటూ మెత్తగా పేస్ట్ చేయాలి. తర్వాత ఆ పేస్ట్ను పలుచని గుడ్డలో వడకట్టి దానినుండి వచ్చే పాలను సేకరించాలి. ఈ పాలు ఆరోగ్యానికి చాలామంచిది. ప్రొటీన్ రిచ్ ఫుడ్స్ లో సోయామిల్క్ ఒకటి.
ఈ పాలను మరిగించి ఇందులో మరింత రుచికోసం బాదం, జీడిపప్పు, పిస్తాపప్పు మిక్సీ పట్టి కలుపుకోవాలి. కొంచెం కచ్చాపచ్చాగా చేసుకున్న ఈ పేస్ట్ తాగుతున్నపుడు నోటికి రుచిగా తగలడంతో పాటు శరీరానికి కావలసిన శక్తిని, పోషకాలు, ప్రొటీన్లను అందిస్తుంది. అంతేకాకుండా ఇలా డ్రైప్రూట్స్ వద్దనుకున్నపుడు కొంచెం తురిమిన కొబ్బరిపొడి, యాలకులపొడి వేసి మరిగించొచ్చు. ఇది కూడా పాలకు మంచి సువాసన రుచిని అందిస్తుంది. ఇలా ప్రొటీన్ షేక్ చేసినప్పుడు పంచదారకు దూరంగా ఉండాలి.
ఖర్జూర పొడి, ఆర్గానిక్ బెల్లం లేదా పటికబెల్లం వాడవచ్చు. ఇవి ఆరోగ్యానికి మేలు చేయడంతో పాటు ఐరన్ అందిస్తాయి. కండరాలు బలంగా ధృడంగా ఉండడంలో సహాయపడతాయి. వ్యాయామం చేసేవారు ఇలా సోయామిల్క్ వాడడం వలన సహజంగా కండరాలు బలంగా తయారవుతాయి. కల్తీ ఆహారం బారిన పడకుండా ఉండొచ్చు. ఈ సోయామిల్క్ పచ్చిగా తీసుకోకూడదు. వేడిచేయకుండా తాగడంవలన వాంతులు, శరీరంపై దద్దుర్లు వచ్చే అవకాశం ఉంది. సోయామిల్క్ తో చేసే పన్నీర్ (టోపు)కూడా ఆరోగ్యానికి చాలా మంచిది.
మరింత సమాచారం కోసం క్రింద లింక్ చూడండి