soak raisins with milk and drink daily before bedtime

1 గ్లాస్ తాగితే చాలు చేతులు,కాళ్ళు,నడుంనొప్పి,బలహీనత, అలసట,రక్తహీనత లేకుండా 90 ఏళ్ళు వచ్చినా హాయిగా

రసాయనాలతో నిండిపోయి పోషకాలు లేని ఆహారం నేటి యువతను చిన్న చిన్న పనులకు కూడా అలసిపోయేలా చేస్తుంది. ఏ పనిచెయ్యాలన్నా అలసిపోతుంటే ఇక రోజువారీ పనులు చేసెదెలా. పెద్ద పెద్ద గమ్యాలను అందుకునేది ఎలా. అందుకే ఇలాంటి నిస్సత్తువ ను మొదట్లోనే నిరోధించి బలంగా చేసే కిస్మిస్ (ఎండుద్రాక్ష) గురించి తెలసుకుందాం. ఎండుద్రాక్షను ఆహారంలో భాగం చేసుకోవడం వలన విటమిన్ బి, ఐరన్, పొటాషియం పుష్కలంగా లభిస్తాయి. ఈ ఎండుద్రాక్ష అందుబాటులో ఉండడంతో పాటు రుచిగా ఉండి అనేక రోగాలను దరిచేనివ్వవు.  ఎండుద్రాక్ష గురించి మరింత సమాచారం కోసం ఈ వీడియో చూడండి.

ఒబేసిటీ, గుండె వ్యాధులు, మధుమేహం రాకుండా చేస్తాయి. అనీమియా ఉన్నవారికి కూడా ఎండుద్రాక్ష మంచిమందు. ఎండుద్రాక్ష లో యాంటీ బాక్టీరియల్ గుణాలు ఉంటాయి. జ్వరం, వైరల్ ఇన్ఫెక్షన్ తగ్గించడంలో చాలా బాగా పనిచేస్తాయి. కీళ్ళనొప్పులను తగ్గించే బోరాన్ ఇందులో అధికంగా ఉంటుంది. కంటిచూపుకు మంచిచేసే బీటాకెరొటిన్ లభించి కంటిచూపు బలంగా చేస్తుంది. మలబద్దకంతో బాధపడేవారు గుప్పెడు ఎండుద్రాక్ష తీసుకోవడం వలన  ఉదర సమస్యలు తగ్గుతాయి.

కేన్సర్తో పోరాడే యాంటీ ఆక్సిడెంట్లు ఎండుద్రాక్షలో అధికంగా లభిస్తాయి. బీ.పీని కంట్రోల్ చేసే పొటాషియం కూడా లభించి అనారోగ్యాలను దూరంపెడుతుంది. జలుబు, దగ్గులకు వ్యతిరేకంగా పోరాడి కఫాన్ని కరిగిస్తుంది.

ఒక పదిహేను ఎండుద్రాక్ష తీసుకుని నీటిలో నానబెట్టి  ఉదయం ఆ నీటితోనే  ఉడికించి తర్వాత పరగడుపున ఎండుద్రాక్ష నమిలి, ఆ నీటిని గోరువెచ్చగా తీసుకోవడం వలన  మలబద్దకం, గ్యాస్ సమస్యలు తగ్గించి శరీరానికి తక్షణ శక్తి ని అందిస్తుంది.

మరింత ఎక్కువ ప్రయోజనాల కోసం  ఒక గ్లాసుపాలను మరిగించి అందులో పాతబడిన, ముదురు రంగులో ఉండే కిస్మిస్ వేసి  ఆ పాలను చక్కెర, తేనె కలపకుండా తాగడం వలన కాల్షియం, పొటాషియం లభించి ఎముకల బలహీనత, కీళ్ళనొప్పులతో బాధపడేవారికి ఉపశమనం లభిస్తుంది. మెగ్నీషియం కూడా శరీరంలో చేరి  శరీరంలోని విషపదార్థాలు లేకుండా చేయడంవలన శరీరం శుభ్రపడుతుంది. ఐరన్ కూడా అధికంగా ఉంటుంది కాబట్టి దీనివలన శరీరంలో రక్తహీనత సమస్య పరిష్కరించబడి హిమోగ్లోబిన్, ఐరన్  లెవల్స్ పెరుగుతాయి. ఎండుద్రాక్ష గుండెకు బలాన్ని చేకూర్చుతుంది.

1 thought on “1 గ్లాస్ తాగితే చాలు చేతులు,కాళ్ళు,నడుంనొప్పి,బలహీనత, అలసట,రక్తహీనత లేకుండా 90 ఏళ్ళు వచ్చినా హాయిగా”

  1. You are prescribing good health information. I liked the channel. I see daily for health tips. I want home remedies for falling hair, knees pain, weight reduction and for fungal infections on the feet and chest. Kindly let me know immediately. Daily in the morning I will take like warm water with Dalchina chakka Powder, half nimbu,mahabeera seeds, sabja seeds.

    Reply

Leave a Comment

error: Content is protected !!