Skin Brightening HOME remedies that REALLY WORK

మెరిసే చర్మం కోసం ఈ టిప్స్ పాటించి చూడండి

అందమైన చర్మం కోసం చాలా క్రీములు, ఫేస్ఫాక్ వేసుకోవడంవలన చర్మానికి మెరుపు వస్తుంది. కానీ అది  చర్మానికి చాలా చెడు చేస్తుంది. దాని వల్ల వచ్చే దుష్ప్రభావాలు మనకు హాచేయకుండా మనం నేచురల్గా దొరికే కొన్ని పదార్థాలను వాడి మన చర్మాన్ని నేర్పించవచ్చు. దానికోసం మనకు కావాల్సిన పదార్థాలు పచ్చిపాలు, వరి పిండి మరియు నిమ్మరసం.

 పాలను మరగ పెట్టకుండా ఒక అరకప్పు పాలను తీసుకోవాలి. దాన్లో రెండు హస్పూన్ల వరిపిండి కలపడం వలన ఇది చిక్కని పేస్ట్గా తయారు అవుతుంది. దీనిలో స్పూన్ నిమ్మరసం కలపడం వల్ల ఇది నేచురల్  బ్లీచ్లా ఉపయోగపడుతుంది. ఈ పేస్ట్ శరీరానికి పూసి రుద్దడం వల్ల చర్మంపై ఉండే మృత కణాలు తొలగిపోయి చర్మం కాంతులీనుతుంది. 

దీన్ని ముఖానికి కూడా రాయొచ్చు గాని సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళకి ఎలర్జీ రావచ్చు. నార్మల్ స్కిన్ ఉన్న వాళ్ళు ఎటువంటి భయం లేకుండా ఉపయోగించవచ్చు. అలాగే మనకు మరింత మెరుపురావాలంటే విటమిన్ సప్లిమెంట్స్ తీసుకుంటూ ఉండాలి. ఆహారంలో సాధారణంగా భాగంగా తీసుకుంటూ ఉండాలి. 

అలా తీసుకోవడం కుదరనప్పుడు మార్కెట్లో విటమిన్-సి, కొలాజిన్ సప్లిమెంట్లు మార్కెట్లో దొరుకుతున్నాయి. కొలాజిన్ అంటే చర్మంలో ఉండే  చర్మ కణాల మధ్య సిమెంట్ లాంటి పదార్థం. ఇది వయసు పెరిగే కొద్దీ కరిగిపోయి చర్మ కణాలు సాగిపోతాయి. అందుకే కొలాజిన్ తగ్గి 20  తర్వాత మాత్రమే ఈ సప్లిమెంట్స్ తీసుకోవాలి.

 సప్లిమెంట్స్ ఎప్పుడు నేరుగా తీసుకోకూడదు వాటర్ లో డైల్యూట్ చేసి తాగడం వలన శరీర గ్రహించి చర్మం కాంతులీనుతుంది. అలాగే ఇంకొక చిట్కా ఏంటంటే బంగాళదుంప పేస్ట్ తయారు చేసుకోవాలి. దీంట్లో ఒక స్పూన్ టమాటా పేస్ట్ కూడా కలుపుకోవాలి. దీంట్లో ఒక స్పూన్ ఆరెంజ్ పౌడర్ కూడా కలపాలి. 

ఈ పేస్ట్ని ముఖానికి పోసి ఆరిన తర్వాత కడిగేయాలి. ఇలా తరచూ చేయడం వల్ల ముఖం కాంతివంతంగా కనిపిస్తుంది. ఈ చిట్కాలు ఒకసారి చేసి వదిలేయకుండా క్రమం తప్పకుండా కొన్ని నెలలపాటు చేయడంవల్ల శాశ్వతమైన మెరుపు మీ చర్మానికి సొంతమౌతుంది.

Leave a Comment

error: Content is protected !!