Skin Whitening Face Pack At Home In Telugu

ముఖాన్ని 15 నిమిషాల్లో తెల్లగా చేసే అద్బుతమైన ఫేస్పాక్

ముఖం పై టాన్ పేరుకుపోయి నల్లగా చర్మంపై అక్కడక్కడ మచ్చలు ఉన్న వాటిని పోగొట్టుకోవడానికి రకరకాల క్రీములు వాడాల్సిన అవసరం లేదు. వాటి వల్ల వచ్చే దుష్ప్రభావాలు వలన మరింత ఇబ్బంది పడతాం. అందుకే సహజంగా దొరికే పదార్థాలతో ఒక ఫేస్ ప్యాక్ చర్మాన్ని ఎంతో మెరిపించడంతో పాటు, చర్మంలో ఉండే తేమని లాక్ చేస్తుంది.

 ఈ సీజన్లో డ్రై స్కిన్ ఉన్నవారి చర్మం ఎండిపోయినట్టు నిర్జీవంగా  తయారవుతుంది. కొంతమంది ఆయిలీ స్కిన్ ఉన్న వారికి చర్మం జిడ్డు కారుతున్నట్టు అయిపోతుంది. అలాంటి వారు ఈ చిట్కా పాటించడంవల్ల చర్మం కాంతివంతంగా అవడంతో పాటు జిడ్డు కారడం ఆగిపోతుంది. తాజాగా ఉంటుంది. 

దాని కోసం మనం తీసుకోవాల్సిన పదార్థాలు ఒక స్పూన్ గోధుమపిండి, ఒక స్పూన్ పెరుగు, ఒక స్పూన్ పాలు, కొంచెం పసుపు. వీటన్నింటినీ బాగా కలిపి చేతితో ముఖానికి అప్లై చేసుకోవాలి. ఇది చర్మ కణాలు ముఖంపై పేరుకున్న జిడ్డును తొలగిస్తుంది. వైట్ హెడ్స్, బ్లాక్హెడ్స్ ను నివారించడంలో సహాయపడుతుంది. ఈ ప్యాక్ కొంచెం ఆరిన తరువాత ఒక దూది ఉండను పచ్చి పాలలో ముంచి ముఖంపై ఉన్న ఫేస్ఫాక్ ను సర్కులర్ మోషన్ లో తుడవాలి. ఇలా ఒకసారి తుడిచిన తరువాత మొఖం పచ్చిగా అవుతుంది.

 అది ఆరెవరకు  అలా వదిలేయాలి. మళ్లీ దూదితో పచ్చిపాలను ముంచి మసాజ్ చేస్తూ తుడవాలి. తుడిచిన తర్వాత నీటితో శుభ్రం చేసుకోవచ్చు. ఏదైనా ఫంక్షన్ ,పండగలు ఉన్నప్పుడు రెండు రోజుల ముందు నుంచి రెండు పూట్ల ఇలా చేయడం వలన మంచి చర్మకాంతి సొంతం చేసుకోవచ్చు.  పెళ్లిళ్లు, ఫంక్షన్లు ఉన్నప్పుడు కనీసం పదిహేను రోజుల ముందు నుంచి ఒకసారి ఇలా ఫేస్పాక్ చేసుకోవడం వలన  పార్లర్ లో చేసే ఫేషియల్ కు ఏ మాత్రం తీసుకొని మెరుపు వస్తుంది.

 ముఖం మీద ప్యాక్ లాగా ఉపయోగించే శనగపిండి లేదా పెసర పిండి మాదిరిగానే, గోధుమపిండి కూడా జిడ్డుగల చర్మ సమస్యలు, టాక్సిన్స్, టాన్, మొటిమల సమస్యలు మరియు ముదురు రంగు మచ్చల నుండి పోరాడటానికి ఉపయోగపడుతుంది.  ఇది చర్మం యొక్క ఆకృతిని మెరుగుపరుస్తుంది మరియు సాగిపోయిన చర్మాన్ని గట్టిగా చేస్తుంది. 

 మీ చర్మ సంరక్షణ దినచర్యలో భాగంగా మీరు గోధుమపిండి ఖచ్చితంగా వాడాలి. పాలు, పెరుగు చర్మంపై ఉండే నలుపు, మచ్చలు తొలగించడంలో అద్బుతమైన ఫలితాలను ఇస్తాయి. పసుపు చర్మంపై టాన్ తొలగించడంలో అద్బుతంగా సహాయపడుతుంది. కనీసం వారానికి రెండు సార్లు వాడడం వలన మచ్చలు లేనీ చర్మం పొందవచ్చు.

Leave a Comment

error: Content is protected !!