skin cleansing homemade cream

ఈ చిట్కా మీ చర్మంపై సన్ సంవత్సరాలుగా పేరుకుపోయిన మురికిని కూడా ఐదు నిమిషాల్లో పోగొడుతుంది

 ప్రతి ఒక్కరూ అందంగా, కాంతివంతంగా కనిపించాలి అని  చాలా ఎక్కువగా ఇష్టపడుతుంటారు. అయితే  సన్  టాన్  వలన ముఖం పై డార్క్ నెస్ రావడం, కాళ్ళు, చేతులు నల్లగా అయిపోవడం వంటివి జరుగుతుంటాయి. వాటిని ఈజీగా ఇంట్లోనే ఈ ప్యాక్ ను ఉపయోగించి తగ్గించుకోవచ్చు.  చర్మం  మునుపటిలా కాంతివంతంగా మెరిసిపోవాలంటే  ఈ  చిట్కా ఒక సారి ట్రై చేసి చూడండి. దీని  కోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని స్క్రబ్  కోసం తయారు చేసుకోవాలి. 

        దీనిలో ఒక చెంచా పంచదార, ఒక చెంచా బేకింగ్ సోడా, ఒక చెంచా  షాంపూ.  ప్రతిరోజు ఉపయోగించి   షాంపూ ఏదైనా పర్వాలేదు లేదా బాడీ వాష్ లేదా హ్యాండ్ వాష్ కూడా వేసుకోవచ్చు. ఒక చెంచా నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కాళ్లు, చేతులు లేదా చంకలు, మెడ వంటి నల్లగా అయిపోయిన భాగాల్లో అప్లై చేసి నెమ్మదిగా స్క్రబ్ చేసుకోవాలి. తర్వాత చల్లని నీటితో కడిగేసుకోవాలి. తేడా వెంటనే మీకే తెలిసిపోతుంది. మీ చర్మంపై ఉండే సన్ టాన్  చాలా వరకు ఈ స్క్రబ్  వల్లనే పోతుంది. 

      తర్వాత ప్యాక్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. దీనికోసం ఒక బౌల్  తీసుకుని రెండు చెంచాల శనగపిండి వేసుకోవాలి. చర్మంపై ఉండే మురికిని  పోగొట్టడంలో అద్భుతంగా పనిచేస్తుంది. శెనగపిండి చాలా ఎక్కువ సమయం ఫ్రెష్గా కనిపించడానికి సహాయపడుతుంది. దీనిలో ఒక చెంచా కాఫీ పౌడర్ వేసుకోవాలి. కాఫీ పొడి చర్మాన్ని తెల్లగా మెరిసిపోయేలా  చేయడంలో సహాయపడుతుంది. దీనిలో  ఎర్రగా పండిన టమాటో కట్ చేసుకుని జ్యూస్  పిండుకోవాలి. 

       ఇది ప్యాక్ వేసుకోవడానికి వీలుగా  ఉండే విధంగా కొంచెం వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి.  ఈ  మిశ్రమాన్ని కాళ్ళు, చేతులు, మెడ, చంకలు  వంటి భాగాల్లో అప్లై చేసి 20 నిమిషాల పాటు ఆరనివ్వాలి. తరువాత నెమ్మదిగా స్క్రబ్ చేస్తూ చల్లనినీటితో కడిగేసుకోవాలి. ఇలా వారానికి రెండుసార్లు చేసినట్లయితే చర్మంపై ఉండే జిడ్డు, మురికి పోయి చర్మం ఫ్రెష్ గా అనిపిస్తుంది. అలాగే కాంతివంతంగా మెరిసిపోయేలా చేయడంలో ఈ ప్యాక్ చాలా అద్భుతంగా పనిచేస్తుంది. 

       ఈ ప్యాక్ను ముఖంపై కూడా అప్లై చేసుకోవచ్చు.  టమాటో జ్యూస్  వద్దు అనుకున్న వారు నిమ్మరసం లేదా పొటాటో జ్యూస్ కూడా ఉపయోగించుకోవచ్చు. ఈ ప్యాక్ సన్  టాన్ పోగొట్టడంలో అద్భుతంగా పనిచేస్తుంది.

Leave a Comment

error: Content is protected !!