పాముకాటు వలన ప్రాణాలు కోల్పోతున్న వారు సంవత్సరం, సంవత్సరానికి ఎక్కువవుతున్నట్టు ఒక సర్వేలో వెల్లడయింది. పొలంలో పనిచేసే రైతులు లేదా అప్పుడప్పుడు పాములు ఇల్లలోకి రావడం వలన కూడా పాముకాటుకు గురవుతుంటారు. క్షణంలో ప్రాణాల్ని హరించే పాములు కొన్నయితే సమయానికి వైద్య సహాయం అందక మరణించేవారు కొందరు. భారతీయ ఉపఖండంతో సహా ఉష్ణమండల దేశాలలో మరణాలకు పాముకాటు ప్రధాన కారణం. ప్రస్తుత సమీక్ష భారత ఉపఖండంలో భారతదేశం, బంగ్లాదేశ్, పాకిస్తాన్ మరియు నేపాల్ దేశాల్లో పాముకాటుకు వ్యతిరేకంగా వివిధ మొక్కలను ఉపయోగించడం ద్వారా గత కొన్ని సంవత్సరాలుగా చేసిన ఎథ్నోబోటానికల్ పరిశోధనల గురించి వివరిస్తుంది. మరింత సమాచారం కోసం క్రింద లింక్ చూడండి..
వివిధ రకాల సాహిత్య వనరుల నుండి సమాచారాన్ని బట్టి మొక్కలు, వాటిలో ఉపయోగించిన భాగాలు, మోతాదు, పరిపాలన విధానం, జాతుల పేర్లు, భౌగోళిక స్థానాలు మొదలైనవాటిని ప్రస్తావిస్తూ సంకలనం చేయబడింది.అలాగే పూర్వము పాముకాటు, తేలుకాటుకు తులసిని వైద్యంలో ప్రముఖంగా ఉపయోగించే వారు. పాముకాటు, తేలుకాటు వలన మరణం సంభవిస్తుంది. పాముకాటు, తేలుకాటుకు గురయినపుడు మనిషి కంగారు పడకూడదు, నడవకూడదు,పరిగెత్తకూడదు. కంగారు పడడం నడవడం వలన రక్తప్రసరణ వేగవంతం అయి విషం శరీరం మొత్తం వ్యాపిస్తుంది.
అందుకే పాముకాటుకు గురయిన వ్యక్తులను ఒకచోట కుర్చోబెట్టి కాటుకు గురయిన ప్రదేశం నుండి శరీరమంతా వ్యాపించకుండా ఏదైనా తాడుతో గట్టిగా కట్టాలి. తులసి ఆకులు శుభ్రం చేసి నమిలేందుకు ఇవ్వాలి. తర్వాత ఆ కాటుకు గురయిన ప్రదేశాన్ని శుభ్రపరిచి తులసి వేరును అరగదీసి గంధంలా చేయాలి. పాముకాటు ఉన్న ప్రదేశంలో ఈ గంధాన్ని వెన్నతో కలిపి పూయాలి. వెన్న లేకపోతే వదిలేయాలి. గంధం పూసాక విషాన్ని లాక్కుని నల్లగా మారుతుంది. అది తుడిచి మళ్ళీ కొత్తగా వేయాలి.
ఇలా నల్లగా మారనంతవరకూ గంధం వేస్తూ ఉండాలి. ఇలా చేస్తే విషం మొత్తం తులసిగంధం పీల్చుకుంటుంది. తేలుకాటుకు కూడా ఇదే పద్ధతి పాటించాలి. ఇది అతి పురాతన ఆయుర్వేద పద్థతి. ఇలా చేయడంవలన అనేక మంది ప్రాణాలు కాపాడారు పూర్వీకులు.