చాలామందికి ముఖం పైన, మెడ పైన మరియు శరీర భాగాలపై పులిపిర్లు ఉండి చాలా చిరాకుగా అనిపిస్తూ ఉంటాయి. ఇవి అధిక బరువు కారణంగానైనా, వైరస్ల వల్ల గాని, ఒకరి నుంచి మరొకరికి వ్యాపించడం ద్వారా గాని వస్తూ ఉంటాయి. వీటినుంచి విడుదల పొందడానికి డాక్టర్ చుట్టూ తిరుగుతూ ఉంటారు. కానీ ఏదో ఒక మూల వాటి తాలూకా మచ్చలు ఉంటాయని కొంతమంది వాటిని తీయించుకోవడానికి భయపడుతూ ఉంటారు. మరియు ఎన్నో రకాల కెమికల్ సహిత మందులు ఉపయోగిస్తూ ఉంటారు. కానీ వాటి వలన ఎటువంటి ఫలితం ఉండదు.
ఇప్పుడు మనం చెప్పుకోపోయే చిట్కా వీటి నుంచి విడుదల అందించడమే కాకుండా పులిపిర్ల తాలూకా మచ్చలు కూడా ఉండకుండా చేస్తుంది. కానీ దీన్ని రోజులో మూడుసార్లు ఉపయోగించవలసి ఉంటుంది. మీరు రెమిడిని తయారు చేసుకోవడానికి ఉపయోగించేవి అన్ని మన ఇంట్లో లభిస్తాయి. కనుక వీటి వలన సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఇప్పుడు ఈ రెమిడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనికోసం ముందుగా మనం ఒక క్లీన్ బౌల్ తీసుకోవాలి. అందులో ఒక హాఫ్ టీ స్పూన్ తమలపాకులో ఉపయోగించే సున్నంను వేసుకోవాలి. ఇప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి.
ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ వంట సోడా వేసుకోవాలి. ఈ మూడింటిని కొద్దిగా వాటర్ వేసుకొని పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇది మరీ పల్చగా ఉండకూడదు. మేము నొప్పి తట్టుకోగలం అనే వాళ్ళు వంట సోడాకు బదులుగా నిమ్మరసం కూడా ఉపయోగించవచ్చు. నిమ్మరసం వలన కొద్దిగా మంట మరియు నొప్పి ఉంటుంది. ఇందులో పసుపు మరియు సున్నం కలపడం వలన మిశ్రమం యొక్క రంగు ఎరుపువర్ణంలోకి వస్తుంది. ఇలా తయారు చేసుకున్న పేస్ట్ ను పులిపిర్లు ఉన్నచోట చిన్నగా అంటించుకోవాలి. ఇలా చేసిన తర్వాత ఒక పది నిమిషాల పాటు ఉంచాలి.
ఆ తర్వాత సాధారణ నీటితో ముఖంను శుభ్రం చేసుకోవాలి. ఇలా రోజుకు మూడుసార్లు చేయాలి. పులిపిర్లు సైజును బట్టి అవి రాలే సమయం ఉంటుంది. చిన్న పరిమాణంలో ఉండేవి రెండు, మూడు రోజుల్లో రాలిపోతాయి. పెద్ద సైజులో ఉండే పులిపిర్లు రావడానికి వారం సమయం వరకు పట్టవచ్చు. ఈ రెమెడీ ఉపయోగించేటప్పుడు కంటి దగ్గర జాగ్రత్తగా ఉండాలి. ఇది ఉపయోగించడం ద్వారా నొప్పి మరియు ఎటువంటి మచ్చ ఉండదు…