soaked raisins health benefits

ఎండుద్రాక్ష తినే ప్రతిఒక్కరూ ఒక్కసారి ఈ వీడియో చూడండి మీశరీరంలో ఏం జరుగుతుందో తెలిస్తే షాక్.

హలో ఫ్రెండ్స్… డ్రై ఫ్రూట్స్ లో ఎండు ద్రాక్ష /కిస్మిస్ ల గురించి తెలియని వారుండరంటే అతిశయోక్తి కాదు. వీటిని ప్రతిరోజు ఏ టైంలో ఎంత మోతాదులో ఎంత తీసుకోవాలో చాలామందికి తెలియదు. ఈరోజు ఎండు ద్రాక్ష ఎలా తీసుకుంటే మన ఆరోగ్యానికి ఎలాంటి హెల్త్ బెనిఫిట్స్ కలుగుతాయో తెలుసుకుందాం. అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ కంటే ఎండుద్రాక్ష లోనే ఎక్కువగా పోషకాలు ఉంటాయి. వీటిలో పోషక విలువలు తెలియక చాలామంది చిన్న చూపు చూస్తూ ఉంటారు. వీటిలోని ఆరోగ్యప్రయోజనాలు తెలుసుకుంటే ఖచ్చితంగా మీ రెగ్యులర్ డైట్ లో తప్పకుండా తీసుకుంటారు.

ఎండుద్రాక్షలు రకరకాలు ఉంటాయి గోల్డెన్ కలర్ లో ఉండేటివి మనం ఎక్కువగా వంటకాలలో ఉపయోగిస్తారు ఉంటాము. అలాగే ఇందులో గ్రీన్ కలర్, బ్లాక్ కలర్ లో కూడా ఉంటాయి. ఎండు ద్రాక్షలను ఎక్కువగా స్వీట్స్ తయారీ లో వంటకాలలో వాడుతూ ఉంటారు. అలా కాకుండా వీటిని నీటిలో నానబెట్టి కనుక తీసుకుంటే వీటిలోని బెనిఫిట్స్ రెట్టింపుగా పొందవచ్చు
పూర్తి వివరాలకు ఈ వీడియో చూడండి.

ముందుగా రాత్రి పడుకునే ముందు ఒక బౌల్లో కనీసం ఎనిమిది నుండి పది ఎండు ద్రాక్షను తీసుకొని అది మునిగే వరకు నీటిని పోసి నానబెట్టాలి. ఇవి ఉదయానికి బాగా నాని ఉబ్బుతాయి. ఇలా నానిన ఈ ఎండు  కిస్మిస్ లను  పరగడుపున తినేసి నీటిని తాగేయాలి. లేదా ఇలా నానబెట్టిన కిస్ మిస్ లను మెత్తగా గ్రైండ్ చేసి నీటిలో కలుపుకొని జ్యూస్ లా చేసుకుని తాగవచ్చు.

ద్రాక్షల్లో ఐరన్ పొటాషియం మెగ్నీషియం ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. నానబెట్టిన ఎండు ద్రాక్షలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఈ ఫైబర్ మన జీర్ణ శక్తిని పెంచడంలో గ్రేట్ గా హెల్ప్ చేస్తుంది. ఉదయాన్నే ఇలా నానబెట్టిన ద్రాక్షలను తింటూ ఉంటే మీ జీర్ణశక్తి పెరిగి మలబద్దకం తగ్గి గ్యాస్ ఎసిడిటీ అజీర్తి కడుపు ఉబ్బరం వంటి సమస్యలు కూడా లేకుండా ఉంటాయి. అంతేకాకుండా ఈ సమయంలో అత్యంత అవసరమైన ఇమ్యూనిటీని పెరగడానికి ఇవి బాగా హెల్ప్ చేస్తాయి. వీటిలో న్యూట్రీషియన్స్ ఎక్కువగా ఉంటాయి ఇవి మన ఇమ్యూనిటీని పెంచడానికి గ్రేట్ కాల్ చేస్తా యి.

వింటర్ సీజన్ లో వీటిని రెగ్యులర్ గా తీసుకోవడం వలన బ్యాక్టీరియల్ మరియు ఇతర ఇన్ఫెక్షన్లతో పోరాడే శక్తిని శరీరానికి అందిస్తాయి. చాలామంది బ్యాడ్ బ్రీత్ అంటే నోటి దుర్వాసన సమస్యతో బాధపడుతూ ఉంటారు అలాంటి వారు వీటిని తీసుకోవడం వలన ఇందులోని యాంటీ బాక్టీరియల్ లక్షణాలు మన నోటి దుర్వాసనను తొలగించడంలో గ్రేట్గా హెల్ప్ చేస్తాయి.

నానబెట్టిన ఎండు ద్రాక్షలలో  micro-nutrients చాలా ఎక్కువగా ఉంటాయి. ఇవి మన బోన్ హెల్త్ ని  మెరుగుపరచడానికి బాగా హెల్ప్ చేస్తాయి. కీళ్లనొప్పులతో మరియు  ఆర్థరైటిస్ వంటి సమస్యలతో బాధపడుతుంటే ఇవి ఎముకలు దృఢం గా మార్చి కీళ్ళ సంబంధిత సమస్యలను జాయింట్ నొప్పులను తగ్గిస్తాయి. అలాగే నానబెట్టిన ఎండు ద్రాక్షలు ఐరన్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది వీటిని ప్రతి రోజూ తీసుకొనే ఎనీమియా సమస్య కూడా ఉండదు.

1 thought on “ఎండుద్రాక్ష తినే ప్రతిఒక్కరూ ఒక్కసారి ఈ వీడియో చూడండి మీశరీరంలో ఏం జరుగుతుందో తెలిస్తే షాక్.”

  1. ఎండుద్రాక్షలోఇన్నిఆరోగ్యలక్షణాలు వున్నాయని తెల్పనందుకుధన్యవాదాలు.ఇక నుంచి ప్రతిదినం ఇవినానపెట్టితినడానికి అలవాటుచేస్తాను

    Reply

Leave a Comment

error: Content is protected !!