మనం ఆహారంలో మొలకెత్తిన గింజలు తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది అని, తక్కువలో ఎక్కువ పోషకాలు అందుతాయని, మంచి ప్రోటీన్స్, యాంటీ ఆక్సిడెంట్స్ బాగా అందుతాయని చాలామంది వినే ఉంటారు. ప్రస్తుత కాలంలో మైక్రోగ్రీన్స్ అనేవి చాలా బాగా ఫేమస్ అయ్యాయి. అదే విత్తనాలను మొలకెత్తిన తర్వాత ఇంకొక నాలుగు, ఐదు రోజులు ఉంచి చిన్న మొక్కగా వచ్చిన తర్వాత ఆ మొలకకు ఆకులు బయటకు వస్తాయి. ఇలా బయటకు వచ్చిన మైక్రో గ్రీన్స్ అనేవి చాలా మంచిది. మరియు చాలా ఫేమస్. ఇప్పుడు మైక్రో గ్రీన్స్ కు ప్రపంచవ్యాప్తంగా చాలా డిమాండ్ పెరిగింది.
వీటిని ఇప్పుడు ఆన్లైన్ డెలివరీ కూడా చేస్తున్నారు. అంతేకాకుండా మంచి మంచి రెస్టారెంట్స్ లో, ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ లో కూడా వీటిని ఉపయోగిస్తున్నారు. ఇప్పుడు న్యూ ట్రాండ్ మైక్రో గ్రీన్స్. రకరకాల విత్తనాలను మనం మైక్రో గ్రీన్స్ చేసుకొని తినవచ్చు. ఇలాంటి మైక్రో గ్రీన్స్ తినడం వల్ల ఏమేమి లాభాలు కలుగుతాయి అంటే ఇందులో అనేకమైన పోషకాలు ఉంటాయి. విటమిన్ సి, ఇ, కె, బి9, అలాగే లూటీన్, జీయెజ్గాంతీన్, బీటా కెరోటిన్, ఇవన్నీ పుష్కలంగా లభిస్తాయి.
ఇటువంటి మైక్రో గ్రీన్స్ తినడం ద్వారా సైంటిఫిక్ గా ఏమేమి లాభాలు కలుగుతాయో నిరూపించిన వారు 2012 యూనివర్సిటీ ఆఫ్ మేరీ ల్యాండ్ యూ.ఎస్.ఏ వారు పరిశోధనలు చేశారు. 100 గ్రాముల మైక్రో గ్రీన్స్ లో 50 మిల్లీగ్రామ్స్ విటమిన్ సి, బీటా కెరోటిన్ 1-7.7 మిల్లీగ్రామ్స్, విటమిన్ ఈ ఇది త్వరగా ముసలితనం రాకుండా, కణజాలం దెబ్బ తినకుండా ఉండడానికి బాగా సహాయపడుతుంది. ఇది 3-40 మిల్లీగ్రామ్స్ వరకు ఉంటుంది. ఇది మనకు 15 మిల్లీగ్రాములు అందితే చాలు. విటమిన్ కె మనకు రక్తం గడ్డ కట్టడానికి, లివర్కు చాలా ఉపయోగం.
ఇది 1-3 మీల్లిగ్రామ్ లో ఉంటుంది. అలాగే పోలిక్ యాసిడ్ 400 మైక్రోగ్రామ్స్ కావాలి. వీటిలో 100- 200 మైక్రో గ్రామ్స్ వరకు ఉంటాయి. ఫైబర్ మనకు 35 గ్రామ్స్ కావాలి. 100 గ్రాములు తింటే ఆల్మోస్ట్ 30% ఫైబర్ మనకు లభిస్తుంది. అందువలన ఇది చాలా చాలా రీచ్ సోర్స్. కనుక అన్ని పోషకాలను ఒక దాంట్లో పంపించే నాచురల్ ఫ్రీ సోర్స్ మైక్రో గ్రీన్ సోర్స్. కాబట్టి ఇలాంటి మంచి ఆహారం తినే ప్రయత్నం చేయగలిగితే చాలా మంచిది.