ఉద్యోగాలు, పనుల కోసం బయట తిరిగే వారు ముఖం, చేతుల వంటి భాగాలు నల్లగా మారుతుంటాయి. వాటికి ఎన్ని రకాల ప్రోడక్ట్స్ వాడినా ఫలితం ఉండదు. అలా ఎండలో నల్లగా అయిన భాగాలను తిరిగి తెల్లగా చేసుకోవడానికి కొన్ని రకాల ఇంటి చిట్కాలు చాలా మంచి ఫలితాలు ఇస్తుంది. మన శరీరంలో ఉండే మెలనిన్ ఎండ నుండి శరీరాన్ని రక్షించుకోవడానికి బయటకు వచ్చి చర్మాన్ని నల్లగా మారుస్తుంది.
దానిని తెల్లగా చెయ్యాలంటే ఎండనుండి రక్షణ కల్పించాలి. దానివలన కొన్ని నెలల్లో నల్లబడిన చర్మం తిరిగి తెల్లబడుతుంది. అలాగే రోజూ మూడు నుండి నాలుగున్నర లీటర్ల నీటిని తాగడం వలన కూడా చర్మం హైడ్రేటెడ్గా ఉండి కాంతిని సంతరించుకుంటుంది. ఇంకా చర్మం లోపల పదిహేను వరకూ మృతకణాల లేయర్స్ ఉంటాయి. ఇవి కొత్తవి వచ్చే కొద్దీ పాతవి తొలగిపోతుంటాయి. అలా పైన పేరుకున్న చర్మంపై నల్లదనం ఎక్కువ రోజులు ఉంటే మనం కొన్ని జాగ్రత్తలు ద్వారా తెల్లబడొచ్చు. మృతకణాలను తొలగించుకోవడానికి సున్నిపిండి చాలా బాగా ఉపయోగపడుతుంది.
ఒక రెండు నాటు టమాటాలను తీసుకుని మెత్తటి పేస్ట్లా చేసుకోవాలి. దీనిలో అరచెక్క నిమ్మరసం, కొంచెం పసుపు కలిపి ఎక్కడైతే నల్లగా ఉందో అక్కడ ముఖం, మెడ, చేతులకు అప్లై చేయాలి. ఆరిన తర్వాత సబ్బు కాకుండా నలుగు పెట్టి చల్లటి నీటితో స్నానం చేయాలి. ఇందులో వాడిన టమాటో లో ఉండి బ్లీచింగ్ గుణాలు చర్మంపై మృతకణాలు తొలగించడంలో సహాయపడతాయి. నిమ్మరసంలోని సిట్రిక్ యాసిడ్ మృతకణాలు వంటివి తొలగించి చర్మాన్ని మొటిమలు రహితంగా అందంగా తయారు చేస్తుంది.
దీనిలో కలిపిన పసుపు యాంటీ ఫంగల్ గుణాలతో ఇన్ఫెక్షన్లు రాకుండా చర్మాన్ని కాపాడుతుంది. ఈ మూడూ కలిపి వాడినప్పుడు చర్మాన్ని తెల్లగా చేయడంలో సహాయపడతాయి. నల్లగా పేరుకున్న టాన్ నిర్మూలిస్తాయి. ఇలా వారానికి రెండు , మూడు సార్లు చేయడం వలన మంచి ఫలితాలు ఉంటాయి. రోజుకు ఒకసారైనా పండ్ల రసం తీసుకోవడం మరియు కేరట్, బీట్రూట్, టమాటాలను కలిపి జ్యూస్ చేసుకుని తాగడం వలన కూడా శరీరంలో రక్తం శుభ్రపడి చర్మం స్వచ్ఛంగా మారుతుంది. మొటిమలు మచ్చలు లేని చర్మం మీ సొంతమవుతుంది.