smokers lung cleansing home remedy

ఊపిరితిత్తుల కణ కణంలో ఉన్న డస్ట్ అంతా క్లీన్!!!

ఊపిరితిత్తుల లోపల గాలి గొట్టాలలోను, గాలి తిత్తులలోనూ కఫాలు, శేష్మాలు పేర్కొన్నప్పుడు అవి లంగ్ కెపాసిటీని తగ్గించేస్తాయి. మనం పీల్చిన గాని గాలి గొట్టాల ద్వారా గాలితిత్తులను చేరుతుంది. ఈ గాలిగొట్టాలను చిన్న చిన్న బ్రాంచెస్ లా విభజించబడి ఉంటాయి. మన రక్తాన్ని శుద్ధి చేసేవి ఈ గాలితిత్తులే. మనం పీల్చుకున్న ప్రాణవాయువు చిట్ట చివరికి ఈ గాలితిత్తుల్లో ఆగుతుంది. గుండె నుంచి వచ్చే చెడు రక్తం ఈ గాలితిత్తులను చేరి ఇక్కడే ఆక్సిజన్ కార్బన్డయాక్సైడ్ ఎక్స్చేంజ్ అవుతాయి. ఇప్పుడు ఆక్సిజన్ తో కలిసి మంచి రక్తంగా మారుతుంది. ఈ గాలి గొట్టంలోనూ గాలి తిత్తుల్లోను  శేష్మాలు ఎక్కువగా చేరడం వల్ల గాలి సరిగా వెళ్లలేదు.

               గాలి పీల్చుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. కఫము, శేష్మాలు లోపల ఎంత పేరుకుని ఉంటాయో ప్రాణవాయువుకు రాకపోకలు అంత ఆటంకంగా ఉంటాయి. ప్రధానంగా ఈ గాలితిత్తుల్లో కఫాలు, శేష్మాలు లేకుండా ఉండాలంటే ఇలా చేయాలి. ప్రతిరోజు కూడా గోరువెచ్చని నీటిని తాగడం, రోజు వేడి నీళ్ల ఆవిరి పెట్టుకోవడం ఈ ఆవిరిలో యుకలిప్టస్ ఆయిల్ గాని, పసుపు గాని వేసి ఆవిరి పట్టుకోవాలి. వేప పుల్లను నమలిన ఆ చేదుకి కఫాలు, శేష్మాలు బయటికి వచ్చేస్తాయి. కఫాలు, శేష్మాలు త్వరగా తగ్గించుకోవాలంటే ఉదయం పూట ఆహారం తీసుకోకుండా ఒంటి గంట వరకు గోరువెచ్చని నీళ్లలో నిమ్మరసం, తేనె మరియు మిర్యాల పొడిని కలుపు కోవాలి.

                     ఇలా 1, 2 సార్లు తాగుతూ ఉండాలి. ఇలా తాగితే కఫము, శేష్మాలు తగ్గి గొంతు నొప్పి కూడా తగ్గుతుంది. ఇలా ఉదయం రెండుసార్లు తాగాలి. మధ్యాహ్నం భోజనం చేయాలి. సాయంత్రం ఐదు గంటలకు ఒకసారి తాగాలి. మళ్ళీ రాత్రి పడుకునే ముందు ఒకసారి తాగాలి. ఇట్ల ఒక వారం రోజులు చేస్తే కఫాలు శ్లేష్మాలు పూర్తిగా తగ్గిపోతాయి. లంగ్ కెపాసిటీ కూడా పెరుగుతుంది. దీనికి తోడు ప్రాణాయామం కూడా చేయాలి. ఇలా చేస్తే లంగ్స్ కూడా చాలా హెల్తీగా ఉంటాయి. సంవత్సరాల  తరబడి ఇలాంటి సమస్య ఉన్నవారు కొన్ని నెలల పాటు ఈ నియమాలను పాటించాలి. ఎక్సర్సైజులు చేస్తూ ఉండాలి. సూర్య నమస్కారాలు చేస్తూ ఉండాలి.

               ఇలాంటివి చేస్తే శేష్మాలు ఆవిరి అయిపోతాయి. తరువాత రెగ్యులర్గా ప్రాణాయామం చేస్తూ ఉండాలి. ఇలా చేస్తే వైరస్ ఇన్ఫెక్షన్ కూడా తగ్గుతాయి.

Leave a Comment

error: Content is protected !!