Sri Brahmam Gari Vachana Kalagnanam krishnapatnam

బ్రహ్మంగారి కాలజ్ఞానం కృష్ణపట్నంలో నిజమైందా..

ఆయుర్వేద వైద్యం నీ పరిచయం చేసినటువంటి భారతదేశం వైద్యపరంగా ప్రాచీన దేశం అని చెప్పుకోవాలి. సుశృతుడు చేసినటువంట శస్త్రచికిత్స ప్రపంచంలోనే మొదటి చికిత్స. ఇప్పుడు ఆపరేషన్ల కోసం ఉపయోగిస్తున్న ఆయుధాలు ఏవి లేని సమయంలోనే ఆయన రాళ్లు, చెట్ల కొమ్మలతో శస్త్రచికిత్స నిర్వహించారు. ఇంతటి ఘనచరిత్ర ఉన్న ఆయుర్వేదాన్ని భారత దేశమే మొదట కనుగొన్నది. ఇలాంటి ఆయుర్వేదం నుండి ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనాకి మందుకనిపెట్టారు నెల్లూరుకు చెందిన ఆనందయ్య. 

దీనికి పెద్ద స్థాయిలో ప్రచారం కూడా చేస్తున్నారు. అసలు ఈ జబ్బు ఎందుకు వచ్చింది. ఈ మందు ఎందుకు ఆపాల్సి వచ్చింది.ఎంత వరకు పనిచేస్తుంది ఇది ఇప్పుడు ప్రతిఒక్కరినీ వేధిస్తున్న ప్రశ్నలు. కోరంకి అనే జబ్బు వస్తుందని బ్రహ్మంగారు ఎప్పుడో చెప్పారు. అదే నిజమైంది. ప్రతి మనిషికి కూడా బలం అనేది ధైర్యం లోనే ఉంటుంది. ధైర్యంగా ఉన్నప్పుడు ఏదైనా విషయంలో విజయం సాధించగలుగుతారు. ఏదైనా జబ్బుకు చికిత్స లో నైనా సరే మనకి తగ్గిపోతుందని మనోధైర్యం మనల్ని కాపాడుతుంది. ఎంత ధైర్యం ఉంటే అంత ఇమ్యూనిటీపవర్ పెరుగుతుంది. 

ఎవరికైనా కరోనా వచ్చింది అని తెలియగానే ముందు భయపడిపోతున్నారు. దానివల్ల  రోగనిరోధక శక్తి తగ్గిపోతున్నాయి. దానివలన ఆక్సిజన్ లెవెల్స్ పడిపోయి పడిపోతుంది. ఆహారం ద్వారా శక్తిని పెంచుకోవాలి. అలాగే మానసిక ధైర్యం కూడా పెంచుకోవాలి. నెల్లూరులోని మందు పనిచేస్తుందని చాలామంది ప్రచారం చేస్తున్నారు. ఎవరైతే అక్కడ లబ్ధిపొందారో, ఎవరైతే ప్రాణాలతో రక్షింపబడ్డారో వారు అందరికీ చెప్పడం జరుగుతుంది.ఈమధ్య అక్కడికి ఒక టీచర్ వచ్చారని ఆయనకి కళ్ళలో ఏదో చికిత్స చేయడం వల్ల కంటికి సమస్యలు ఏర్పడ్డాయని కూడా చెప్పబడుతుంది. దీని గురించి భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. 

కొందరికి సంగతి మనకి తెలిసిందే. టీవీ చానల్స్ గురించి కూడా మనకు తెలిసిందే. చాలా చక్కగా పనిచేస్తున్నాయి అని కొందరు. ప్రమాదం అని మరికొందరు చూపిస్తున్నారు. ఎలా కచ్చితంగా జరుగుతుంది అని చెప్పే ఆధారాలు లేవు. దీనివలన కరోనా తగ్గుతుంది అంటే మంచిది అని అందరికీ ధైర్యం వచ్చింది. చాలా మంది నెల్లూరు  వరకు వెళ్లారు కూడా. వెళ్ళలేని వారు మందు కోసం పంపించే ఏర్పాట్లు చేయమని వేడుకున్నారు. కానీ ఎటువంటి కరోనా నియమాలు పాటించకుండా ఒకరిపై ఒకరు పడుతూ మందుకోసం తొక్కిసలాట జరిగింది. ఇలా చేయడం వల్ల వైరస్ మరింతమందికి సోకి మరింత ప్రమాదం అయ్యే అవకాశం ఉంది. 

ఇప్పుడు మందు ఇవ్వకపోవడం వల్ల అందరూ ఎవరి ఇళ్లకు వాళ్ళు వెళ్ళిపోతారు. ఇప్పటికే సోకిన వైరస్ మరింత మందికి అంటుకునే ప్రమాదం ఉంది. నెల్లూరు అనే ఊరు మీద ప్రతి ఒక్కరికి చెడు అభిప్రాయం కూడా ఒక పడుతుంది. కాబట్టి మంచి జరుగుతున్నప్పుడు దాన్ని మనం మనిషిగా తీసుకుని అందరికీ ఉపయోగపడే విధంగా ఉంచుకోవాలి. ఆయుష్ సంస్థ ఈ మందు పనిచేస్తుంది నిర్ధారిస్తే చాలు. ఈ మందు కి పేటెంట్ వస్తుంది. ప్రభుత్వం దీనికి మద్దతు ఇస్తూ ప్రజలు వాడడానికి అవకాశం ఇస్తుంది. ప్రతి మందు లోనూ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయి. ఎఫెక్ట్స్ కోసం మందు వాడకపోతే ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంది. ఏ మందులైనా బయటివాళ్ళు ఎవరో చెప్పారని వాడకండి. మీ ఇష్టానుసారం డాక్టర్ సలహాతో మాత్రమే వాడండి.

Leave a Comment

error: Content is protected !!