skin tan removal cream

ఒక స్పూన్ కాఫీ పొడి చాలు టాన్, జిడ్డు, మురికి తొలగిస్తుంది, స్కిన్ మెరిసిపోతుంది

ఇది పండుగల సీజన్ కాబట్టి మన ఎంత అందంగా రెడీ అయిన ఫేస్ లో గ్లో లేకపోతే అంత అందంగా కనిపించరు.  అందంగా కనిపించడం కోసం పార్లర్ కి వెళ్లి రకరకాల ఫేస్ప్యాక్లు చేయించుకుంటారు.  కానీ వాటి వలన ఎటువంటి ప్రయోజనం ఉండదు.  పార్లర్కు వెళ్లి వేలకు వేలు ఖర్చు పెట్టి సమయం వృధా చేసుకోవడం కంటే ఇంట్లో ఉండే వాటితో ముఖాన్ని  అందంగా, కాంతివంతంగా తయారు చేసుకోవచ్చు. దీనికోసం మనకు కావలసిన పదార్థాలు కాఫీ పొడి, పాలు,  కార్న్  ఫ్లోర్. 

     ఒక బౌల్ తీసుకొని ఒక చెంచా కాఫీ పొడి   వేసుకుని దానిలో కొంచెం పచ్చిపాలు వేసి బాగా ఉండలు లేకుండా కలుపుకోవాలి. తర్వాత దీనిని ఒక చెంచా కార్న్  ఫ్లోర్ వేసి బాగా కలుపుకోవాలి. స్టవ్ మీద పెట్టి రెండు నిమిషాలపాటు కలుపుతూ  ఉండాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని ఒక ఫేస్ట్  లాగా తయారవుతుంది. అలా అవ్వగానే స్టవ్ ఆఫ్ చేసుకుని కొంచెం చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఏదైనా ఎయిర్ టైట్ కంటైనర్ లో పెట్టి  ఫ్రిజ్లో పెట్టి స్టోర్ చేసుకోవచ్చు. ఇది రెండు రోజుల వరకు నిల్వ ఉంటుంది. 

      ఈ మిశ్రమం సన్  టాన్,  జిడ్డు, మురికి,మూతి చుట్టూ నల్లగా ఉన్న భాగంలో అప్లై చేసుకుని 10 నిముషాల పాటు ఉండనివ్వాలి. తర్వాత చల్లని నీటితో కడిగేసుకోవాలి. ఇలా చేసినట్లయితే చర్మం పై ఉండే సన్ టాన్, జిడ్డు, మురికి, డార్క్ నెస్ పోయి మీ చర్మం అందంగా, కాంతివంతంగా తయారవుతుంది.  ఈ మిశ్రమం ఎక్కువ సమయం బయట ఉండే కొద్ది  జున్ను లాగా తయారవుతుంది. దీన్ని ఒకసారి చెంచాతో కలిపినట్లయితే సరిపోతుంది. దీనిని  ఆడవారు, మగవారు అన్ని వయసుల వారు ఉపయోగించవచ్చు. 

       దీని వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. కాఫీన్  అనే పదార్థం చర్మంపై చాలా బాగా పనిచేస్తుంది. ఇది జిడ్డు, మురికి,సన్ టాన్ మీద యుద్ధం చేసి చర్మాన్ని తెల్లగా చేస్తుంది. పండగ సమయంలో పార్లర్కి వెళ్లి గంటలకొద్ది కూర్చుని వేలకు వేలు ఖర్చుపెట్టే  అవసరం లేకుండా ఒకసారి ఈ ప్యాక్ ట్రై  చేసినట్లయితే మంచి రిజల్ట్ ఉంటుంది. రిజల్ట్స్ చూసి మీరే ఆశ్చర్యపోతారు.ఈ ప్యాక్ పండగల సమయంలో మీ ముఖం అందంగా, కాంతివంతంగా చేయడంలో అద్భుతంగా పని చేస్తుంది. ముఖం పై ఉండే డార్క్ నెస్ తగ్గించడంలో కూడా ఉపయోగపడుతుంది.

Leave a Comment

error: Content is protected !!