skin brightening homemade face pack

అరటి తొక్కలో ఇది ఒక్కటి కలిపి రాస్తే చాలు ఎంతటి నల్లని మొహం ఐనా తెల్లగా, కాంతివంతంగా మెరిసిపోతుంది

ఆడవారు నల్లటి మచ్చలు, వలయాలు తగ్గి చర్మం కాంతివంతంగా తయారవడం  కోసం ఎక్కువగా రకరకాల  కెమికల్స్ ఉండే ఫేస్ ప్యాక్ లను ఉపయోగిస్తుంటారు. దీని వల్ల అనేక రకాల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. నాచురల్ పద్ధతిలో ఇంట్లో ఉన్న వాటితోనే ఫేస్ ప్యాక్  తయారుచేసి ఉపయోగించడం వలన చర్మంపై ఉండే మచ్చలు తగ్గి చర్మం అందంగా, కాంతివంతంగా తయారవుతుంది. అరటి  తొక్కలతో ఈ ఫేస్ ప్యాక్ తయారుచేసుకుని  ఉపయోగించినట్లయితే మీ మొహం పై ఉండే మొటిమల వల్ల వచ్చే, నల్లటి  మచ్చలు, ఓపెన్ పోర్స్ తగ్గి ముఖం కాంతివంతంగా తయారవుతుంది. 

     దీనికోసం ముందుగా మూడు బాగా నాచురల్ పద్ధతిలో మగ్గిన అరటిపండు తొక్కలని తీసుకోవాలి. దీనిలో ఒక చెంచా బియ్యం వేసుకొని 200 ఎంఎల్ వాటర్ వేసుకొని నీరు ఇంకిపోయే వరకు ఉడికించుకోవాలి. తర్వాత స్టౌ ఆఫ్ చేసి వీటిని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత దీనిలో  ఒక చెంచా కార్న్ ఫ్లోర్  వేసుకోవాలి. ఒక ముఖము చెంచా నిమ్మరసం కూడా వేసుకోవాలి. నిమ్మరసం పడదు అనుకున్న వాళ్లు  ఆరెంజ్ జ్యూస్  కూడా వేసుకోవచ్చు. తర్వాత దీనిని ఒక చెంచా మిల్క్ పౌడర్ వేసి బాగా కలుపుకోవాలి. 

      ఈ ప్యాక్ ను ముఖానికి అప్లై చేసుకునే ముందు ఒకసారి శుభ్రంగా నీటితో కడుగుకొని   తడిలేకుండా తుడుచుకుని తర్వాత ఈ ప్యాక్ ను అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్న తర్వాత అరగంట పాటు అలా ఉండనివ్వాలి. ముందు గోరువెచ్చటి నీటితో కడిగేసుకోవాలి. తర్వాత చల్లని నీటితో కడగాలి. తర్వాత ఏదైనా మీరు రెగ్యులర్గా వాడే మాయిశ్చరైజర్ లేదా కొబ్బరి నూనె కాని వాసెలిన్  వెంటనే అప్లై చేసుకోవాలి. టెక్నో ఒకసారి తయారు చేసుకుని ఫ్రిజ్ లో స్టోర్ చేసుకొని   వారం రోజుల వరకు ఉపయోగించుకోవచ్చు. 

     వారానికి రెండు లేదా మూడు సార్లు చేయడం వలన ముఖం పై ఉండే నల్లటి మచ్చలు వలయాలు డార్క్ స్పాట్స్ ఓపెన్ ఫోర్స్ తగ్గి చర్మం అందంగా కాంతివంతంగా తయారవుతుంది ముఖం పై ఉండే నలుపు మొత్తం పోతుంది. సన్ టాన్  వెంటనే రిమూవ్ చేయడంలో  అద్భుతంగా పనిచేస్తుంది. ఈ ప్యాక్  ముఖానికే కాకుండా కాళ్లు, చేతులకు   కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ చిట్కా మీకు కూడా అవసరం అయితే ట్రై చేయండి మంచి రిజల్ట్ ఉంటుంది.

Leave a Comment

error: Content is protected !!