snake gourd health benefits

పోట్లకాయ గూర్చి ఆశ్చర్యపరిచే నిజాలు!!

 పొట్లకాయ తీగజాతికి చెందినది,  ఈ కూరగాయలో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.  సాధారణంగా పోట్లకాయను వంటల్లో వివిధ రకాలుగా ఉపయోగిస్తూ ఉంటాము. ముఖ్యంగా పోట్లకాయ బజ్జిలు, పోట్లకాయ పెరుగు పచ్చడి, పోట్లకాయ కూర ఇలాంటివి బోలెడు. కొందరు పోట్లకాయను జ్యుస్ చేసుకుని తాగుతూ ఉంటారు కూడా. వీటివల్ల చేకూరే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలిస్తే పోట్లకాయను విరివిగా వాడటం మొదలుపెడతారు.

 డయాబెటిస్‌ను  నివారిస్తుంది.

 టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారికి ఇది చాలా మంచిది. ఇందులో కేలరీలు తక్కువగా ఉంటాయి మరియు బరువు తగ్గించడంలో సహాయపడతాయి.  డయాబెటిస్ చికిత్సలో ఈ కూరగాయను ఎక్కువగా వాడమని సలహా ఇస్తుంటారు. ఇది డయాబెటిస్ ప్రభావాన్ని తగ్గించగల గుణాలను కలిగి ఉంటుంది. పోట్లకాయను ఏదో ఒక రూపంలో ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల డయాబెటిస్ ఉన్నవారికి మంచి ఉపశమనం లభిస్తుంది.

 కామెర్ల వ్యాధికి మంచి ఔషధం

కామెర్లు చికిత్సకు కొత్తిమీర మరియు పోట్లకాయ ఆకులను ఉపయోగించడం ద్వారా మంచి ఫలితం పొందవచ్చు. కామెర్లు సమస్య ఉన్నవారు ఈ ఆకులను రోజు మూడు పూటలా రెండు ఆకులను కలిపి తినడం వల్ల కామెర్ల చికిత్స వేగవంతంగా మంచి పలితాన్ని ఇవ్వడంలో దోహదం చేస్తుంది. అలాగే బిలిరుబిన్ స్థాయిలను తగ్గిస్తుంది కూడా. 

 బరువు తగ్గడానికి సహాయపడుతుంది: 

పోట్లకాయలో తక్కువ కేలరీలు ఉంటాయి మరియు కొవ్వు పదార్థాలు అసలు ఉండవు.  కాబట్టి దీన్ని తీసుకోవడం వల్ల బరువు తగ్గడంతో గొప్పగా సహాయపడుతుంది. ఎందుకంటే ఇది నీరు మరియు ఫైబర్‌తో పాటు ముఖ్యమైన పోషకాలను కలిగి ఉంటుంది.  కాబట్టి మీరు సహజంగా బరువు తగ్గాలని అనుకుంటే మాత్రం తప్పకుండా పోట్లకాయను ఆహారంలో భాగం చేసుకోవాల్సిందే..

 శరీరాన్ని డిటాక్సీఫికేషన్ చేస్తుంది:

 శరీరంలో దాగున్న విషాలను బయటకు పంపడంలో పోట్లకాయ సమర్థవంతమైన పాత్రను పోషిస్తుంది. శరీరంలో అవయవాల పనితీరు మెరుగుపడేందుకు సహాయపడుతుంది. మూత్రవిసర్జన ప్రక్రియ ద్వారా శరీరంలోని టాక్సిన్ లను బయటకు పంపడంలో దోహాధం చేస్తుంది.  అలాగే ఇది కాలేయం పనితీరును మెరుగుపరచడంలో కూడా సహాయపడుతుంది. 

 గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది: 

పోట్లకాయ యొక్క సారం గుండె సంబంధిత సమస్యలను అరికట్టడానికి సహాయపడుతుంది.  గుండెకు సంబంధించిన ఒత్తిడి మరియు నొప్పిని తగ్గించడానికి రోజూ పోట్లకాయను ఆహారంలో భాగం చేసుకోవాలి. .

 మలబద్దకాన్ని నివారిస్తుంది: 

 మలబద్ధకానికి చికిత్స  చేయడంలో పోట్లకాయ ఉత్తమమైన ఎంపిక.  ఇది తేలికపాటి  లక్షణాలను కలిగి ఉన్నందున జీర్ణమయ్యేటపుడు సులువుగా జీర్ణమయ్యి జీర్ణవ్యవస్థను, పేగులకు,  మరియు కడుపును క్లియర్ చేయడానికి సహాయపడుతుంది.  పెగజల ఆరోగ్యాన్ని మెరుగు పరుచుకోవడానికి ప్రగహిరోజు ఉదయాన్నే ఒకటి నుండి రెండు స్పూన్ల పోట్లకాయ రసాన్ని తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. 

 దంతాలు మరియు ఎముకలను బలపరుస్తుంది: 

ఇందులో  కాల్షియం అధికంగా ఉంటుంది, ఇది దంతాలు మరియు ఎముకలను బలోపేతం చేయడానికి సహాయపడుతుంది.  ఎముక ఆరోగ్యం విషయానికి వస్తే కాల్షియం చాలా ముఖ్యమైనది. అలాంటి కాల్షియం మెండుగా ఉన్న పోట్లకాయను తీసుకోవడం వల్ల ఎముక సామర్థ్యం దృఢమవుతుంది.

చివరగా…..

పోట్లకాయ అందరికి తెలిసినదే అయినా ఆరోగ్య ప్రయోజనాలు తెలిసాక ఇక రోజూ తప్పక తినడం మంచిది కాదంటారా??

Leave a Comment

error: Content is protected !!