ఇప్పుడు మనం తయారు చేసుకునే ప్యాక్ ని హ్యాపీగా ఫీల్ ఆఫ్ మాస్క్ కింద కూడా ఉపయోగించుకోవచ్చు. ఈ ప్యాక్ ఉపయోగించడం వలన చర్మం పై ఉన్న మృత కణాలు తొలగించబడతాయి. మరియు చర్మం పైనున్న రంధ్రాలు కూడా మూసుకుపోతాయి. అంతేకాకుండా చర్మంపై ఉన్న అవాంఛిత రోమాలు కూడా తొలగించబడతాయి. ఇందులో ఉపయోగించేవి మనకు ప్రకృతి సిద్ధంగా లభించినవి కాబట్టి ఈ ప్యాక్ ఉపయోగించడం వలన ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. కనుక దీనిని ఎవరైనా ఉపయోగించవచ్చు.
ఇప్పుడు ఈ ప్యాక్ ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందాం. దీనికోసం ముందుగా మనం ఒక టమాటా తీసుకొని రెండు ముక్కలుగా చేసి దానిలో ఉన్న గుజ్జు మరియు గింజలను పిండుకోవాలి. ఇప్పుడు ఇందులో ఆరేడు చుక్కల నిమ్మరసం పిండుకోవాలి. ఆ తర్వాత కస్తూరి పసుపు ఒక హాఫ్ స్పూన్ వేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకొని అందులో ఒక స్పూన్ మనం ఉపయోగించే ఏదైనా కాఫీ పౌడర్ వేసుకోవాలి. ఇది మొత్తం బాగా కలుపుకొని అందులో ఆరెంజ్ ఫీల్ ఆఫ్ మాస్క్ లేదా అలోవెరా జెల్ ఫీల్ ఆఫ్ మాస్క్ ను కలుపుకోవాలి.
ఇలా తయారు చేసుకున్న ఫేస్ ప్యాక్ ను ఎలా ఉపయోగించుకోవాలో ఇప్పుడు నేర్చుకుందాం. దీనికోసం ముందుగా మనం మన ఫేస్ ను నీటితో శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాత మన ముఖంపై మనం తయారు చేసుకున్న ప్యాక్ ను ముఖంపై ఒక లేయర్ లాగా అప్లై చేసుకోవాలి. అప్లై చేసేటప్పుడు ఈవెన్ గా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా అప్లై చేసిన తర్వాత 15 నిమిషాలు లేదా 20 నిమిషాల పాటు ప్యాక్ ను డ్రై అవ్వనివ్వాలి. ఫ్యాక్ డ్రై అయిన తర్వాత ఒక గ్లసీగా కనిపిస్తుంది.
ఆ తర్వాత ప్యాక్ ను పైనుంచి కిందకు పీల్ చేయవలసి ఉంటుంది. ఇలా చేయడం ద్వారా ముఖంపై ఉన్న వైట్ అండ్ బ్లాక్ హెడ్స్ తొలగించబడతాయి. మరియు అవాంఛిత రోమాలు కూడా తొలగించబడతాయి. అంతేకాకుండా చర్మం టైట్ గా అవుతుంది. ఇందులో ఉపయోగించిన నిమ్మరసం మరియు టమాటో జ్యూస్ ఫేస్ పై బ్లీచ్ లాగా పనిచేస్తుంది. కనుక చర్మం పై ఉన్న మృత కణాలు తొలగించబడతాయి. అంతేకాకుండా చర్మం ప్రకాశవంతంగా మెరుస్తుంది…