Skin Whitening Serum In Telugu Skin Whitening Home remedies in Telugu

శరీరమంతా తెల్లగా చేసే 1500/ సీరం 15 రూపాయలకే తయారుచేసుకోండి..

చాలామంది చర్మ రంగు మరింత మెరుగుపడాలని ఆశిస్తూ ఉంటారు. కానీ వారు ఉండే వాతావరణ పరిస్థితులు కానీ,కలుషిత  నీళ్లు లాంటివి చర్మ రంగును డల్ గా, నిర్జీవంగా తయారు చేస్తూ ఉంటాయి. అలాంటి చర్మాన్ని మెరిపించడం కోసం కాస్ట్లీ సీరం లాంటి ప్రోడక్ట్స్  కొని వాడాల్సి ఉంటుంది. కానీ అందరూ అంత ధరలు పెట్టి కొనలేరు గనుక మన ఇంట్లో ఉండే కొన్ని పదార్థాలతో విటమిన్ సి సీరమ్ చేసుకుందాం. దీనితో మొత్తం శరీరమంతా వైటింగ్ ఎఫెక్ట్ వస్తుంది ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా.

 దాని కోసం మనం తీసుకోవాల్సిన పదార్థాలు నిమ్మకాయ అర చెక్క తీసుకోవాలి. దీని పెంచడం వల్ల కనీసం నాలుగు చెంచాలు నిమ్మరసం తీసుకోవాలి. దీనిలో ప్లాంట్ బేస్డ్ గ్లిజరిన్ రెండు టేబుల్ స్పూన్లు వేసుకోవాలి. గ్లిజరిన్ యానిమల్ బేస్డ్, సింథటిక్ గ్లిజరిన్ కూడా ఉంటాయి. వాటిని తీసుకోకూడదు. తర్వాత ఇందులో కొబ్బరి నూనె వేసుకోవాలి. మన పురాతన కాలం నుండి కొబ్బరి నూనెను శరీరానికి మాయిశ్చరైజర్ గా ఉపయోగించేవారు. ఇది శరీరాన్ని పగుళ్ళు, అలర్జీలు లేకుండా ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. 

తర్వాత తీసుకోవాల్సిన పదార్థం రోజ్వాటర్. రోజ్ వాటర్ ఎటువంటి కెమికల్స్ లేనిది తీసుకోవాలి. ఇది కూడా నాలుగు చెంచాలు తీసుకోవాలి. చర్మంపై ఉండే మృత కణాలను తొలగించి చర్మం కాంతివంతంగా తయారు చేస్తుంది. ఇవి సహజ యాంట్రీ జెంట్గా పనిచేసి శరీర ఛాయని మెరుగుపరచడంలో సహాయపడతాయి. వీటన్నింటినీ బాగా కలిపి ఒక గాజు బాటిల్ లో నిల్వ చేసుకోవాలి.  ప్లాస్టిక్ అలాంటివాటిలో నిల్వ చేయడం వలన ఇందులో వాడిన గ్లిజరిన్, నిమ్మరసం వల్ల రసాయనిక చర్య జరగవచ్చు.

 తర్వాత దీనిన ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవచ్చు. కావలసిన ప్రదేశంలో ఎక్కడైతే పిగ్మెంటేషన్, నలుపుదనం, మచ్చలు ఉంటాయో అక్కడ ఈ సీరం 2, 3 చుక్కలు వేసి మసాజ్ చేస్తూ చర్మంలోకి ఇంకాపోయేలా చేయాలి. ఇలా చేయడం వలన చర్మంలోకి ఇంకి చర్మంపై ఉండే నలుపుదనాన్ని పోగొట్టడంలో చాలా బాగా సహాయపడుతాయి. ఈ సీరమ్ కనీసం 30 రోజుల పాటు క్రమం తప్పకుండా వాడితే మంచి ఫలితాలు ఉంటాయి. 

దీనిని ఏ స్కిన్ టైప్ వారైనా వాడవచ్చు. దీనిని ఐదు సంవత్సరాలు పైబడిన పిల్లలు నుండి పెద్దవారి వరకు అందరూ వాడవచ్చు. సెన్సిటివ్ స్కిన్ ఉన్నవారికి అలర్జీ అనిపిస్తే నిమ్మరసం తగ్గించవచ్చు.అందులో విటమిన్-సి వల్ల చర్మంపై చిన్నపాటి మంట అనిపించవచ్చు. కానీ అది కొన్ని సెకండ్లలో తగ్గిపోయి మామూలుగా అయిపోతుంది. దీనిని వీలైనంతవరకూ తాజాగా తయారుచేసుకొని ఉపయోగించండి.

Leave a Comment

error: Content is protected !!