సీజన్ మారిపోయి చలిగాలులు వేయడంతో చిన్నపిల్లల్లో, పెద్దవారిలో కూడా జలుబు, దగ్గు వంటి సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి. వీటిని తగ్గించుకోవడానికి మందులు వాడటం కంటే ఇంట్లో నివారణ చిట్కాలతో త్వరగా ఉపశమనం పొందవచ్చు మరియు కెమికల్స్తో నిండిన మందులు వాడడం వల్ల శరీర అవయవాలు దెబ్బతినకుండా కాపాడుకోవచ్చు. మన ఇంట్లో ఉండే కొన్ని పదార్థాలు జలుబు, దగ్గు తగ్గడంలో చాలా బాగా సహాయపడుతాయి. ఇప్పుడు చిట్కా కోసం మనం సోంపు గింజలు తీసుకోవాలి. ఫెన్నెల్ గింజలు కూడా జలుబు, దగ్గు మరియు ఫ్లూ ప్రమాదాన్ని నివారించడంలో సహాయపడే శోథ నిరోధక అస్థిర నూనెలు మరియు యాంటీఆక్సిడెంట్ల శ్రేణితో నిండి ఉంటాయి.
DK పబ్లిషింగ్ హౌస్ రాసిన ‘హీలింగ్ ఫుడ్స్’ పుస్తకం ప్రకారం, ఫెన్నెల్ గింజల రసంతో తయారు చేసిన సిరప్ సాంప్రదాయకంగా శ్లేష్మం కరగటానికి ఉపయోగిస్తారు. తర్వాత ఒక యాలకును తీసుకుని వీటితో పాటు ఒక గ్లాసు నీటిలో వేయాలి. ఎలైచీలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. నిజానికి, నలుపు ఏలకులు జలుబు మరియు దగ్గు యొక్క లక్షణాలను ఎదుర్కోవడంలో సహాయపడతాయి, అయితే దాని గింజల నుండి తీసుకోబడిన నూనె గొంతు నొప్పిని శాంతపరచడానికి ఒక క్రిమినాశక మందు వలె పనిచేస్తుంది. ఇప్పుడు ఈ నీటిని స్టవ్ మీద పెట్టుకొని కొంత సేపు మరిగించాలి.
ఈ నీళ్ళు బాగా మరిగి రంగు మారిన తర్వాత స్టవ్ ఆపేసి నీటిని వడకట్టుకోవాలి. ఈ నీటిలో తేనె కలిపి తీసుకోవచ్చు. పెద్దవారు అయితే ఒక గ్లాసు, చిన్నపిల్లలైతే అరగ్లాసు ఈ కషాయం తాగడం వలన జలుబు, దగ్గు త్వరగా తగ్గిపోతాయి. జలుబు ఎక్కువగా ఉంటే ఉదయం, సాయంత్రం తాగాలి. తక్కువగా ఉన్నప్పుడు ఏదో ఒక పూట తాగడం వలన ఉపశమనం పొందవచ్చు. ఈ కషాయం జలుబు, దగ్గుతో పాటు ఊపిరితిత్తులలో కఫాన్ని కరిగించి శ్వాసనాళాల్లో వాపులు, అడ్డంకులను తొలగిస్తుంది. ముక్కు రద్దీని తగ్గిస్తుంది. శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచి సీజనల్ వ్యాధుల బారిన పడకుండా అడ్డుకుంటుంది. అలాగే తిన్న ఆహారం బాగా జీర్ణం అయి మలబద్ధకం, గ్యాస్, ఎసిడిటీ, త్రేన్పులు వంటి సమస్యలు ఏర్పడకుండా ఈ కషాయం కాపాడుతుంది.