skin whitening with coffee facial

ఒక స్పూన్ కాఫీ పౌడర్ చాలు మీ స్కిన్ తెల్లగా మెరిసిపోతుంది

వేసవి కాలం వచ్చేసరికి అందరికి సన్ టాన్ వలన రంగు మారిపోతూ ఉంటారు.  సన్ టాన్ పోయి మీ చర్మం అందంగా, కాంతివంతంగా తయారవ్వాలంటే పార్లర్ కి వెళ్లి గంటల కొద్దీ కూర్చుని వేలకు వేలు ఖర్చుపెడతారు. అనేక రకాల కెమికల్స్ ఉండే క్రీములను ఉపయోగిస్తారు. కెమికల్స్ ఉండటం వలన అనేక సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. పార్లర్ కి వెళ్లి గంటల కూర్చొనవసరం లేకుండా కేవలం కాఫీ పౌడర్ ఉపయోగించి చర్మం పై ఉండే సన్ టాన్ మొత్తం పోగొట్టుకోవచ్చు. దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకుని రెండు చెంచాల కాఫీ పౌడర్ వేసుకోవాలి. 

      తర్వాత దీనిలో ఒక చెంచా సెనగ పిండి, ఒక చెంచా బియ్యప్పిండి వేసుకోవాలి. తర్వాత దీనిలో రెండు చెంచాల పెరుగు కూడా వేసుకోవాలి. కొంచెం నిమ్మరసం వేసుకోవాలి. నిమ్మరసం వద్దు అనుకునే వాళ్ళు టమాటో జ్యూస్ వేసుకోవచ్చు. వీటన్నిటిని బాగా కలుపుకుని ముఖం మరియు కాళ్ళు  చేతులు మెడ వంటి నల్లగా ఉన్న భాగంలో అప్లై చేసుకుని  ఆరే వరకు ఉండనివ్వాలి. తర్వాత చల్లని నీటితో కడిగేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చర్మం పై  ఉండే , జిడ్డు, మురికి, సన్ టాన్ వంటి సమస్యలు తగ్గుతాయి. ముఖం అందంగా, కాంతివంతంగా తయారవుతుంది. 

     కాఫీ పౌడర్ సన్ టాన్ రిమూవ్ చేయడంలో అద్భుతంగా పని చేస్తుంది. బియ్యప్పిండి స్కిన్ వైట్నింగ్ కి బాగా సహాయపడుతుంది. సెనగపిండి చర్మం పై ఉండే సన్ టాన్,జిడ్డు, మురికి పోగొట్టడంలో చాలా బాగా పనిచేస్తుంది. పెరుగు ముఖం పై ఉండే జిడ్డు, మురికి, సన్ టాన్ పోగొట్టి చర్మం పై ఉండే మొటిమలు, మొటిమల వలన వచ్చిన మచ్చలను తగ్గిస్తుంది. చర్మాన్ని మోయిశ్చరైజ్ చేయడంలో పెరుగు ఉపయోగపడుతుంది.  ఈ ప్యాక్ను వారానికి ఒకసారి  ఉపయోగించినట్లయితే చర్మంపై ఉండే సన్ టాన్, జిడ్డు, మురికి, మొటిమలు వంటి సమస్యలు తగ్గుతాయి.

      మీ చర్మం అందంగా, కాంతివంతంగా తయారవుతుంది.  చర్మం పై  ఉండే సన్ టాన్  మొత్తం పోయి చర్మం తెల్లగా మెరిసిపోతుంది. ఈ ప్యాక్ లో ఉపయోగించినవి అన్ని మన ఇంట్లో ఉండేవి కాబట్టి ఎటువంటి ఖర్చు ఉండదు. దీనిలో కెమికల్స్ ఏమి ఉపయోగించలేదు. కాబట్టి దీనివలన ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. దీనిని అన్ని వయసుల వారు ఉపయోగించుకోవచ్చు. మంచి రిజల్ట్ ఉంటుంది. 

Leave a Comment

error: Content is protected !!