Skin Glowing overnight remedy

ఇది రాత్రి పూట రాస్తే చాలు మీ ముఖం పై ఉన్న నలుపు మొత్తం పోయి కాంతివంతంగా మెరిసిపోతారు

ప్రియమైన స్నేహితులారా.. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ సున్నితమైన మరియు కాంతివంతమైన మచ్చలు లేని చర్మం కావాలని అనుకుంటారు. కొంతమందికి చర్మం పుట్టుకుతతోనే నల్లగా ఉంటుంది అలాగే కొంతమంది తమ చర్మానికి సరైన కేర్ తీసుకోకపోవడం వల్ల చర్మం యొక్క రంగు కొద్దికొద్దిగా తగ్గిపోతుంది. ముఖాన్ని అందంగా మచ్చ లేకుండా చేసుకోవడానికి మనం రకరకాల క్రీమ్స్ బీచ్ మరియు వంటింటి చిట్కాలు వాడుతూ ఉంటాము. కొన్నిసార్లు ఈ చిట్కాల  ప్రభావం మన చర్మం పైన కనిపిస్తుంది. కానీ కొద్దిరోజుల తర్వాత మరలా నార్మల్ గా మారిపోతుంది.

కొన్ని పదార్థాలు సహాయంతో మన చర్మం పై ప్రభావం చూపి మన చర్మం యొక్క రంగును శాశ్వతంగా కాంతివంతంగా మార్చుకోవచ్చు. అలాంటి చిట్కా ఇప్పుడు తెలుసుకుందాం. ఈ చిట్కా మీరు ప్రతిరోజు వాడడం వలన మన ముఖం పై ఉండే నల్లటి మచ్చలను తొలగించి చర్మం రంగును కాంతివంతంగా చేస్తుంది. పూర్తి వివరాలకు ఈ వీడియో చూడండి.

ఈ చిట్కా తయారీకి  కావలసిన పదార్థాలు

  • గులాబి పూలు
  • కస్తూరి పసుపు
  • పచ్చి పాలు
  • బంతిపూలు

తయారీ విధానం 

ముందుగా 8 నుంచి 10 బంతిపూలు మరియు 4 నుంచి 5 గులాబీ పూలను శుభ్రం చేసుకోవాలి. తర్వాత వీటి రేకులను వేరుచేసి వాటికి ఉండే తొడిమలు పక్కన పడేయాలి. తర్వాత ఈ రేకులలో కొద్దిగా నీటిని కలిపి మిక్సీలో కలిపి మెత్తటి పేస్ట్ లా తయారు చేసుకోవాలి. ఈ పేస్ట్ ను మీరు 4 నుంచి 5 రోజులు ఫ్రిజ్లో భద్రపరచి కొని వాడుకోవచ్చు. ఇప్పుడు మూడు నుంచి నాలుగు స్పూన్ల పచ్చిపాలలో ఒక చెంచా తయారుచేసుకున్న బంతిపూలు గులాబీ పూల పేస్టును మరియు ఒక చెంచా కస్తూరి పసుపు వేసి మూడింటిని బాగా కలిపి మెత్తటి పేస్ట్ లా తయారు చేసుకోవాలి.

ఎలా ఎప్పుడు వాడాలి 

ఈ మిశ్రమాన్ని ప్రతి రోజు రాత్రి నిద్రపోయే ముందు మీ ముఖం పై ఫేస్ ప్యాక్ లాగా అప్లై చేసుకొని 10 నుంచి 20 నిమిషాలు అలాగే వదిలేసి ఆ తర్వాత మామూలు నీటితో మీ ముఖాన్ని శుభ్రంగా కడుక్కోండి.

Marigold – Bantipulu

చర్మంపై ఉండే ఆయిల్ జిడ్డు పింపుల్స్ మరియు ఎండకు ఏర్పడే టాన్ తగ్గించడానికి బంతిపూలు అద్భుతంగా పనిచేస్తాయి. వీటిని వాడిన మొదటిసారే ఫలితం చూస్తారు. చర్మంపై ఏర్పడే నల్లధనం మరియు ఎలాంటి ఇన్ఫెక్షన్ అయినా పూర్తి శాతం తగ్గించడానికి బంతిపూలు చిట్కా బాగా పనిచేస్తుంది.

కస్తూరి పసుపు సాధారణ పసుపు కంటే పది రెట్లు అద్భుతంగా పనిచేస్తుంది దీన్ని వాడిన మొదటి సారి అద్భుతమైన మార్పును మీరు చూడవచ్చు. ఈ రెమిడి క్రమం తప్పకుండా వాడితే చర్మం రంగులో మంచి మార్పు వస్తుంది. కస్తూరి పసుపుని కస్తూరి మంజల్  లేదా వైల్డ్ టర్మరిక్ (Wild Turmeric) అని పిలుస్తారు. ఇది మీకు ఆయుర్వేదిక్ షాప్ లో లేదా ఆన్లైన్ లో చాలా సులువుగా దొరుకుతుంది.

మంచి రిజల్ట్స్ కోసం ఈ ఫేస్ ప్యాక్ ను మీరు రాత్రిపూట మాత్రమే అప్లై చేసుకోవాలి. ఎందుకంటే రాత్రి నిద్రపోయే సమయంలో మన శరీరం విశ్రాంతి తీసుకుంటుంది ఆ సమయంలో వాడే ఎలాంటి చిట్కా అయినా రెండు రెట్లు ఎక్కువ ప్రభావంతో పనిచేస్తుంది.

Leave a Comment

error: Content is protected !!