పండుగల సీజన్ వచ్చేసింది అంటే అందరూ అందంగా రెడీ అవ్వాలి అని అనుకుంటూ ఉంటారు. మనం ఏ డ్రెస్ వేసుకున్నా సరే మొఖం డల్ గా ఉంటే అందంగా కనిపించరు. మనం ఎటువంటి డ్రెస్ వేసుకున్న పండుగ సమయంలో అందంగా కనిపించాలంటే ముఖంలో గ్లో తప్పనిసరిగా ఉండాలి. మీరు అందంగా కనిపించాలంటే పార్లర్కి వెళ్లి కూర్చునే సమయం ఉండదు. ఎందుకంటే ఇంట్లో పండగలకు చాలా పనులు ఉంటాయి. వాటితోనే సరిపోతుంది.
పార్లర్కు వెళ్లి సమయం మరియు డబ్బులు వృధా చేసుకోకుండా ఇంట్లో ఉండే వాటితోనే ఈజీగా మీ ముఖం అందంగా, కాంతివంతంగా తయారు చేసుకోవచ్చు. ఈ ప్యాక్ తయారు చేసుకుని ఉపయోగించినట్లయితే 5 నిమిషాల్లో మీ ముఖం మెరిసిపోతుంది. దీని కోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక రెండు నిమిషాలు కస్తూరి పసుపు తీసుకోవాలి. మనం ఇంట్లో వంటల్లో వాడే పసుపు కూడా ఉపయోగించవచ్చు. కానీ కస్తూరి పసుపు ఉపయోగించినట్లయితే మంచి రిజల్ట్ ఉంటుంది.
కస్తూరి పసుపు ముఖం పై ఉండే సన్ టాన్ రిమూవ్ చేయడంలో అద్భుతంగా పనిచేస్తుంది. మీ ముఖం అందంగా, కాంతివంతంగా తయారు చేస్తుంది. తర్వాత దీంట్లో రెండు చెంచాల శనగపిండి వేసుకోవాలి. శనగపిండి చర్మంపై ఉండే జిడ్డు, మురికి మాయం చేయడంలో అద్భుతంగా పనిచేస్తుంది. శనగపిండి చర్మంపై ఉండే చాలా రకాల సమస్యలను తగ్గిస్తుంది. సన్ టాన్ ను పోగొట్టడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది. మీ చర్మం తెల్లగా, కాంతివంతంగా మెరిసిపోయెలా చేస్తుంది. తర్వాత దీనిలో ఒక చెంచా ముల్తానీ మట్టి వేసుకోవాలి.
ముల్తాని మట్టి అన్ని స్కిన్ టైప్స్ వారికి పనిచేస్తుంది. ఇది ముఖం అందంగా, కాంతివంతంగా తయారు చేస్తుంది. ముఖం పై ముడతలు పడినట్లు అయితే ముడతలు తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. ఈ మూడింటిని బాగా కలిపి ఒక గాజు సీసాలో పెట్టి స్టోర్ చేసుకోవాలి. ప్రతి రోజు స్నానానికి వెళ్ళే ముందు ఒక బౌల్లో వేసి కొంచెం పెరుగు వేసి కలిపి ముఖానికి అప్లై చేసి ఐదు నిమిషాల తర్వాత నీటితో కడిగేసుకోవాలి. ఇలా చేసినట్లైతే ముఖం అందంగా, కాంతివంతంగా తయారవుతుంది.
పెరుగు వద్దు అనుకున్న వాళ్లు పాలు లేదా రోజ్ వాటర్ కూడా వేసుకోవచ్చు. హాస్టల్లో ఉండే వాళ్ళు అయితే ఇది తయారు చేసుకుని డబ్బాలో పెట్టి తీసుకొని వెళ్ళవచ్చు. అక్కడ కలుపుకోవడానికి పెరుగు ఉండదు. కాబట్టి అలోవెరా జెల్ తో కలిపి అప్లై చేసుకోవచ్చు. ఇది ముఖానికి మాత్రమే కాకుండా బాడీ మొత్తం అప్లై చేసుకోవచ్చు. పండగల సమయంలో మీరు మరింత అందంగా కనిపించడంలో ఈ ప్యాక్ చాలా బాగా పనిచేస్తుంది.