Skin Whitening Homemade Beauty Tip

స్కిన్ వైట్నింగ్ టిప్, ఇది ఉపయోగించినట్లయితే ముఖంపై ఉండే జిడ్డు మురికి సన్ టాన్ అన్నీ పోతాయి

ప్రస్తుతం ఉన్న వాతావరణం పరిస్థితుల వల్ల కాలుష్యం వలన ముఖం పై జిడ్డు మురికి పేరుకుపోవడం, సన్ టాన్, డెడ్ స్కిన్ సెల్స్ పంటి సమస్యలను  ఎక్కువగా ఉన్నాయి. వీటిని తగ్గించుకోవడం  కోసం మనం పార్లర్ల చుట్టూ తిరుగుతూ ఉంటాము. పార్లర్  చుట్టూ తిరిగే  అవసరం లేకుండా కేవలం ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా ఈ  సమస్యలను తగ్గించుకోవచ్చు. దీనికోసం ముందుగా ఒక గుడ్డు తీసుకొని ఎగ్ వైట్ మరియు పచ్చ సొన సెపరేట్  చేసుకోవాలి.

      ఈ ప్యాక్ కోసం ముందుగా మనం  గుడ్డులోని పచ్చ సొన ని తీసుకుని దానిలో ఒక చెంచా కాఫీ పౌడర్ వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత  దీనిలో ఒక చెంచా మిల్క్ పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఉండలు లేకుండా కలుపుకోవాలి. గుడ్డు పచ్చ సొన స్కిన్ టైట్నింగ్ కి చాలా బాగా ఉపయోగపడుతుంది. గుడ్డులో ఉండే ప్రోటీన్స్ చర్మ సౌందర్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. మిల్క్ పౌడర్లో లాక్టిక్ ఆసిడ్ ఉండటం వలన డెడ్ స్కిన్ సెల్స్ రిమూవ్ చేయడంలో సహాయపడుతుంది.

     అంతే కాకుండా స్కిన్ వైట్నింగ్ కి కూడా సహాయపడుతుంది.  ఈ ప్యాక్ ముఖం మెడ కాళ్ళు చేతులు వంటి నల్లగా మారిన చోట అప్లై చేసుకోవాలి. అప్లై చేసిన తర్వాత 10 నిముషాల పాటు ఆరనివ్వాలి. ఆరిన తర్వాత చేతితో స్క్రబ్ చేస్తూ ప్యాక్ రిమూవ్ చేసుకోవాలి. తర్వాత చల్లని నీటితో కడిగేసుకోవాలి. ఇంకా మంచి ఫలితం కావాలి అనుకునేవారు రెడ్ మసూర్ దాల్ పౌడర్ ఉపయోగించి ముఖం కడుక్కోవచ్చు. మీరు కావాలంటే సబ్బుతో కూడా కడుక్కోవచ్చు. ఈ ప్యాక్ అప్లై చేయడం అన్ వాంటెడ్ హెయిర్, సన్ టాన్, జిడ్డు, మురికి, ఓపెన్ పోర్స్, నల్లటి మచ్చలు, డార్క్ సర్కిల్స్, డార్క్ స్పాట్స్, మొటిమలు వంటి సమస్యలు తగ్గుతాయి.

          పార్లర్ కి వెళ్లి వేలకు వేలు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేకుండా తక్కువ ఖర్చులో మీ ముఖం అందంగా, కాంతివంతంగా తయారవుతుంది. ఈ ప్యాక్ వారానికి ఒకసారి ఉపయోగిస్తే సరిపోతుంది. ఈ ప్యాక్ లో ఎటువంటి కెమికల్స్ ఉపయోగించ లేదు కాబట్టి దీనివలన ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. స్కిన్ తెల్లగా మెరిసిపోవాలి అనుకునేవారు ఒకసారి ట్రై చేసి చూడండి. రిజల్ట్ చూసి మీరే ఆశ్చర్యపోతారు. 

Leave a Comment

error: Content is protected !!