మన చుట్టూ ఉండే పరిసరాలు చాలా మొక్కలు ఉంటాయి. వాటిలో కొన్ని సువాసనలు వెదజల్లుతూ ఉంటాయి. కొన్ని మొక్కలు ఔషధ గుణాలు కలిగి ఉంటాయి. మన పూర్వీకులు హాస్పిటల్స్, మందుల మీద కాకుండా మొక్కల మీద ఆధారపడి రోగాలు నయం చేసుకునే వారు. కానీ ఈ మొక్క ఇంట్లో పెట్టుకున్నట్లైతే ఇల్లంతా సువాసనలతో నిండి పోయి, ఒక్క దోమ కూడా ఇంటి దరిదాపుల్లోకి రాదు. ఆ మొక్క ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
లెమన్ గ్రాస్ దీనినే నిమ్మగడ్డి అంటారు. నిమ్మగడ్డి, పుదీనా ఆకులు, లవంగ తులసి ఆకుల హెర్బల్ టీ తాగినట్లయితే శరీరానికి చాలా ఔషధ గుణాలు అందుతాయి. ఈ టీ తాగడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. నిమ్మగడ్డి నుంచి తీసే ఆయిల్ కాస్మెటిక్స్ లోనూ, పెర్ఫ్యూమ్స్ లోనూ, మందుల తయారీలో ఉపయోగిస్తారు. ఈ మొక్క మీ ఇంట్లో పెంచుకోవడం వల్ల దోమలు, పాములు వంటివి ఇంటి దరిదాపుల్లో కూడా చేరవు. లెమన్ గ్రాస్ ని బాల్కనీలో లేదా పెరట్లో పెంచుకోవచ్చు. 5 నుంచి 6 గంటలు ఎండ తగిలేలా ఉండాలి. నిమ్మగడ్డి ఎండ తగిలేలా ఉంచడం వలన దానిలో ఉండే అరోమా బయటకి వస్తుంది.
ఈ వాసనకి పాములు, దోమలు, కీటకాలు మన ఇంటి చుట్టు పక్కలకి రావు. లెమన్ గ్రాస్ వాసన దోమలకు, పాములకు అసలు పడదు. ఈ మొక్క యొక్క జీవిత కాలం నాలుగు సంవత్సరాలు. మొక్క వేసిన నాలుగు నెలలకు మొదటి కాపు వస్తుంది. దీనిని కట్ చేసినా మళ్లీ ఎదుగుతుంది. వీటిని ఆవులు, మేకలు తినవు. నిమ్మగడ్డి వాసనకు దోమలు రావు. దీనివల్ల డెంగ్యూ, మలేరియా జ్వరాల నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చు. నిమ్మగడ్డి తో చేసే హెర్బల్ టీ తాగడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. లెమన్ గ్రాస్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. లెమన్ గ్రాస్ తీసుకోవడం వల్ల కడుపులో ఏమైనా సమస్యలు ఉంటే తగ్గుతాయి.
లెమన్ గ్రాస్ ఫ్రెష్గా లేదా ఎండబెట్టి పొడిలా కూడా తీసుకోవచ్చు. గ్యాస్ట్రిక్, వికారం వంటి సమస్యలు కూడా తగ్గుతాయి. లెమన్ గ్రాస్లో ఆంటీఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. అందువల్ల ఇది కాన్సర్ తగ్గిస్తుంది. హార్ట్ ఎటాక్, రక్తం గడ్డ కట్టడం వంటి సమస్యలకు నిమ్మగడ్డి బాగా పనిచేస్తుంది. నిమ్మగడ్డితో చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది.