చాలామంది ముఖం ఫ్రెష్ గా మరియు కాంతివంతంగా లేదు అని బాధపడుతూ ఉంటారు. అటువంటి వారికి ఇప్పుడు మనం తయారు చేసుకోబోయే చిట్కా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది వరుసగా మూడు రోజులు ఉపయోగించవలసి ఉంటుంది. ఈ చిట్కా కోసం మనం బీట్రూట్ మరియు ఉడికించిన రైస్ ఉపయోగించుకుంటాం. అందువలన దీని వలన ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. మనం ఏదైనా ప్యాక్ ను ఉపయోగించే ముందు ఫేషియల్ టెస్ట్ చేసుకుంటే మంచిది. ఈ ప్యాక్ మూడు రోజులు ఉపయోగించడం ద్వారా మన చర్మం కాంతివంతంగా మరియు ఫ్రెష్ గా ఉంటుంది.
ఈ ప్యాక్ ను తయారు చేసుకోవడానికి ముందుగా మనం బీట్రూట్ ని ఫీల్ చేసుకోవాల్సి ఉంటుంది. బీట్రూట్ ని ఉపయోగించడం ద్వారా మన చర్మం కాంతివంతంగా ఉంటుంది. మరియు ముఖం పై ఉన్న జిడ్డును తొలగిస్తుంది. రెండవదిగా ఉడికించిన రైస్ తీసుకోవాలి. ఉడికించిన రైస్ ఉపయోగించడం వలన చర్మం పైన ఉన్న ముడతలు మరియు మృత కణాలు తొలగించబడతాయి. అంతేకాకుండా చర్మం టైట్ కావడానికి కూడా సహాయపడుతుంది. ఒక మిక్సీ జార్ లో బీట్రూట్ ను చిన్న చిన్న ముక్కలుగా చేసి వేసుకోవాలి. అందులో ఒక చిన్న సైజు బావుల్ రైస్ ని యాడ్ చేయాలి.
దీనిలో కొద్దిగా వాటర్ వేసి మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఈ పేస్ట్ లో కొద్దిగా అలోవెరా జెల్ కలుపుకోవాలి. అలోవెరా జెల్ మన చర్మం ఫ్రెష్ గా ఉండడానికి మరియు మాయిశ్చరైజర్ గా ఉపయోగపడుతుంది. దీనిలో ఒక స్పూన్ శనగపిండి కలుపుకోవాలి. శనగపిండి మంచి స్క్రబ్ లాగా పని చేస్తుంది. మరియు మృత కణాలను తొలగిస్తుంది. ఈ మొత్తం మిశ్రమాన్ని ఒక ప్యాక్ లాగా తయారు చేసుకోవాలి. ప్యాక్ ని ఉపయోగించుకోవడానికి ముందుగా మన ముఖం ఫ్రెష్ గా క్లీన్ చేసుకోవాలి.
ఇప్పుడు మనం తయారు చేసుకున్న మిశ్రమాన్ని ముఖంపై ఒక ప్యాక్ లాగా అప్లై చేసుకోవాలి. ఈ ప్యాక్ ను వరుసగా మూడు రోజులు ఉపయోగించడం ద్వారా మన చర్మం తెల్లగా మరియు ప్రకాశవంతంగా మారుస్తుంది. ఈ ప్యాక్ ను ఎవరైనా ఉపయోగించవచ్చు. మరియు ఈ ప్యాక్ ని ఉపయోగించడం ద్వారా మన చర్మం టైట్ గా అయ్యి యవ్వనంగా కనిపిస్తారు…