అనేక కారణాల వలన అధిక బరువు సమస్యతో బాధపడేవారు ఇంట్లో ఉండే రెండు పదార్థాలతో చేసుకుని ఈ ఫ్యాట్ కట్టర్ డ్రింక్ తాగడం వలన శరీరంలో కొవ్వు శాతాన్ని కరిగించి అనేక అనారోగ్యాల నుండి మనలను కాపాడటంలో సహాయపడుతుంది. మనం బరువు తగ్గడానికి రకరకాల ఆహారపుటలవాట్లు, వ్యాయామాలు ఫాలో చేస్తూ ఉంటాం. వాటి వలన ఫలితాలు ఉన్నా సంతృప్తికరంగా ఉండకపోవచ్చు. మీ డైట్ కి ఇప్పుడు చెప్పబోయే ఫ్యాట్ కట్టర్ డ్రింక్ ను ఆడ్ చేయండి. ఇది శరీర మూలలలో ఉండే కొవ్వును కూడా మంచులా కరిగించి అధిక బరువు సమస్యను దూరం చేస్తుంది.
దానికోసం మనకు కావలసిన పదార్థాలు నల్ల జీలకర్ర. ఇది పొడవుగా నల్లగా, గోధుమ వర్ణంలో ఉంటుంది. కలోంజి విత్తనాలను నల్ల జిలకర్రగా భావించి అమ్మేస్తూ ఉంటారు. రెండింటికీ మధ్య తేడా గమనించి తెచ్చుకోవాలి. నల్ల జీలకర్ర మీ జీవక్రియను పెంచుతుంది, కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తుంది మరియు మీ రక్తంలో చక్కెరను తగ్గించడంలో సహాయపడుతుంది. బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్న కొంతమందికి జీలకర్ర పొడి తీసుకోవడం సహాయపడుతుందని అధ్యయనాలు నిర్ధారించాయి.
కేలరీలు చాలా తక్కువ. మీకు తెలుసా, ఒక టీస్పూన్ నల్ల జీలకర్రలో ఏడు కేలరీలు మాత్రమే ఉంటాయి. ప్రేగు కదలికను మెరుగుపరుస్తుంది. అధిక ఆకలిని అణిచివేస్తుంది. మీ శరీరాన్ని డిటాక్సిఫై చేసి విషవ్యర్థాలను బయటకు పంపించేస్తుంది. తర్వాత పదార్థం ధనియాలు. ధనియాలు మీ రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది. ధనియాలలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్ యాక్టివిటీని తగ్గించడంలో సహాయపడతాయి. ఇది మీ రక్షణ యంత్రాంగాన్ని మెరుగుపరుస్తుంది మరియు మీరు బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది. మంచి జీర్ణక్రియ విజయవంతమైన బరువు తగ్గించే ప్రయాణానికి మొదటి మెట్టు ధనియాలు తరుచూ తీసుకోవడం.
ధనియాలు, జీలకర్ర సమాన భాగాలుగా తీసుకొని మెత్తని పొడిలా చేసుకోవాలి. పొడిని ఏదైనా గాలి చొరబడకుండా గాజు సీసాలో నిల్వ చేసుకోవాలి. ఉదయాన్నే ఒక గ్లాస్ నీటిలో అర స్పూన్ టీ పొడిని వేసుకోవాలి. నీళ్ళు కొంచెం మరిగిన తరువాత మంట ఆపేసి నీటిని చల్లారనివ్వాలి. నీళ్లు కనీసం గోరువెచ్చగా తాగ గలిగితే కొంచెం వేడిగా ఉండేలా చూసుకోవాలి డయాబెటిస్ లేని వారు ఒక స్పూన్ తేనె కలిపి తీసుకోవచ్చు లేకుండా తాగాలి అనుకునేవారు కూడా తేనె ను కీప్ చేయవచ్చు ఏదైనా ఫ్లేవర్ కోసం నిమ్మరసాన్ని యాడ్ చేసుకోవచ్చు ఇలా ప్రతిరోజు ఉదయం ఈ నీటిని తాగడం వలన శరీరంలో కొవ్వును కరిగించి శరీరం లోకి వచ్చేలా ఈ డ్రింక్ సహాయపడుతుంది