అల్సర్ వ్యాధి వలన చాలామంది బాధపడుతుంటారు. అలాగే దానిని గ్యాస్ట్రిక్ సమస్య అనుకుని ఎంటాసిడ్ మందులతో గడిపేస్తుంటారు. ఇలా నిర్లక్ష్యం చేయడంవలన కడుపులో రంధ్రాలు ఏర్పడి పుండ్లు అవుతాయి. తీవ్రమైన ఇన్ఫెక్షన్లు గా మారే అవకాశం ఉంది. అంతర్గత అవయవాలకు ప్రమాదం ఏర్పడి ప్రాణాలకు ప్రమాదం రావచ్చు. ఇలా అల్సర్లు ఉన్నప్పుడు వాడే ఎంటాసిడ్ మందుల వలన జీర్ణాశయ కాన్సర్ రావచ్చు. అందుకే మీ శరీరంలో అల్సర్ లక్షణాలు కనిపించిన వెంటనే డాక్టర్ దగ్గర చికిత్స తీసుకోవాలి. అందుకే అల్సర్ వచ్చినప్పుడు శరీరంలో కనిపించే ముఖ్య లక్షణాలు ఏంటో చూద్దాం. మరింత సమాచారం కోసం క్రింద లింక్ చూడండి
మన శరీరంలో దెబ్బతగిలితే పుండ్లు పడినట్లు శరీరంలోపల కూడా పుండ్లు పడతాయి. జీర్ణాశయంలో ,అన్నవాహికలో, పెద్దపేగులో చిన్నపేగులో మన జీర్ణవ్యవస్థ అంతటా కూడా ఈ పుండ్లు రావచ్చు. వీటన్నింటిని కలిపి కడుపులో పుండ్లు అంటారు. ఇంగ్లీషు లో అల్సర్ అంటారు. మన జీర్ణవ్యవస్థ లో మృదువుగా ఉండే రక్షణపొర జిగురుతో మ్యూకస్ మెమ్మరేన్ ఉంటుంది. ఇది రకరకాల కారణాలు వలన దెబ్బతింటే దీనినే అల్సర్ అంటారు. దీనికి రెండు కారణాలు ఉన్నాయి అవి జీర్ణంకావడానికి ఉపయోగకరమైన హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఘాటుగా, ఎక్కువగా తయారవడం, రెండోది హెలికో బాక్టర్ పైలోరి అనే బాక్టీరియా. ఇది ఆహారం, నీళ్ళ ద్వారా శరీరంలో చేరుతుంది. ఇది విషపదార్థాలు విడుదల చేసి అల్సర్ రావడానికి కారణం అవుతుంది. మన దేశంలో డెబ్భై శాతంమందికి పైగా అల్సర్ రావడానికి ఈ బాక్టీరియా కారణమని పరిశోధకులు చెప్పారు.
అల్సర్ లక్షణాలు:- కడుపు నొప్పి వివిధ సమయాల్లో వస్తూ ఉంటుంది. కడుపు నొప్పి వచ్చే సమయం బట్టి ఈ పుండు ఎక్కడ ఉందో అంచనాకు రావచ్చు. మీకు ఆహరం తీసుకుంటున్నప్పుడు వస్తే అన్నవాహికలో ఈ అల్సర్ వచ్చినట్టు భావించాలి. అన్నం తిన్న వెంటనే కడుపులో నొప్పి వస్తే జీర్ణకోశంలో ఈ అల్సర్ ఉన్నట్లు భావించవచ్చు. అర్థరాత్రి కడుపునొప్పి వస్తూ ఉంటే చిన్నపేగు మొదట్లో వచ్చినట్టు, తరచూ గొంతులో మంటగా అనిపిస్తే (యాసిడ్ రిప్లెక్స్) ఇది ఒక రకమైన అల్సర్ లక్షణంగా చెప్పవచ్చు. జీర్ణాశయం నుండి గొంతుకు జీర్ణరసాలు ఎగదన్నినట్టు వస్తే గొంతు మంటగా ఉంటుంది.
అల్సర్ ఉన్నప్పుడు తరుచూ ఇలా అవుతుంది. చాలా సంధర్బాల్లో మంచినీరు,. మజ్జిగ తాగితే ఉపశమనం ఉంటుంది. ఇలా యాసిడ్స్ తరచూ గొంతులోకి రావడం వలన గొంతులోని కణాలు దెబ్బతిని గొంతు కాన్సర్ వస్తుంది. అందుకే నిర్లక్ష్యం చేయకుండా చికిత్స తీసుకోవాలి. ఆకలి తగ్గిపోవడం.తరుచూ నొప్పి రావడంవలన ఆకలి తగ్గిపోతుంది. వాంతులవడం. అల్సర్లు రావడం వలన జీర్ణక్రియ మందగించి ఆహారం సరిగ్గా జీర్ణమవదు. దీంతో ఆహారం వాంతులవుతుంది. లేదా పరగడుపున వాంతులవుతున్నట్టు ఉంటుంది. రక్తహీనత రావడం. ఆహారం జీర్ణమవకపోతే రక్తహీనత వస్తుంది. ఛాతిలో నొప్పి, బరువు తగ్గిపోవడం,ఉమ్ము ఎక్కువగా రావడం, యాసిడ్స్ రిఫ్లెక్స్ రావడం, బ్లాక్ టూల్స్ వలన రక్తం ఎక్కువగా పోవడం, కొన్నిసార్లు రక్తపువాంతులు కూడా అవుతాయి. దీనివలన పేగులకు రంధ్రాలు పడి పదార్థాలు బయటకు వచ్చి ప్రమాదకర పరిస్థితి ఏర్పడవచ్చు.