skin-care-with-kanuga-indian-beach-tree

ఒక్క ఆకుతో ఇలాచేస్తే చాలు మొటిమలు, గజ్జి,తామర,దురద మీ చర్మసంబంధ సమస్యలన్నీ శాశ్వతంగా మాయం అవుతుంది

ప్రకృతి మనకు అందించిన మొక్కల్లో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి.. మన భారతదేశంలో కొన్ని వేల సంవత్సరాల నుంచి ప్రకృతి వైద్యంలో ఆయుర్వేద సిద్ధ యునాని వైద్యంలో ఈ మొక్కలను ఉపయోగించి ఎన్నో ఔషధాలను తయారు చేస్తున్నారు. ఇప్పుడు అలాంటి అద్భుతమైన ఔషధాలు కలిగిన మొక్క గురించి తెలుసుకుందాం. అదేనండి మనకి అందరికీ తెలిసినదే కానుగ చెట్టు. మన నేల తల్లి మనకు అందించిన అనేక రకాల మూలికలలో ఈ కానుగ చెట్టు కూడా ఒకటి. ఇది వేప చెట్టు లాగా పర్యావరణాన్ని శుద్ధి చేయడంలోనూ పంటలకు వచ్చే రోగాలు నయం చేయడం లోనూ మన శరీరంలోని అంటువ్యాధులను అనారోగ్యాల నుండి రక్షించడంలోనూ అతి శక్తివంతంగా పనిచేస్తుంది. ఈ చెట్టులేని ఊరు బహుశా ఎక్కడ ఉండకపోవచ్చు అని చెప్పడంలో కూడా అతిశయోక్తి లేదు.

కానుగ చెట్టును సంస్కృతంలో కరంజక సప్తమాల అని హిందీలో కరంజా అని తెలుగులో కానుగా లేదా గానుగ చెట్టు అని ఇంగ్లీషులో ఇండియన్ బీచ్ ట్రీ అని అంటారు. ఈ చెట్టు నీడ కోసం పార్కులోని రోడ్ల పక్కన ఇంటి ముందు ఖాళీగా ఉన్న ప్రదేశాలలో ఎక్కువగా పెంచుతారు. ఈ చెట్టు నీడనే కాదు ఆరోగ్యమైన గాలిని కూడా ఇస్తుంది. ఈ చుట్టు 6 నుంచి 12 మీటర్ల ఎత్తు పెరుగుతుంది. ఈ చెట్టు ఆకులు గుండ్రంగా ఉండి పువ్వులు గుత్తులు గుత్తులుగా నీలి తెలుపు కలగలిపిన రంగులు ఉంటాయి. వీటి కాయలు చూడడానికి సీమబాదం కాయల లాగా ఉంటాయి. ఈ కాయలు పగలగొడితే లోపల గింజ ఉంటుంది. ఈ గింజలను ఎన్నో రకాల ఔషధాలను ఉపయోగిస్తారు. ఈ గింజల నుంచి కానుగ నూనెను తీస్తారు. ఈ నూనెతో పల్లెటూర్లలో దీపాలు కూడా వెలిగిస్తారు.

ఈ కానుక చెట్టు కాయలు గింజలు బెరడు వేర్లు ఆకులు పూలు కానుగ నూనె వీటన్నింటిలో ఎన్నో అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్నాయి. ఇవి ఎలా ఉపయోగించుకుంటే మన ఆరోగ్యానికి లాభం కలుగుతుందో పై వీడియో ద్వారా తెలుసుకోండి.

Leave a Comment

error: Content is protected !!