Skin Black to White Skin Best Free Home Remedy

లైఫ్లో నలుపు స్కిన్ రాకుండా చేసే బెస్ట్ వైటెనింగ్ టిప్. పైసా ఖర్చు అవసరం లేదు

ప్రతి ఒక్కరూ తెల్లగా మెరిసి పోవాలని, ముఖంపై మచ్చలు, మొటిమలు లేకుండా అందంగా ఉండాలని కోరుకుంటారు. కానీ ఈ తెలుపురంగు అనేది అందానికి కొలమానం ఎప్పుడు అయిందో ఎవరూ గమనించలేదు. మార్కెట్లో దొరికే అనేక ప్రోడక్ట్స్ నలుపుదనం తప్పు అన్నట్టు, తెల్లగా ఉన్న వారే అందంగా ఉన్నట్టు అనేక రకాల ప్రకటనలు చేసి మార్కెట్లో వదలడంతో క్రమేపి మనుషుల మెదడు దానికి అలవాటు పడి పోయింది.

 తెల్లగా మారడానికి అనేక వందలు, వేలు పెట్టి చికిత్సలు క్రీములు వాడుతుంటారు.

చర్మరంగు పెరగడం అనేది ఉండదు. 7 రోజుల్లో తెల్లగా అయిపోతారు అని చెప్పే క్రీమును ఏళ్లు గడిచినా వాడుతూనే ఉంటాం. అదే రంగు అదే క్రీమ్. ఆ క్రీం తయారు చేసిన వారికి బోల్డంత సంపాదన పెరిగినా, వాడే వారికి ఎటువంటి ప్రయోజనం ఉండదు. దీనికి కారణం మన చర్మం రంగు జన్యుపరంగా రావడమే. మన శరీరంలో ఉండే మెలనిన్ అనేది మన అందమైన వివిధ రకాల చర్మ టోన్లు మరియు షేడ్స్, కంటి రంగులు మరియు జుట్టు రంగులకు కారణమయ్యే వర్ణద్రవ్యం.

 మెలనిన్ మానవ చర్మం, జుట్టు మరియు కళ్ళకు వర్ణద్రవ్యాన్ని అందించడమే కాకుండా, అతినీలలోహిత (UV) కిరణాల హానికరమైన ప్రభావాల నుండి చర్మానికి రక్షణను అందిస్తుంది. మెలనిన్ అంటే ఏమిటి, చర్మానికి మెలనిన్ ఎందుకు అంత ముఖ్యమైనది, మరియు మీరు ఎంత మెలనిన్ కలిగి ఉంటారనే దానిపై వివిధ కారకాలు ఎలా ప్రభావం చూపుతాయి.

మెలనిన్ అంటే ఏమిటి?

 మెలనిన్ అనేది ఒక రకమైన సంక్లిష్ట వర్ణద్రవ్యం, మానవులలో, మన జుట్టు, చర్మం మరియు కళ్ళలో వర్ణద్రవ్యాన్ని ఉత్పత్తి చేయడానికి బాధ్యత వహిస్తుంది.

 మెలనిన్ సాధారణంగా ఒకే వర్ణద్రవ్యం వలె చెప్పబడుతున్నప్పటికీ, మానవులు మరియు జంతువుల జుట్టు, చర్మం మరియు కళ్ళలో పిగ్మెంటేషన్‌కు దోహదపడే రెండు రకాల మెలనిన్ ఉన్నాయి:

 యుమెలనిన్.   ఫియోమెలనిన్.  ఒకటి నలుపు రంగును ఉత్పత్తి చేసేది అయితే మరొకటి ఇతర దేశాలలో ఉండే చర్మరంగును ఉత్పత్తి చేసేది.

  మెలనిన్ ఉత్పత్తి శరీరం అంతటా కనిపించే మెలనోసైట్స్ అనే పెద్ద కణాలలో ప్రారంభమవుతుంది.  మెలనోసైట్స్ చర్మ రంగును ఉత్పత్తి చేయడానికి  బాధ్యత వహిస్తాయి

  మెలనిన్ యొక్క ప్రయోజనాలు ఏమిటి?

  ఈ మెలనిన్ శరీరం ఎండకు గురైనప్పుడు దాని తీవ్రతకు చర్మ కణాలు దెబ్బతినకుండా అడ్డుకుంటుంది. ఎప్పుడైతే చర్మం రంగు తెల్లగా కావాలి అనుకుంటామో అప్పుడు కొన్ని రోజుల పాటు ఎండకి గురికాకుండా ఉంటే తెల్లగా మారిపోతారు. దీని వలన శరీరానికి డి విటమిన్ లభించకపోయినా తెల్లగా కావాలి అనుకున్న వారు ఇలా చేయడం మంచిది. అంతే గాని ఎటువంటి క్రీములు తెల్లగా అవడానికి ఉపయోగపడవు.

 పల్లెటూర్లలో ఉండే వ్యక్తులు కొన్ని రోజుల పాటు పట్టణాలలో ఎండ తగలకుండా ఏసీలలో ఉంటే దానివల్ల మంచి చర్మరంగులోకి వస్తూ ఉంటారు. దానికి కారణం ఎండకు దూరంగా ఉండటమే. మనం వాడే ఏ ప్రోడక్ట్ అయినా కేవలం ఐదు శాతం మాత్రమే చర్మ రంగును మార్చగలదు. మంచి పోషకాహారం శరీరానికి తగినంత నీటిని తాగడం బీట్రూట్, క్యారెట్ వంటి పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం కూడా మంచి చర్మ రంగును అందించడంలో చాలా బాగా సహాయపడుతాయి.

Leave a Comment

error: Content is protected !!