ఈ మధ్య కాలంలో అందరూ సన్ టాన్ వల్ల రంగు మారిపోయి ఉంటున్నారు. మళ్లీ తెల్లగా అవ్వడం కోసం రకరకాల చిట్కాలను, ఫేస్ ప్యాక్ లను, క్రీములను ఉపయోగిస్తున్నారు. అయినప్పటికీ ఎటువంటి ప్రయోజనం ఉండట్లేదు అనుకునేవారు ఒకసారి ఈ చిట్కాను ట్రై చేసి చూడండి. చాలా బాగా పనిచేస్తుంది. దీనికోసం కొన్ని బియ్యం తీసుకుని మిక్సీలో వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న పిండిని ఒక సారి జల్లెడ పట్టుకొని మెత్తగా ఉండే పౌడర్ మాత్రమే తీసుకోవాలి.
ఒక బౌల్ తీసుకొని అందులో రెండు చెంచాల మెత్తగా ఉండే బిజెపిని తీసుకుని కొంచెం పాలు వేసుకొని బాగా కలుపుకోవాలి. బియ్యం పిండి స్కిన్ వైట్నింగ్ కి చాలా బాగా సహాయపడుతుంది. ఇది చర్మం కి స్క్రబ్ లాగా బాగా ఉపయోగపడుతుంది. చర్మంపై ఉండే డెడ్ స్కిన్ సెల్స్, మురికి, జిడ్డు, బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ రిమూవ్ చేయడంలో అద్భుతంగా పనిచేస్తుంది. పాలు కూడా చర్మాన్ని మాయిశ్చరైజ్ చేయడంలో చాలా బాగా సహాయపడుతాయి. చర్మాన్ని తెల్లగా చేయడంలో కూడా పాలు చాలా బాగా ఉపయోగపడతాయి.
తర్వాత దీనిలో ఒక చెంచా బాదం నూనె వేసుకోవాలి. బాదం నూనె వద్దు అనుకున్న వాళ్లు కొబ్బరినూనె లేదా ఆలివ్ ఆయిల్ ను కూడా వేసుకోవచ్చు. మీ దగ్గర బాదం నూనె లేకపోతే కొబ్బరి నూనె లేదా ఆలివ్ ఆయిల్ వేసుకోవాలి. అంతే తప్ప నూనె వేసుకోకుండా ఈ ప్యాక్ ట్రై చేయకూడదు. నూనె వేసుకోకపోవడం వల్ల స్కిన్ డ్రై అయిపోయే అవకాశం ఉంటుంది. ఈ ప్యాక్ ను ముఖం మరియు బాడీ మొత్తం కూడా అప్లై చేసుకోవచ్చు. ఇది పల్చగా కాకుండా మందంగా అప్లై చేసుకోవాలి.
అప్లై చేసిన తర్వాత బాగా ఆరే వరకు ఉండనివ్వాలి. ఆరిన తర్వాత చేతితో మృదువుగా మసాజ్ చేసుకుంటూ ప్యాక్ రిమూవ్ చేయాలి. చేతితో స్క్రబ్ చేసిన రాకపోతే కొంచెం పాలు వేసి స్క్రబ్ చేసుకోవాలి. తర్వాత చల్లని నీటితో కడిగేసుకోవాలి. తర్వాత మామూలుగా స్నానం చెయ్యొచ్చు. సబ్బు కూడా వాడొచ్చు. ఇలా వారానికి రెండు సార్లు చేయడం వలన స్కిన్ తెల్లగా మెరిసిపోతుంది. ఈ ప్యాక్ ముఖం పై ఉండే డార్క్ స్పాట్స్, నల్లటి వలయాలు, మొటిమల వలన వచ్చిన మచ్చలు,సన్ టాన్ మొత్తం పోయి స్కిన్ చాలా క్లియర్ గా ఉంటుంది.ఈ రెమెడీ మీరు కూడా ట్రై చేయండి. చాలా బాగా పనిచేస్తుంది.